Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Two : Abhimanyu teasing Nanditha about her dance competition

 


సూరత్కల్ మంగళూరు పట్టణం లోదక్షిణ కన్నడ డిస్ట్రిక్ట్ లో ఉంది.  వూరు గొప్పతనమేమిటంటే ఇక్కడ ఎన్నోప్రతిష్టాకరమైన విద్యా సంస్థలుపరిశ్రమలు  ఉన్నాయి వూరికి ఇంకో గొప్ప తనమేమిటంటేపూర్వము మన పురాణాలలో చెప్పుకునే వినాయక రావనాసుర్ల శివలింగ కథలోగోకర్ణ లో రావనాసుడు కోపముతో భూమి లో దిగపడిన శివ లింగాన్ని బలమంతా వుపయోగించి లాగినప్పుడుతలో దిక్కు పడిన ముక్కల లో ప్రధమ మైన ముక్క ఇక్కడ సూరత్కల్ లో పడిందిటమరో ముక్క మురుడేశ్వర లో
 పడిందిట.
సూరత్కల్ ఎన్నో పేరుగలకీర్తిగలప్రతిష్టిగల విద్యా సంస్థల లకి చక్ర నాభి లాంటిదిఅందులోని అతి ప్రతిష్టమైన కాలేజీ NITK (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక). అరేబియన్ మహా సముద్రము వడ్డుననేషనల్ హైవే 17 మీద స్థాపించ బడినదిNITK సూరత్కల్ ప్రపంచములో అతి తక్కువ విద్యా సంస్థలలోగర్వముగా చెప్పుకునే ఒక ప్రైవేటు బీచ్ మరియు ఒక లైట్ హౌస్ ఉన్నాయికాలేజీ కాంపస్ సుమారు 295 ఎకరాలు వుంటుందిచుట్టురా ఆకుపచ్చ చెట్లు చేమలతో ఎంతో ఆకర్శనీయముగా ఆహ్లాదంగా వుంటుందిఇక్కడి ప్రశాంతమైన వాతావరణము విద్యార్థిని విద్యార్ధులకు ఉల్లసమేగాక గాక సీరియస్ గా చదువుకోడానికి ఎంతో ప్రోత్సాహిస్తుందిఇక్కడికి ఉడుపిధర్మస్థల మరియు మణిపాల్ చాలా దగ్గర.
ఇక్కడికి NITK బీచ్పణంబూర్ బీచ్కాపు బీచ్మురుడేశ్వర బీచ్ మరియు సేఇంట్ మేరీస్ ఐలాండ్ ఛాలా దగ్గర.
*******************************************************


NITK (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక) లో..... 

అప్పుడే కాలేజీ లోకి అందరు స్టూడెంట్స్ వస్తున్నారుకాంపస్ అంత హడావిడిగా ఉందిక్లాసులకి వెళ్ళేవాళ్ళురంగు రంగుల సీతాకోక చిలుకల్లా స్టూడెంట్స్ అటు ఇటు తిరుగుతున్నారు. నవ్వుతూ త్రుళ్ళుతూ రకరకాలుగా స్పందిస్తూ కాంపస్ కి వింత శోభ తెస్తున్నారు.
కాలేజీ మెయిన్ ఎంట్రన్సు దగ్గర ....
"నందు!!!  ఏమిటే అంత పరద్యానంగా వెళ్ళిపోతున్నావు...ఆగు వస్తున్నాను...వెయిట్ చెయ్యి అంటూ కాలేజీ లోకి వెళుతున్న నందిత ని ఆగమని అరుస్తూ వచ్చింది శ్రుతి.
"అబ్బా రావే తొందరగా మల్లీ  అభిమన్యు వాళ్ళ గ్యాంగ్ తో వచ్చే లోపల...అంది విసుగ్గా నందిత.
 "అబ్బా ఎందుకే పాపం అభిమన్యు మీద అంత కోపంనిన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు కదేఎంత పోకిరి అయినా పాపం నువ్వు అంటే భయం." అని నవ్వింది శ్రుతి.
నందిత ఏదో అనే లోపల అక్కడికి పెద్దగా చప్పుడు చేస్తూ ఒక అయిదు మోటర్ బైక్ లు వచ్చాయి. అందులో ఒకరు బైక్ పార్క్ చేసి హెల్మెట్ తీసి స్టైల్ గా చేత్తో పట్టుకునిఒక చేతి తో క్రాఫ్ట్ సరి చేసుకున్నాడుఅతనే అభిమన్యు.


"అనుకున్నదంతా అయ్యింది. అభీ చూసేసాడు.... అందుకే రావే తల్లి అని తొందర పెట్టాను...నిక్కుతు నీలుగుతూ మెల్లిగా రెడీ అయితే ఇలానే వుంటుందిఅది కాక పాపం అభీ అంటూ వాగుతావు... పద ఇప్పటికైనా... " అని తల ఇటుపక్కకు తిప్పి... నా లక్ష్యం క్లాసు కి వెళ్ళడమే అన్నట్టు ఎటూ చూడకుండా ఫాస్ట్ గా అభిమన్యు గ్యాంగ్ ని ధాటి వెళ్ళబోయింది. 

