అభీ బైక్ తీసుకుని వెళ్ళగానే వెనకాలే వాళ్ళ గ్యాంగ్ వాళ్ళందరు భయలుదేరారు. అభిమన్యు కాలేజీ బైట బైక్ ఆపి పాన్ షాప్ దగ్గర సిగేరేట్ కోసం ఆగాడు. అందరూ ఫ్రెండ్స్ అక్కడికి వచ్చారు. అందులో గోపి అన్నవాడు ఒక్కడున్నాడు. వాడు జకెల్ లాంటి వాడు. బాగా ఎక్కిచ్చే టైపు. సగం వీడి మూలా అభిమన్యు పతన మయ్యేది. అభిమన్యు పాజిటివ్ గా ఎదేనే ఆలోచించే లోపలే బ్రేక్ చేస్తాడు. అభిమన్యు స్నేహం అతనికి కావాలి, అతని డబ్బులు విందులు విలాసాలకి కావాలి. అందుకని ఎప్పుడూ రాంగ్ ట్రాక్ లో బండి నడిచేటట్టు చూస్తాడు. ఎంతో మంది గోపి గురించి హెచ్చరించినా అభిమన్యు నమ్మని స్టేజి కి తీసుకొచ్చాడు. గోపి ఎంతో కష్ట పడ్డాడు అభిమన్యు ని తన చెప్పు చేతలలో ఉంచుకోడానికి, తన మీద నమ్మకం ఏర్పరుచుకోడానికి. ఎవరడ్డు వచినా సహించడు. ఎప్పుడూ నందిత తోనే సమస్య. అభిమన్యు ని చాలా చిత్రమైన పరిస్థితి లో పడేస్తుంది. అతను చాలా చెడ్డవాడు అన్న భావం తెప్పిస్తుంది. తనేమో అభీ కి "నువ్వు చాలా మంచివాడివి! అందరికీ నీ మీద కుళ్ళు, నీ సుఖం చూసి వోర్వలేరు.. అందుకే నిన్ను అలా ఆడిపోసుకుంటారు." అని బోధిస్తుంటాడు.
ఇప్పుడు నందిత మీద పగ, కసి పెంచడానికి సరైన సమయం. వృధా చెయ్యదలుచుకోలేదు. అందుకే అభిమన్యు ని ఎలా కన్విన్సు చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. ఒక ప్లాన్ ఆలోచించి ఇక మొదలెట్టాడు ..."ఎంటిరా! నువ్వసలు చేసినా పని? నందిత అన్ని మాటలంటుంటే.. ఒక్క లాగు లాగి చెంప మీద చెళ్ళు మని ఒకటి పీకక. జస్ట్ భుజాలు పట్టుకుని ఊపేసి వచ్చేశావు? నీకు పిచ్చి ఎక్కిందా ? దాని పొగరు అక్కడే ఒక ముద్దు పెట్టి అనచక? అదీ నేనైతే దాని బట్టలు ఊడపీకి వచ్చెవాడిని తెలుసా. నువ్వు మంచి వాడివి కాబట్టి, పాపం ఆడపిల్ల అని వదిలేసావు కానీ నందిత నిన్ను అసలు లెఖ చేసిందా ? అసలు చీమ కుట్టినట్టు అయినా రియాక్ట్ అయ్యిందా ? ఏమి చూసుకుని ఆ పొగరు?నిన్ను అసలు ఒక పురుగు కన్న హీనంగా చేసి మరి మాట్లాడిందే? ఏంటి నీకు తక్కువ? అందమా? చదువా? సొసైటీ లో స్టేటస్ ఆ?డబ్బులా?ఆఫ్టరాల్ ఒక స్కూల్ టీచర్ కూతురు కి ఇంత పోగరుంటే, సూపర్ రిచ్ ఫ్యామిలీ అయినా నీకెంత ఉండాలి?ఏదో చెయ్యరా అభీ? దానికి వళ్ళంతా కొవ్వే? కొవ్వు కరిగియ్యాలి. నందిత ఒక మోస్తరు అందం గానే ఉంటుంది కదా? ఆ అందాన్ని సర్వ నాశనం చేస్తే? నువ్వొకడివే కాదు అందరూ కలిస్తే నే దాని తిక్క కుదురుతుంది. ఏమంటావ్?
