Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter One : Introduction

 


    
స్వాభిమానము పట్టుదల కలిగిన యువతి నందిత.
డబ్బు మదము, పొగరు, ఏమి పట్టని యువకుడు అభిమన్యు.
వీళ్ళ ఇద్దరి మధ్య జరిగే ప్రేమ పెళ్లి కలల అల్లికనే ఈ ప్రియమైన శత్రువు.
ఇద్దరి మధ్య ప్రేమ వున్నా ఇద్దరి అహం బావనలతో అపోహలతో ఒకరిని ఒకరు తప్పుగా అర్ధం చేసుకుంటూ, ఒకరిని ఒకరు దూరం చేసుకుంటూ, ఒకరిని ఒకరు బాధ పెడుతూ, బాధ పడుతూ, ప్రేమించుకుంటూ ద్వేషించుకుంటూ సాగే వీళ్ళ జీవిత కధే ఈ ప్రియమైన శత్రువు.

అభిమన్యు (అభి)

అభిమన్యు అందగాడు, పరిపూర్ణ ఆరోగ్యం తో శారీరక దృఢత్వాన్ని కలిగినవాడు, సుమారు ఆరు అడుగుల రెండు అంగుళాలు పొడవు తో, పొడుగు కి తగ్గ బరువు తో, తెల్లగా, మంచి హ్యాండ్సమ్ గా వుంటాడు.
కానీ బాగా డబ్బు పొగరు, అహంకారము, ఎవరిని లెక్క చెయ్యని స్వబావం, తను కోరుకున్నదే జరగాలని పట్టు పట్టే మనస్తత్వం.
చదువులో తలుచుకుంటే గోల్డ్ మెడల్ కూడా తెచ్చు కోగల ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయినా డబ్బు గర్వం తో దేని నైనా కొనగలను అన్న ధీమా తో ఎప్పుడూ కయ్యానికి దిగుతాడు.
చెడు సావాసం లో పడి సిగరెట్, మందు, పబ్స్, డిస్కో తెక్ ల తో టైం వేస్ట్ చేస్తుంటాడు.
అతనొక స్టయిల్ ఐకాన్.
అమ్మాయిల కి తనంటేక్రెజ్ అని తెలుసు కాబట్టి చాలా గొప్ప గా ఫీల్ అవుతాడు.
వాళ్ళతో ఎంత దూరం వెళ్లడానికైనా వెనకాడడు. ఎవరైనా తనని పట్టిచుకోవట్లేదు అని తెలిస్తే సహించలేడు చాలా ఇన్సల్ట్  గా ఫీల్ అవుతాడు.
అభిమన్యు వేసుకునే భట్తల బట్టే తన స్టేటస్ఏమిటో అర్ధము అవుతుంది.
ఎప్పుడూ డిజైనర్ బట్టలే వేసుకుంటాడు. ఎక్కువగా అడిదాస్,  కాల్విన్ క్లైన్, ఆర్మాని, జార్జియో, పోలో, డీజిల్ జీన్స్, సిజేర్ పాసియోట్టి, లోవ్ వాలెంటిని బూట్లు,  రేబాన్ గ్లాసెస్ తో కనపడతాడు.
ప్రస్తుతం లేటెస్ట్ స్పోర్ట్స్ బైక్ డుకాటి మోన్స్టర్ ని తన సొంతం చేసుకున్నాడు.
మార్కెట్ లో ఏది లేటెస్ట్ వస్తే అది తన సొంతం అయ్యే వరుకు ఊరుకోడు.

అభిమన్యు సూపర్ రిచ్ ఫ్యామిలీ కి చెందినవాడు.
అభిమన్యు పుట్టేసరికి తరగని సంపద వాళ్ళ ఫాదర్ గుట్టలు గుట్టలుగా కూడబెట్టారు.
తల్లి తండ్రి అంటీ లెక్క చెయ్యడు, పెద్ద లంటే గౌరవం లేదు, క్రమశిక్షణ, బాధ్యత, అనుబంధాలు అంటే  "వాట్ నాన్సెన్స్!" అంటాడు.
మనుషుల మనసు, వాటి ఫీలింగ్స్ గురుంచి లెక్క చెయ్యడు, నోటికి వచ్చినది వాగుతాడు, తన వలన ఎవరికైన బాధ కలిగిందా అని చూడడు.
అందరు నా కాళ్ళ మీద పడాలి అంటాడు. "ఐ హావ్ పవర్ ఆఫ్ మనీ అండ్ ఐ రూల్ ఎవరీ వన్ !!"  అన్న కాన్సెప్ట్ తో బతుకుతాడు.
జీవితాన్ని అందాలకి, కోర్కెలకి, అనుబూతులకి, అనుభవాలకి అంకితం చేసేసాడు.
శ్రమ విలువ అసలు తెలీదు.
మంచైనా చెడైనా అభిమన్యు కోరింది అతనికి దక్కాలి.