అంతే అనుకున్న దంతా అయింది.  మూలగా చెట్టు కింద బైక్ పార్క్ చేసి దానిమీద స్టైల్ గా కూర్చుని గ్లాసెస్ తిప్పుతో అభిమన్యు నందిత నే చూస్తున్నాడు. వెంటనే మొహం మీద చిరునవ్వు వచ్చిందికళ్ళ లో కసిచిలిపితనం వేణు వెంటనే వచ్చేసాయితన మిత్ర బృందం వంక వినోదంగా చూసి కన్ను గీటాడు.   

చుట్టూ ప్రక్కలున్న స్టూడెంట్స్ ఇప్పుడేదో తమాషా జరుగుతుంది అని పసిగట్టి ఎక్కడివాళ్ళు అక్కడే ఆగి మరి చూస్తున్నారుఅందరికి తెలుసు అభిమన్యు కి నందిత కి ఒక క్షణం కూడా పడదనిపచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుందనిస్వతహాగా నందిత ఎవరి జోలుకి వెళ్ళదుతనని ఏమన్నా పట్టించు కొదుచాలా ఓర్పు తో సహనము తో ఉంటుందిసామాన్యంగా అందరికీ నందిత అంటే ఇష్టంతను చాలా మంచి అమ్మాయి అనిఎంతో ప్రేమ గా ఎప్పుడు నవ్వుతూ అందరికి సహాయం గా ఉంటుందని  అభిమానం గా ఉంటారుఅలాంటిది ఎవరికి అంతు పట్టనిది ఏమిటంటే నందిత కి అభిమన్యు ఏమన్నా తనకి కోపం వస్తుందిపొగరుగానిర్లక్ష్యం గా కేర్ చెయ్యకుండా మాట్లాడుతుందిఅందరి తో ఉన్నట్టుగా అతనితో ఉండలేదుతన స్వభావానికి విరుద్దం గా బిహేవ్ చేస్తుంది.  మార్పు నందిత గమనించక పోలేదుఎంత కంట్రోల్ చేసుకున్నా అభిమన్యు ని చూడగానే అసహ్యము కోపము చిరాకు వస్తాయి.

అభిమన్యు బాధ కూడా అదేతనంటే నందిత కి ఎందుకు అంత కోపమో అర్ధం కాదుఅందరితో మంచిగా ఉండే నందిత తన దగ్గర కొచ్చేసరికి rude గా ఉంటుందిపురుగు కన్నా హీనంగా చూస్తుందితను  ఏమీ ద్రోహం చేసాడు తనకిఎంత మంది తనంటే పడి చస్తున్న ఒక్క నందిత నిర్లక్ష్యమే బాధ గా ఉంటుందిఎలాగైనా నందిత ని తన కాళ్ళ మీద పడేలా చెయ్యాలి అనేదే అతని కోరికదాని కోసం ఏమైనా చేస్తాడుఎంతకైనా తెగిస్తాడు.

తన మిత్రబృందం అందరిని రాగింగ్ చేస్తున్నప్పుడు తను నలుగురిలో ఒకరిగా ఉంటాడే కానీ ఎవరిని ఏమీ అనడు ముసిముసిగా నవ్వుతాడు తప్పఅలాంటిది అందరు నందిత ని చూడగానే నోర్లకి మూతలు వేస్తారు కానీ అభిమన్యు  క్షణం కోసం ఎదురుచూస్తాడుఅసలు తను కాలేజీ కి ప్రస్తుతం  పనికోసమే వచ్చాను అన్నట్టుగా అలర్ట్ అవుతాడు.

నందిత ని ఒక క్షణం పైనుంచి కిందకి తదేకం గా చూసాడు మహా గొప్ప అందగత్తి కాకపోయినా కళ్ళు చెదిరే అందముతన రూపము ఎంతో ఆకర్షణీయముగా కళ్ళలో ఏదో మాగ్నెటిక్ పవర్ ఎదుటివాళ్ళని ఆకర్షిస్తుంది. ఇంకా అలానే చూస్తే మతి పోతుందని తెలుసుకుని రంగంలో కి దిగాడు.

"డియర్ స్టూడెంట్స మీలో ఎవరికైన డాన్సు బేబీ డాన్సు లో నైనా లేక బూగి ఊగి డాన్సు కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ కొట్టేయాలని ఉంటే చెప్పండినందిత టీచర్ తో డేట్ ఫిక్స్ చేస్తానుఆవిడ బాగా తై తక్కలు నేర్పిస్తారుట !!!"
అని అభిమన్యు అందరికీ వినపడేలా "డేట్" అన్న పదాన్ని గట్టిగ వత్తుతూ అరిచాడు. 
నందిత కి ఒక్క నిముషము షాక్ తగిలింది అభిమన్యు కి ఎలా తెలిసింది తను డాన్సు నేర్పిస్తుంది అనిఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడిందిషాక్ లోంచి తేరుకుని కోపంగా అభిమన్యు వంక చూసింది. తనకి డాన్సు నేర్పడము నామోషి కాదు కానీ అభిమన్యు లాంటి వాళ్ళు దానిని అవహేళన చేసి పెద్ద తమాషా చేస్తారని ఊహించే ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడింది. తన పేరు ఎవరిని బయటకి చెప్ప వద్దని చెప్పింది. అనుకున్నదంతా అయ్యింది.

