Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Five : Nanditha’ flashback Abhimanyu Nanditha’s first meeting

 


కాలేజీ లో మదటిరోజు ఆ రోజు.... 

ముందర రోజే హాస్టల్ లో తన క్లాస్మేట్ శ్రుతి పరిచయమయింది. నెల రోజులు లేట్ గా జాయిన్ అయ్యింది నందిత, తన కుటుంభ పరిస్థితుల వల్లన. ఫీజు కి కావలసిన డబ్బు జమ చేసేసరికి కొంచెం లేట్ అయింది. సో కాలేజీ లో మొదటి కొన్ని రోజులు జరిగే రాగింగ్ అంతా తప్పింది తనకి. శ్రుతి నందిత కి తన అవగాహన బట్టి ఎవరు ఎలాంటివారు చెప్పడం మొదలెట్టింది. అప్పుడు మొదటిసారి అభిమన్యు గురించి, అతని స్టేటస్ గురించి, వాళ్ళ గ్యాంగ్ గురించి , వాళ్ళు చేసే అల్లరి, రాగింగ్ గురించి, అమ్మాయిలు ఎలా అభీ అంటే పడి చస్తారో, ఒక్కసారి అభీ ని తాకితే చాలు అనుకుంటారో , దాన్ని అభీ ఎలా అనుకూలంగా వాళ్ళని తనతో ఎంత దూరమైనా, ఏమి చెయ్యడానికైనా సిద్దపరుస్తాడో అంతా చెప్పుకుంటూ వచ్చింది. తనకి ఇవ్వన్నీతన సీనియర్ అంజు చెప్పిందట.

అంజు అభీ క్లాస్మేట్ ఫైనల్ ఇయర్ చదువుతోంది.  అభీ ని తన బాయ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తూ తిరిగేది. అది తెలిసి అభీ అంజు ని అందరి ముందు "నాతో ఒక పూట గడిపినందుకు నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్ అంటే ఆల్మోస్ట్ కాలేజ్ లో ఉన్న అందరు అమ్మాయిలు నాకు గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు. మొహం చూసుకున్నావా అద్దం లో ఎప్పుడైనా ? ఆ మాత్రం నాతో గడుపినందుకు నీ జన్మ ధన్యమైంది. నీ స్టేటస్ పెరిగింది. సో, పిచ్చి వేషాలు వెయ్యకుండా పడుండు!" అని
చెడామడ కదిగేసాడు.


అప్పటినించి అంజు కి అభీ మీద కచ్చి. ఎప్పుడూ బాడ్ గా రుమోర్స్ పాస్ చేస్తూ వుంటుంది.

నందిత కి ఒక్కటి అర్ధం అయింది.ఈ అభిమన్యు ఎవడో కానీ కొంచెం జాగ్రత గా ఉండాలి అని. అభిమన్యు గురించి రోజు ఏదో ఒకటి వింటూనే ఉంది. అభిమన్యు ని చూడాలని మనసు ఆరాట పడుతోంది. ఒక పక్క అతను ఒక జులాయి అని అనిపించినా ఎందుకో మరీ నందిత కి రోజు రోజు కి అభిమన్యు మీద ఆసక్తి తనకి తెలియ కుండానే పెంచుకుంది. అభిమన్యు ఫ్యామిలీ వెకేషన్ కి తన అక్కదగ్గరికి అమెరికా కి మూడు నెలలికి వెళ్ళాడని శృతి కి అంజు చెప్పిందిట. అభిమన్యు కి అలవాటేట కాలేజ్ డుమ్మా కొట్టడం. కానీ ఎగ్జామ్స్ కి కానీ అటెండన్స్ కి కానీ ఏమి ప్రాబ్లం ఉండదు. "పైసలు ఉంటె ఏమైనా చేయచ్చు. ఇది ఒక లెఖ" అనుకుంది మనసులో నందిత. 