నందిత (నందు)

నందిత సన్నగా, అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవుతో,  గోధుమరంగు ఛాయతో, యెర్రని చెక్కిళ్ళ తో , పెద్ద పెద్ద కాటుక కళ్ళ తో, మెలి తిరిగిన కను రెప్పల తో,  నల్లగా ఎంతో సొగసుగా ఉండే పొడుగాటి వాలు జడ తో అందానికే వంక పెట్టేలా ఉంటుంది.
ఎప్పుడూ కాటన్ చుడిదార్ తో చున్నీ నిండుగా కప్పుకుని ఉంటుంది.
సాదా చెప్పులు, చెవులకి చిన్న బంగారు జూకాలు.
మెడలో పల్చటి బంగారు గొలుసు, ఒక జత బంగారు గాజులు, నల్లటి గుండ్రటి బొట్టు తప్ప ఇంకేమి అలంకరణ ఉండదు.
ఎప్పుడు అయినా పండగ కి లంగా వోణి వేసుకుంటే ఏ బాపు బొమ్మో, గంధర్వ  కన్యో దిగి వచ్చిందా అనిపిస్తుంది.
నందిత కి మంచి ఫిగర్ ఉంది అని స్టూడెంట్స్ అంటూ ఉంటారు.  

అటు నందిత చక్కని తెలుగింటి ఆడపడుచు లా ముద్ద మనోహరంగా చూడ ముచ్చటగా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ వుంటుంది.
నందిత వాళ్ళది మధ్య తరగతి కుటుంభం.
ఒక తమ్ముడు, చెల్లెలు.
తండ్రిగారి సంపాదన మీదే ఇల్లు నడుస్తుంది. తల్లి ఎంతో పొదుపుగా ఉన్న దానితో ఇంటి కర్చులు సర్దుతూ కాలం గడుపుతుంది.
నందిత పక్క పిల్లలికి ట్యూషన్ చెప్తుంది. నందిత కి చిన్నప్పటి నుండి డాన్స్ అంటే బాగా ఇష్టం అందుకే పాకెట్ మనీ కోసం పిల్లలకి టాలెంట్ షౌస్, కాలేజీ ఈవెంట్స్ కి ఫ్రెండ్స్ కి బాలీవుడ్ డాన్సు లు నేర్పిస్తుంది.
తమ్ముడికి చెల్లికి హోంవర్క్ కి హెల్ప్ చేస్తూ వాళ్ళతో చాలా అన్యోన్యంగా ఉంటుంది.
వాళ్ళకి కూడా నందిని అంటే ఎంతో ప్రేమ.
"మా అక్క చాలా మంచిది, బంగారం, మేమంటే ఎంతో ఇష్టం!" అని అందరికి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. 

తల్లి తండ్రి అంటే  ఎంతో ప్రేమ, భక్తి, శ్రధ లతో ఉంటుంది.
తమ్ముడు చెల్లలు ని ప్రాణం కన్నా ఎక్కువుగా ప్రేమిస్తుంది.
క్రమ శిక్షణ, సాంప్రదాయ కట్టు బాటులకి కట్టిబడి ఉంటుంది.
ఎంతో ఆత్మబిమానం గల పిల్ల, పెద్ద లంటే గౌరవము, డబ్బు  విలువ తెలుసు గనుక ఒక్క పైసా కూడా వేస్ట్ చెయ్యదు.
నందిత కి సోమరి పోతులన్నా, గర్విష్టులన్నా, డబ్బు మదం ఉన్న వాలన్నా, డబ్బు విలువ తెలియని వాలన్నా అసలు గిట్టదు, వారిని క్షణం కూడా సహించలేదు.
ఒక్క ముక్క లో చెప్పాలంటే అభిమన్యు లాంటి వాళ్ళ ని ఒక క్షణం కూడా భరించలేదు.

ప్రస్తుతం అతని బాధ అదే.
అమ్మాయిలకి తనంటే ఎంత పిచ్చి మరి నందిత తనని ఒక పురుగు ని చూసినంత హీనంగా చూస్తుంది.
అందుకే నందిత ని తన బద్ధ శత్రువు గా చూస్తాడు.
ఎలాగైనా నందిత ని తన బుట్టలో వేసుకోవాలని చాలా ట్రై చేస్తుంటాడు. 

నందిత కి ఎలాంటి క్యారెక్టర్ అసలు భరించలేదో దానికి  ప్రతి రూపమే అభిమన్యు.
అతనంటే కంపరము, అసహ్యము వేస్తుంది తనకి.
ఎంత అందగాడైతే ఏంటి హర్షించగల ఒక సుగుణం కూడా లేకపోతే అంటుంది నందిత.