నవ్వుతూ తన వంకే చూస్తున్నాడు అభిమన్యుకళ్ళ తో పొగరుగా "ఏంటి ఇప్పుడు ఏమంటావ్" అని కన్నుగీటాడు.
వళ్ళు మండింది కానీ ఇప్పుడు అభీ తో తనకి గొడవ పడే మూడ్ లేదు సో వెళ్లిపోవాలి అనుకుంది.
"అందరికీ ఇది ఒక వినోదంగా వుంది ప్రతి సారీకానీ అభీ కి ఇది అర్ధం కాదుతను బయపడి పోయాను అనుకుంటాడుతను గెలిచాడని గర్వ పడతాడుఅది తనకు ఇష్టం లేదుఅభీ కి ఇదేమి పట్టనప్పుడు తనెందుకు కేర్ చెయ్యాలి" అనుకుంది.
అంతె తను ఎదురు జవాబు ఇవ్వడానికి రెడీ అయింది.

"పాపం టీచర్ గారికి కోపం వచ్చినట్టుందిఫ్రీ గా ఏమీ కాదు టీచర్ మీకు ఎంత డబ్బు కావాలన్నా ..." అంటూ నందిత మొహం ఎర్రగా మారడం చూసి ఇంకా ఎదిపియ్యాలని అదే మీకు డబ్బు పడదు కదాఇంకేవైన కూడా సమర్పించగలమని అంటున్నాను...మరి మీరు మీ స్టూడెంట్స్ దగ్గర డబ్బులు తీసుకోకుండా మీ ఫీజు ఎలా ఛార్జ్ చేస్తారు చెప్పండి ??? మరి డబ్బులు తీసుకోకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది టీచర్ " అన్నాడు నందిత మొహం చూస్తూ వినోదంగా.

అభిమన్యు కి తెలీదు కానీ నందిత ఎంత హర్ట్ అయిందంటే అతని మీద ఒక జుగుప్సుతనము ఏర్పడింది.
"ఇంత దిగజారి కూడా మాట్లాడుతారా" అనుకుంది.
 చుట్టురా అందరూ గుమి కూడు చూస్తున్నారుతను ఏమీ సమాధానము చెప్తుందో అని.

వెంటనే నందిత "అవును మిస్టర్ అభిమన్యు.. నేను తై తక్కలు నేర్పిస్తున్నాకష్టపడి నాలుగు రాళ్ళూ సంపాదిస్తున్నాను సోమరిపోతులా బాబు సంపాదించిన డబ్బుతో విందులు వినోదాలు డిస్కో లని క్లబ్స్ అని గర్ల్ ఫ్రెండ్స్ అని  షికార్లు కొట్టట్లేదుడబ్బులు లేకున్నా పరువుగా గడుపుతున్నాముఅత్మభిమానము ఉన్నాయిఅవి నీకున్నా, కొంచమైన  సంస్కారము ఉన్నాఇలా అందరిముందు నోరు పారేసుకోవు. కట్ల కట్ల నోట్లు సంపాదించడమే కాదు పిల్లలకి క్రమశిక్షణ కూడా నీర్పాలని మీ ఫాదర్ కి తెలీదు కాబోలు అందుకే బాగా డబ్బు మదం తో వున్న నిన్ను ఊరి మీదకి వదిలారు.  మరొక విషయం డబ్బు విలువ తెలియని వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాపాపమేనీ దగ్గర నీ ఫ్రెండ్స్ దగ్గర డబ్బులు తీసుకునేకన్న ముష్టివాడుఅడుక్కుని నాలుగు పైసలు సంపాదించిన వాడి ని అడుక్కున్నా తప్పులేదు. గుడ్ బాయ్ !!!!!"     అనేసి చకాచకా వెళ్లిపోయింది.


అభిమన్యు ఆ షాక్ కి రక్తం గడ్డ కట్టింది. ఆగ్రహం తో ఆవేశం తో ఊగిపోయాడు.కళ్ళు రక్తం చిమ్ముతున్నట్ట్లుగా ఎర్రబడ్డాయి. శరీరం ఉద్రేకంతో ఉద్వేగంతో వణికిపోతోంది.అభ్మన్యు పెనువేగంతో కదలి రెండు అంగుల్లాల్లో నందిత ని సమీపించి, పట్టరాని కోపంతో ఆమె కళ్ళలోకి చూసాడు.
నందిత భయపడలేదు. అదే నిబ్బరం తో అభిమన్యు కళ్ళలోకి చూసింది.

ఏదో చెయ్యాలి! తనకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలి. కానీ నందిత కళ్ళలోకి చూస్తే ఏమీ చెయ్య లేక పోతున్నాడు. ఎందుకని? నందిత అంటే తనకి కోపం, పగ, కసి కదా మరి ఎందుకు ఏమీ చెయ్యలేక పోతున్నాడు. మొదటిసారి తన మీద తనకికోపం వచ్చింది. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. కానీ నందిత ని చూస్తె కోపం వస్తోంది. అసలు ఏమీ జరగనట్టు నిశ్చలంగా వుంది.