ఎప్పటి నుంచో గోపి కి నందిత మీద మోజు? ఎంతో కాంక్ష గా నందిత ని కింద నుంచి పై వరుకు చూడడమే సరిపోతుంది. ఒకసారి నందిత ఇది గమనించి, అందరి ముందు చెంప పగలుకోట్టింది కూడా? అందుకే నందిత మీద కసి,కక్ష. ఇప్పుడు అభీ వప్పుకుంటే .... ఆ ఆలోచనలోనే మునిగి తబ్బిబ్బు అవుతున్నాడు. ఆ అందం తన సొంతమవుతుంది అనుకుంటూ గుటకలు వేస్తున్న సమయంలో చెంప చెళ్ళు మంది గోపి కి.
అసలు ఏమైంది? ఎవరు కొట్టారో? ఏమీ అర్ధం కాక, కళ్ళు భైర్లుకమ్మాయి.పిచ్చి చూపులు చూస్తున్నాడు. మైండ్ బ్లాక్ అయింది. ఏమైంది తెలుసుకోడానికి కొంచం టైం పట్టింది. ఎదురుగా కోపం తో అభీ కళ్ళు యర్రగా వున్నాయి. తన కాలర్ పట్టుకుని మల్లీ అటు ఇటు వాయిస్తున్నాడు. "ఏరా ! వళ్ళు ఎలావుంది? ఏమి వాగుతున్నావు? స్పృహ లో వుండే వాగుతున్నావా? ఎంత ధైర్యం వుంటే నందు గురించి అలా పేల్తావ్? బతకాలని లేదా ఏం? అని గొంతుపిసకడానికి మీదకి వచ్చాడు అభీ.
ఈ సారి నిజంగా తనకి పిచ్చిఎక్కడం ఖాయం అనుకున్నాడు గోపి. "అదేంటి ఇంకా నన్ను అభీ మెచ్చుకుని ఘనంగా సత్కరిస్తాడనుకుంటే... కధ ఇలా అడ్డం తిరిగిందేమిటి? ఈజ్ హి మ్యాడ్ ఆర్ వాట్?? పైగా నందు అంట .. ఎప్పటి నుంచి నందు అయిందో? వళ్ళు మండిపోతోంది గోపి కి.ఇక్కడ తను నందిత మీద కసి తీర్చుకోడానికి మంచి అవకాసం దొరికింది అని అనుకుంటుంటే వీడేమిటి రివర్స్ లో నందు గిందు అని మొదలెట్టాడు. కొంప తీసి ప్రేమ దోమ అనడుకదా?" అనుకున్నాడు మనసులో గోపి కాని ఆఖరి వాఖ్యం బయటకి అనేసాడు.
అది విన్న అభిమన్యు కి చిరెత్తు కొచ్చింది. "నీకు పిచ్చి ఎక్కిందా ? నాకు నందిత మీద ప్రేమేంటి? నాకు వళ్ళంతా ఆణువణువూ కసితో పగగా వుంది. కానీ ఎందుకో నువ్వు అలా వాగితే కోపం వచ్చింది. ఎందుకో నందిత గురించి నువ్వు మరీ అలా మాట్లాడితే సహించలేక పోయాను రా. సారీ! కొట్టినందుకు.నువ్వే చెప్పు ఏమి చెయ్యాలో?" అని ఎంతో బాధ పడ్డాడు అభిమన్యు.
గోపికి మల్లీ ముఖంలో ఉషారు వచ్చింది "అయితే పద..ఏంటి నీ ఇష్టం వచినట్టు వాగావు? సారీ చెప్పు అందరి ముందు లెఖ పోతే నిన్ను సర్వనాసనం చేస్తాను!! అని గట్టిగా వార్నింగ్ ఇవ్వు పద" అని అభీ చెయ్యి పట్టుకుని కాంపస్ లోకి బయలుదేరాడు గోపి.
**********************************************************