నందిత కానీ శ్రుతి కానీ అభీ ని వాళ్ళ గ్యాంగ్ ని చూడలేదు.
నందిత మాటలు విన్నాక అభీ పని పుండు మీద కారం జల్లినట్లు అయింది. వెంటనే అనుకున్నాడు "ఇప్పుడు వెళ్లి వార్నింగ్ ఇస్తే కాదు! లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి? ఎందుకు అభీ తో పెట్టుకున్నానా అని భాధపడాలి. ఏదైనా తిరుగులేని ప్లాన్ చెయ్యాలి. తొందరపడ కూడదు. టైం తీసుకున్న దిమ్మ తిరగాలి.. అందుకు అందరు నన్ను వేస్ట్ గాడి కింద లెఖపెట్టిన పర్వాలేదు." అని మనసులోనే అనుకున్నాడు.
ఇంక గోపి ఆగలేదు "ఏంటి రా ఇంకా ఆలోచిస్తున్నావా? మల్లీ ఇంత అవమానించాక? ఏదో తెలీకుండా నోరు జారిందేమో అనుకున్నా చూసావా ఎంత పొగరు నందిత కి ? ఎలా సపోర్ట్ చేస్తోందో తన అడ్డమైన వాగుడికి? నాకయితే ఎక్కడైనా దుంకి చావాలని ఉంది రా అభీ! నీ సంగతి నాకు తెలీదు నేను ఇంక భరించలేను. నందిత సంగతి ఇప్పుడే చెప్తాను" అని కోపంగా నందిత వైపు వెళ్తున్న గోపి చెయ్యి పట్టి తన వైపు లాగాడు అభీ.
తన గ్యాంగ్ తో "నేనేమి వదలను రా నందిత ని. దాని కి నాశనానికి ముహూర్తం పెట్టేసాను. అందుకు ఎంత దూరమైనా వెళ్తాను?ఏమైనా చేస్తాను? మీరు అనవసరంగా ఇప్పుడు రెచ్చి పోవద్దు? ఇప్పుడు నేను నందిత ని ఏమి చేసినా చాలా చిన్న శిక్ష వేసినట్టే. జీవితాంతం బాధ పడేలా చెయ్యాలి. నేను ఆలోచిస్తాను ఏమీ చెయ్యాలో....మీరు నాకు కోపెరాటే చేస్తే చాలు. నందిత పొగరు అణిచేసి దేనికి పనికిరాకుండా, జీవితంలో సుఖం అనేది లేకుండా చేస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్!!. నందిత ని ఇప్పుడు ఏమి చేసిన ఇట్ విల్ నాట్ ఎఫెక్ట్ హర్. కొంచెము టైం పట్టిన మంచిగా ప్లాన్ చెయ్యాలి." అన్నాడు అభిమన్యు.
అందరూ "సరే! ఏమీ హెల్ప్ కావాలో చెప్పు" అని చెయ్యి కలిపారు. గోపికి మాత్రం వళ్ళు మండింది "తనే ప్లాన్ చేస్తే మేము హెల్ప్ చెయ్యాలా? బావుంది.. చాలా బావుంది. వీడికి దేఫినేట్ గా నందిత మీద ఏదో ఫీలింగ్స్ వున్నాయి నో డౌట్. చూద్దాం ఏమి చేస్తాడో " అనుకున్నాడు గోపి. అందరితో పాటు ఓకే అనేసాడు తన ఆలోచనలు తనలో పెట్టుకుని.
"అభీ! నువ్వు ఏమి చేసినా అందరి ముందు నందిత కి అవమానం చెయ్యాలి, లేకపోతే మన యూత్ కి అవమానము. సరేనా? " అని అన్నాడు. "నందిత గానీ, మీరు గానీ ఊహించని విధంగా ప్లాన్ చేస్తాను. డోంట్ వర్రీ!! పదండి క్లాసు కి" అని క్లాసు లకి వెళ్ళిపోయారు. స్టూడెంట్స్ అందరు అభీ ని క్లాసు లోకి రావడం చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని "సరే మనకేమి పోయిందిలే అనుకున్నారు". కానీ శ్రద్ధ పెట్టలేఖ పోయారు.
అభీ పరిస్థితి కూడా గందరగోళం గా ఉంది. ఏమి చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు. తను ఏమైనా కావాలి అంటే తనకు దక్కేంతవరుకు ఊరుకోడు...
హాస్టల్ కి వెళ్ళినా నందిత మనసు మనసులో లేదు.. తన భాల్యము, తన కుటుంభ పరిస్థతి, తను ఎంత కష్టపడి చదివిన సంగతులు.. అభీ తో పరిచయం, మొదటి సారి అతనిని చూసిన సంగతులు గుర్తుకురాసాగాయి.
*******************************************************