నందిత కి ఆ ధైర్యం ఏమిటో అర్ధం కావట్లేదు అభిమన్యు కి . తన పలుకుబడితో నందిత ని ఏమైనా చెయ్యగలడు. ఆమెను అంతకు పది ఇంతలు అవమానము చెయ్యగలడు తాను తలచుకుంటే నందిత నామ రూపాలు లేకుండా చెయ్యగలడు.
కానీ అతని మనసాక్షి వప్పుకోవట్లేదు . నందిత బవిష్యత్ ఏమవుతుంది అని బాధ పడుతోంది మనసు. అతని కి ఏమిచెయ్యాలో తెలియక మనసు కొట్టుమిట్టాడుతోంది.
 
అక్కడికి చేరిన స్టూడెంట్స్ కి ఏదో జరుగుతుంది అనుకుంటే ఏమీ అవట్లేదని నిరుత్సాహ పడ్డారు

ఆ సమయంలో ....

అభిమన్యు నందిత భుజాన్ని పట్టుకున్నాడు కసిగా. నందిత ని తాకగానే వెయ్యి వోల్టుల కరెంటు షాక్ కొట్టినట్టు అయ్యింది. ఏదో మైకం కమ్ముతోంది కళ్ళకి! ఏంటిది తనకి ఏమవుతోంది! నందిత ని అందరి ముందు అవమానించాలని అనుకున్నాడే! మరి ఏమిటిప్పుడు ఇలా అవుతోంది? అదే పరవశము తో నందిత కళ్ళలోకి చూసాడు. నందిత తనని పట్టిచ్చుకోవట్లేదు! ఎటో చూస్తోంది, తనకేమి పట్టనట్టు.

చల్ల గాలికి
ఆ నిముషము అభిమన్యు కళ్ళలో బాధ, వెంటనే కోపం ఉప్పొంగింది. నందిత అభిమన్యు కళ్ళలోకి చూసి వుంటే, అతని బాధ కనిపించేదేమో! అప్పుడు అక్కడ వాతావరణము వేరేగా వుండేదేమో! 

ఒక క్షణం ఆమెను కుదిపేసాడు. నందిత జుట్టు ముఖము మీద పడి ఎంతో ఆకర్షనీయం గా ఉంది. చూడముచ్చటగా ఉంది. అభిమన్యు కి మతి పోతోంది. మొదటిసారి నందిత ని ఇంత దగ్గరగా చూస్తున్నాడు. నందిత కన్నా అందమైన వాళ్ళని ఎంతో మందిని తన పార్టీ ల లో కలిసాడు కానీ చాలా ఆకర్షణ వుంది నందిత లో అనుకున్నాడు. నందిత ముఖములో ఎటువంటి ప్రకమ్పనలూ లేవు. కానీ అభిమన్యు నరాల్లో ఉద్వేగం, కసిగా కసి కసిగా నందిత ని గట్టిగా హత్తుకుని పెదవుల్ని కొరికేయ్యాలని వుంది.

నందిత ముఖంలో ఎటువంటి రియాక్షన్ లేదు. మల్లీ అనుకున్నాడు ఏమిటి నందిత ధైర్యం, ఈ క్షణాన తలచుకుంటే ఏమైనా చెయ్యగలనే! నాకు అడ్డువచ్చే వారెవరు లేరే! మరేమిటి నందిత ధైర్యం?

ఆ మాత్రమైన నందిత ని ముట్టుకున్న మొగవాడు అభిమన్యు అయినందుకు అందరికి అసూయ గా వుంది.

నందిత అభిమన్యు చెయ్యిని పురుగును తీసి నట్టు విసిరికొట్టింది. నేను రుద్రుడిలా నందిత మీద కి వెళ్ళినా, చీమ కుట్టినంత రియాక్షన్ కూడా లేదు. అవ్వ ... ఇంత అవమానమా ? నేనెలా తలెత్తి తిరగ్గలను? అందరూ పిరికివాడిననుకుంటారు ఏమీ చూసి నందిత కి ఇంత బలం? అండ? ఇంక అభిమన్యు సహన శక్తి పోయింది, ఇంతక ముందు వున్నస్వీట్ ఫీలింగ్స్ అన్ని గాలిలోకి కలిసిపోయి తన నిజమైన క్యారెక్టర్ భైటకు వచ్చింది. మల్లీ గట్టిగా చేత్తో నందిత ముఖము పట్టుకుని కళ్ళలోకి చూస్తూ చాలా కటువుగా , బిట్టర్ గా అన్నాడు...

"ఇదే నీకిస్తున్న లాస్ట్ వార్నింగ్! థిస్ ఈస్ నాట్ యువర్ ఫస్ట్ టైం. డోంట్ లూజ్ యువర్ టంగ్! నీ కెంత ధైర్యం నన్ను అవమానించడానికి? మా డాడీ గురించి అన్ని మాటలనడానికి? నీ స్టేటస్ ఏంటి? నా స్టేటస్ ఏంటి? వళ్ళు దగ్గరుంచి మాట్లాడు. నేను నీ బాబు ని అంటే ది గ్రేట్ బిజినెస్ మాగ్నెట్ మా డాడీ ని అంటావా? ఎందుకు నీకు ఇంత మితిమీరిన అహంకారం? అంతా కలిపినా నీ ఆస్తి యాభై లక్షలు కూడా దాటవు? మరి నాకో అయిదొందల కోట్లు. నాకెంత అహం వుండాలి?
నేను అన్నదానిలో తప్పేంటి? డబ్బుకోసం ఏ పని చెయ్యడానికైనా నీ లాంటి లో క్లాసు వాళ్ళు ఏమైనా చేస్తారు! ఎంతకైనా దిగజారుతారు! ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్!  డబ్బు పడేస్తే కుక్కల్లా కాళ్ళ మీద పడతారు! డిస్గస్టింగ్ పీపుల్. ఉన్నదంటే ఉలుకెందుకు? ఫర్ ఇన్స్టన్స్ నిన్ను నేను పెల్లిచేసుకుంటాను అంటే ఈ కోపం ఆవేశం అన్ని పక్కన పెట్టి గంతులేసుకుంటూ గంగిరెద్దులా తలాడిస్తూ వస్తావు. నీ లాంటి ఆడవాళ్ళని దారికి ఎలా తెచ్చుకోవాలో నాకు బాగా తెలుసు! చిటికెలో నా వళ్ళో వాల్చగలను. నాకు ఇది కొత్త ఏమీ కాదు. నన్ను మల్లీ రెచ్చగొడితే దారుణమైన పరాభవం పొందుతావు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక ఆడదానివి అది గుర్తుంచుకో. నిన్ను నీ ఫ్యామిలీ ని నామ రూపాలు లేకుండా చెయ్యగలను. బిహేవ్ యువర్ సెల్ఫ్!!!! డోంట్ ఈవెన్ డేర్ !!! గాడ్ డామ్ ఇట్.. మూడ్ అంత పాడుచేసావు! నన్ను డిస్టర్బ్ చేస్తే ఎవరినైనా నేను వదలను. లిమిత్స్ దాటుతున్నావు.. నీకే నష్టం...     " అని వదిలేసి తన బైక్ దగ్గరికి వెళ్ళిపోయాడు.

అందరూ బిత్తర చూపులు చూస్తూ ఉండిపోయారు. ఆ నిముషం అభిమన్యు లో మొండితనము, పౌరుషం, ఉక్రోషం,ఆత్మాభిమానం, ఒకింత మూర్ఖత్వం కూడా కనిపించాయి.

ఏ క్షణంలోనైనా బ్రద్దలవబోయే అగ్నిపర్వతంలా అయ్యింది నందిత. ఆమె రక్తకణాలు టెన్షన్ భరించలేకపోతున్నాయి.పౌరుషం, పగ, కోపం, ప్రతీకారం తో ఊగిపోతోంది. ఏమిటి తను చేసిన తప్పు? ఏమిటి తన మీద ఇంత పగ? ఏమిటి తను అభీ కి చేసిన ద్రోహం? కొద్ది క్షణాలు ఆలోచించి అభిమన్యు ఉన్నా దిశకి దూసుకుపోయింది నందిత. 

"చూడు మిస్టర్! నోటికి వచ్చినట్లు వాగితే నీ నోటి దురదే పోతుంది తప్ప నిజము అబద్దము కాదు. ఒక్క విషయం నీకు చెప్పాలి.ఎస్ ! మేము పేదవాళ్ళమే, మా ఆస్తులు అంతా కలిపినా నీ కుక్క కు రోజులో ఒక పూటకి అయ్యే కర్చు కూడా ఉండదు. ఎస్ ! డబ్బు పడేస్తే కుక్కల్లా వెనకాలే తిరుగుతారు కానీ మేము ఆ జాతి కి చెందినవాల్లము కాదు. మా అమ్మ నాన్న మాకు ఎన్నో మంచి సంస్కారాలు నేర్పారు, ఎదుటి వాళ్ళు ఎంత వెధవలైన, మూర్ఖులైన, ఏమీ వాగినా ధైర్యం గా సమాధానమిచ్చేగుండె నిబ్బరం నేర్పారు. ఎటు వంటి వాళ్ళనైన, ఎంత బలవుంతులైన, ఎంత పవర్ ఉన్నా వాళ్ళనైన, ఎలాంటి మృగాలైన,  డబ్బు మదంతో ఊగుతున్న దున్నపోతులునైనా, మనము వాళ్ళని జయించలేమని తెలిసినా ప్రాణం తెగించి ఆత్మాభిమానము, పరువు నిలుపుకునే ఆత్మా స్తైర్యాన్ని ఇచ్చారు.

మరి నీకు మీ మమ్మీ డాడీ ఏమిచ్చారు?

చెప్తాను విను బాగా విను. ఇప్పటివరుకు నీతో ఈ మాటలనే ధైర్యం నీ నక్క జిత్తుల ఫ్రెండ్స్ కి కానీ, నీ వెనుక కుక్కల్లా పెంపర్లాడే నీ గర్ల్ ఫ్రెండ్స్ కి కానీ, మీ సూపర్ రిచ్ ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ అంతెందుకు నిన్ను కన్నామీ అమ్మ నాన్నలకే కానీ లేదు. వళ్ళు దగ్గరుంచి, అలెర్ట్ గా విను...
నువ్వు ఒక సోమరిపోతువి, నీకు ఆత్మాభిమానము లేదు, ఆత్మా గౌరవము లేదు, ఒక వ్యక్తిత్వము లేదు, జీవిత లక్ష్యం లేదు, నీకు శ్రమ విలువ తెలీదు,నీకంటూ సొసైటీ లో ఒక ఇమేజ్ లేదు. నువ్వు అనుభవించే ఒక్కొక్క పైసా మీ డాడీ స్వశక్తి తో, స్వయంకృషి తో సాధించినవి. సొసైటీ లో ఎంతో గొప్పగా చెప్పుకోదగ్గ బిజినెస్ మాన్ గా గుర్తింపు ఉంది. మరి నీకో ...మకరంద్ దేశ్ పాండే గారి కొడుకు అన్న ఐడెంటిటీ తప్ప ఇంకేముంది?" 

నందిత మాటలకి షాక్ లోకి వెళ్ళాడు. ఇంతవరుకు తనని పొరపాటున కూడా మమ్మీ డాడీ కూడా ఒక్క చిన్న మాట కూడా అనలేదే, అలాంటిది ఏ ధైర్యం తో తనని ఇన్ని మాటలు అంటోంది. ఆ మాటలు తను ఎలా వింటున్నాడు, ఇది నిజామా లేక కలనా? మతి పోతోంది!  తన కళ్ళలోకి సూటిగా చూస్తూ అసలు తొణకక బెణకక ఇంకా ఆవేశంగా అలానే తన ధోరణిలో నందిత మాట్లాడుతోనే ఉంది.

"నువ్వు ఒక అసమర్దుడివి! తల్లి తండ్రుల మీద ఆధారపడే పారసైట్ లాంటి వాడివి! ఇప్పుడు చెప్పు? నీ స్టేటస్ ఏంటో? మా స్టేటస్ ఏంటో? సొసైటీ లో ఎవరికి పేరు ఉంది? నీకా? నాకా? ఎవరు గొప్ప? పిల్లలిని ప్రయోజకులను చేసిన మా నాన్నగారా ? నీ లాంటి పారసైట్ కొడుకుని కన్న మీ డాడీ నా?"


నందిత అభిమన్యు కి దగ్గరకి వెళ్లి అతని చెయ్యి తన భుజం మీదకి లాక్కుని, షర్టు కాల్లర్ పట్టుకుని " ఏమీ చేస్తావిప్పుడు?  మహా అయితే ముద్దు పెట్టుకుంటావు, ఎంతో మంది జీవితాలని నాశనం చేసావని తెలుసు.నా మీద పగబట్టి నన్నూ, నా జీవితాన్ని నీ పురుష అహంకారం తో నాశనం చేస్తావు? మా కుటుంభ పరువు బజారుకి ఈడుస్తావు? మమ్మల్ని చిత్ర హింసలు పెట్టి మా జీవితాలు చెల్లాచెదురు చేస్తావు?ఇంకేమి చేస్తావు? చెప్పు ఇంకేమి చేస్తావు? చెప్పు .. చెప్పు.." అని ఆవేశంతో ఊగిపోతోంది నందిత.

అక్కడి వాతావరణము వేడెక్కి సెగలు కక్కుతోంది..ఏదో తమాషా జరుగుతుంది వినోదం చూడొచ్చని వచ్చిన స్టూడెంట్స్ కి చెమటలు పట్టాయి. చిలికి చిలికి పెద్ద తుఫాను లా తయ్యరైంది వాతావరణము.

నందిత కి కొన్ని క్షణాలు పట్టింది తను ఏమి చేస్తోంది, ఎక్కడ ఉంది తెలియడానికి. కాళ్ళ కింద భూమి కదిలినట్టుగా వుంది.  "తనకి ఏమైంది? పిచ్చి పట్టిందా? పబ్లిగ్గా, ఘోరంగా అందరి ముందు అభిని తనేనా నోటికి వచ్చినట్టు వాగింది? అది అందరి ముందు? అయిపోయింది? తన జీవితం సర్వ నాశనం అయింది. తనే చేజేతులా చేసుకుంది! అభీ తనని వదలడు. అసలే పొగరు, పౌరుషం కొంచెము ఎక్కువ వున్నవాడు. అందరి ముందు ఒక హీరో గా ఫీల్ అయ్యేవాడు.. చాల ఫ్యాన్ ఫోల్లోవింగ్ ఉన్నవాడు! దేవుడా రక్షించు ! ఏమి చెయ్యాలి ఇప్పుడు?కాళ్ళ మీద పడినా క్షమించడు.భగవంతుడా ఏంటి?నాకేమైంది?" అనుకుంది మనసులో...

ఒక పక్క అభిమన్యు పరిస్థతి ఎవరికి అర్ధం కావట్లేదు! ఏమి చేస్తాడిప్పుడు? ఎంత  ఘోరమైన అవమానము? అదీ అభిమన్యు లాంటి స్టేటస్ వాళ్ళకి. ఇది అభిమన్యు ఒక వేల లైట్ గా తీసుకున్న వాళ్ళ నాన్నగారు ఎలా వదులుతారు? ఎంత పరువు నష్టం. రొజూ వాళ్ళ ఇద్దరి మధ్య వున్నా గొడవ అందరికీ తెలిసిందే. ఏదో రకంగా నందితని ఏడిపియ్యడం అభిమన్యు కి సరదా. నందిత దాన్ని సీరియస్ గా తీసుకుని ఏదో ఒకటి అనడం మామూలే. కానీ ఈ రోజు కొంచం మాటా మాట పెరిగి పెద్దదయింది. ఎవరు అనుకోలేదు, అభిమన్యు నందిత తో సహా ఇంత ఘోరమవుతుందని.

వంట్లో రక్తమంతా ఒక్కసారి మొహములోకి చిమ్ముకొచ్చినట్లయింది. నందిత చాచి కొట్టినట్లయింది. వళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఈ అవమానము తను భరించలేడు. ఇంత జరిగాక తను నందిత ని ఇప్పుడు అందరి ముందు ఏమి అన్నా.. ఏమి చేసినా.. లాభం లేదు. కోపంగా పళ్ళు కొరుకుతూ నందిత వేపు చూసి ఫాస్ట్ గా తన బైక్ స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. 

అభిమన్యు వంక నందిత కూడా పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తూ ఉండి పోయింది. "హా!" అని అందరూ ఏదో జరుగుతుందని ఆశ పడి యెమీ జరగనందుకు భాధగా అక్కడినించి మెల్లి మెల్లి గా కదలసాగారు.  నందితా ఇంకా కలా నిజామా అని అలానే అభిమన్యు వెళ్ళినా వైపు చూస్తూనే వుంది.

శ్రుతి "నందు! నందు!" అని ఎంత పిలిచినా పలక లేదు నందితా. వచ్చి గట్టిగా వీపు మీద ఒక్కటి ఇస్తే ఈ లోకంలోకి వచ్చింది నందితా."నీకు అసలు మెంటల్ ఎక్కింద? అమ్మో! అమ్మో! ఏంటి ఆ వాగుడు? నీకు నిజంగా పిచ్చి పట్టింది. మెంటల్ హాస్పిటల్ లో జాయిన్ చెయ్యాలి లాభం లేదు. అభీ ని పట్టుకుని నోటి దూల అంతా వది లించావు .అసలు రేపు పరిణామం ఏంటో ఆలోచించావా? అసలు నీకు ఎవరి ఇచ్చారు అంత అధికారం? చెట్టంత మనిషిని అందులో కోట్లు కోట్లు గడించిన అభినే కాకా వాళ్ళ నాన్న ని కూడా లాగుతావా? నందు!! నువ్వు చేసింది అసలు రైట్ కాదు. అభీ ఏ మన్నాడని ? మీకు డబ్బులు లేవు.. నువ్వు తైతక్కలాడి సంపాదిస్తావు అన్నాడు.. అంతేగ? దానికి అంత రెచ్చిపోవాలా? సోమరిపోతు అని, పారసైట్ అని , దున్నపోతని అసలు ఒకటేంటి .. పిచ్చి పిచ్చి గా వాగావు.. అదీ అందరి ముందు. నందితా నువ్వు ఫినిష్ అయిపోయావు? మీ ఫ్యామిలీ అడుక్కుతిని బతకాల్సిందే? తప్పదు. నువ్వు నిజంగా ముష్టి వాడినే పెళ్ళిచేసుకోవాలి. అసలు నీకు పెళ్లి అవుతుందని నాకు డౌట్? అభీ నిన్నుఏమైనా చేసినా చేస్తాడు నో డౌట్. అసలు అభీ నే కాదు నువ్వు నన్ను నిలబెట్టి ఈ లెవెల్ లో కడిగుంటే నేను కూడా అదే పని చేస్తాను. అనవసరంగాఅభిని కేలికావు?అసలే బాగా డబ్బు మదంతో వున్నవాడు, ప్రతీదీ టూ పర్సనల్ గా, సీరియస్ గా తీసుకుంటాడు. అభీ సంగతి అటుంచు వాళ్ళ డాడీ ఎందుకు ఊరుకుంటాడు? ఏ మనిషైనా  సొసైటీ లో ప్రేస్తిగే కి మచ్చ రాకుండా కాపాడుకుంటాడు? రేపు నీ కుటుంభాన్ని మొత్తం లేపేసిన ఎవరికి తెలియదు కూడా. వసెయ్! అభీ కాలర్ కూడా పట్టుకున్నావు కదే. పైగా చేతులు కూడా లాక్కుని మరి మీద కి వేసుకున్నావు? వింటున్నావా???నువ్వు లేచిన వేళ విశేషం బావుంది కనుక ఈ రోజు గట్టెక్కావు." అంటూ పెద్ద పెద్దగా యేడవడము మొదలెట్టింది శ్రుతి.

"అయినా నీకెందుకే? అభీ అడుక్కుతింటే నీకేంటి? వాళ్ళ నాన్న ఆస్తి మీద పడి తింటే నీకేంటి? నువ్వేమైనా అతనికి చుట్టమా?లేక పోతే నీకు కాబోయే మొగుడా? వెయిట్ ఏ మినిట్ !!!!  నువ్వు... నువ్వు .. కొంపతీసి అభినీ ప్రేమించట్లేదు కదా? " అని బావురుమంది శృతి.

ముందర వున్నా భయం అంత పోయి ఒక తెగింపుకి వచ్చింది నందితా. "ఎలాగైనా జరగాల్సిన ఘోరం జరిగిపోయింది.. ధైర్యం గా వుండాలి..భయపడి లాభం లేదు.. అన్ని కష్టాలు ఎదుర్కోవాలి.. నాన్నగారు చెప్పినట్టు కష్టాలకి భయపడిన వాడు జీవితంలో ఎదగడు" అని అనుకుంది మనసులో. ఒకలాంటి మొండి ధైర్యం వచ్చింది నందితకి.     

"నాన్సెన్స్! నాకేమి అంత కర్మ పట్టలేదు.. అలాంటి రోగ్ ని, లూసర్ ని, క్యారెక్టర్ లెస్ హ్యూమన్ బీయింగ్ ని, స్కౌండ్రెల్ ని పెళ్లి చేసుకునే కర్మ పట్టలేదు.." అని ఆవేశ పడుతున్న నందితా నోటిని గట్టిగా చేత్తో మూసింది శ్రుతి. "నీకు పిచ్చెక్కిందా? ఇప్పుడేనా నీకు చెప్పింది పిచ్చి పిచ్చి గా వళ్ళు తెలీకుండా వాగావు అని.. మల్లీ మొదలెట్టకు? అంది శ్రుతి తన గుండెలమీద చెయ్యి వేసుకుని. ఇంక నందిత ని కాలేజీ ఎగొట్టి హాస్టల్ కి వెళ్ళడమే ఉచితమనిపించింది శ్రుతికి.

నందిత మల్లీ మొదలెట్టింది శృతి చెయ్యి అవతలకి విసిరి కొట్టి. "ఇందాక నువ్వు అన్నట్టు ముష్టివాడిని సంతోషంగా పెళ్లి చేసుకుంటాను కానీ... రోజుకో అమ్మాయి తో గడిపే ఈ పొగరుబోతు డబ్బున్న వెధవల్ని పర్టిక్యూలర్ గా అభిమన్యు ని ప్రాణం పోయిన చేసుకోను. అభీ నీడ కూడా నాకు అసహ్యం. అతను తాకితే తేళ్ళు, జెర్రులు పాకినట్టు వుంటుంది. ఇలాంటివాడి తో ఒక రొజూ కాదు కదా ఒక్క క్షణం గడపడం కన్నచావడం నయం. అందమైన ఆకర్షమైన శరీరమే కాదు అందమైన మనసు కూడా ఉండాలి. అభీ అందమైన శరీరం కప్పుకున్నమృగం లాంటి వాడు."  అని ఆపింది నందిత.   

"నీకు తెలీదు శ్రుతి! నేను ఈ కాలేజీ లో సీట్ రాడానికి ఎంతో కష్ట పడ్డాను  మా కుటుంభంలో అందరూ ఎన్నో త్యాగాలు చేసారు. నేను బాగా చదువుకుని మాస్టర్స్ డిగ్రీ తెచ్చుకుని మంచి వుద్యోగం చెయ్యాలని అందరి కోరిక. నేను అభీ కి ఏమి ద్రోహం చేశాను? నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు? నా జోలికి అనవసరంగా వస్తాడు. నాకూ తెలీదు..ఎందుకు అసలు అభీ అన్నా మాటలని అంత గా పట్టిచ్చుకుంటానో?
కష్ట పడి చదువుకోడానికి వస్తే ఇలాంటి డబ్బున్న వాళ్ళు మన జీవితాలతో ఆడుతారు. నీకు తెలుసు కదా జానకి ఎంత మంచి అమ్మాయో? ఈ అభీ ప్రేమలో పడి, అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి ఆఖరకి ప్రాణం పోగొట్టుకుంది.  అభీ! జానకి నే కాకా ఎంత మంది ఆడవాళ్ళ జీవితం నాశనం చెయ్యలేదు? అందుకే నేను అభీ ని ఎప్పుడూ క్షమించలేను. ముందు ముందు ఏమి జరుగుతుంది అంతా  భగవంతుడి ఇచ్చ. మా నాన్నగారు అన్నట్లు "ఈశ్వరాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు".. సో డోంట్ వర్రీ పద, నాకూ మూడ్ లేదు...హాస్టల్ కి వెళ్దాము" అని నందిత, శృతి హాస్టల్ కి భయాలు దేరారు. కానీ వాళ్ళకి తెలీదు అభీ, అభీ గ్యాంగ్ అక్కడే వున్నారని, వీళ్ళ మాటలన్నీ విన్నారని.


*****************************************************