రోజులా కాలేజీ కి వచ్చారు నందిత, శ్రుతి. కానీ ప్రశాంతమైన కాలేజ్ వాతావరణము అంతా వింతగా, గందరగోలంగా అరుపులు కేకలతో నిండిపోయింది. "అదేంటే ఏమైంది శ్రుతి? ఎవరైనా సినిమా ఆక్టర్ వచ్చారా ఏంటి?" అని అడిగింది నందిత. "ఏమో నే తల్లి! పద చూద్దాం" అని ఇద్దరు చాలా గుంపులుగా వున్న స్టూడెంట్స్ దగ్గరకి వెళ్లారు. ఇంతలో అక్కడ ఎవరిదో గొంతువిని షాక్ అయింది శ్రుతి. వెంటనే కళ్ళలో ఏదో వింత మెరుపు, తన ఇష్టమైన వాళ్ళని కలవ బోతోంది అని ఆనందం కనిపించాయి. "అనుకున్నానే నందు! ఈ రోజు ఏదో గొప్ప రోజు అని! లేవగానే అంతా మంచి శకునాలే కనపడ్డాయి! నీ ముఖం కూడా చూసానే! ఇంకేటి పద .. అభీ వచ్చేసాడు. చూడు మన కాలేజీ డ్రీం బాయ్ ని..గ్రీకు వీరుడిని." అంటూ నందిత చెయ్యి గట్టిగా పట్టుకుని లాక్కుపోతోంది "ఇంకా ఒక్క క్షణం కూడా తను అభీ ని చూడకుండా ఉండలేను" అన్నట్టు ఉంది శ్రుతి ప్రవర్తన.

గుంపులో అభిమన్యు ని చూడగానే గుండెలుమీద చెయ్యి వేసుకుని "హూ!" అని ఒక మూలుగు మూలిగింది శ్రుతి. నందిత కి అభిమన్యు కలవలేదు కానీ శ్రుతి ప్రవర్తనకి నవ్వు వచ్చి పెద్దగా పకపకా నవ్వుతోంది. ఎప్పుడు నందిత ని అంతగా నవ్వడం చూడని శ్రుతి కూడా తన ప్రవర్తన గుర్తు తెచ్చుకుని తనూ నవ్వడము మొదలెట్టింది. వీలిద్దరు పడి పడి ఎందుకు నవుతున్నారో అక్కడ ఉన్నా వాళ్ళందరికీ అర్ధం కాక వీళ్ళ వంక తిరిగారు. అందరు సైలెంట్ అయిపోయారు. నందిత, శ్రుతి అది గమనియ్యలేదు.

ఇంతలో ఎవరో "మాకు కూడా ఆ జోక్ ఏంటో చెప్తే మేము కూడా జాయిన్ అవుతాము లేడీస్!" అని అన్నారు. ఆ గొంతు ఎంతో మధురంగా, హస్కీ గా, స్పెషల్ గా ఉంది అనుకుంది నందిత. వెంటనే ఆ గొంతు వినపడిన వైపు తిరిగింది నందిత. అంతె షాక్ లోకి వెళ్లిపోయింది. ఎదురుగా మన్మదుడులా, ఎంతో చెప్పలేనంత ఆకర్షనియంగా ముఖముతో, హ్యాండ్సమ్ గా, మంచి ఆరడుగుల పైనే పొడవు తో, కండలు తిరిగిన మంచి అథెలిటిక్ బాడీ తో, ఎక్కడా వంక పెట్టలేనంత అందంగా, మిస్టర్ పర్ఫెక్ట్ గా ఎవరో నిల్చుని వున్నాడు. దేవుడు కి ఇతని మీద ఎంతో ప్రేమ ఉంది అందుకనే తీరిగ్గా ఆదివారము నాడు తయ్యారు చేసాడు అనుకుంది మనసులో నందిత. ఇంకా అలానే కళ్ళు పెద్దవి చేసి చుట్టుపక్క పరిసరాలు మర్చిపోయి మరీ చూస్తోంది. "మగవాళ్ళలో కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారా " అని అనుకుంది.       

ముందుగా  శ్రుతి స్పృహ లోకి వచ్చి"ఏయ్ ! నందు..అతనే నే కాలేజీ డ్రీం బాయ్" అంది నందిత చెవులో. ఇంకా నందిత లో ఏమి రియాక్షన్ లేదు. మల్లీ చెవులో "వసెయ్! పరువు తీస్తున్నావు. ముందు నోరు మూసి, నీ పెద్ద పెద్ద కళ్ళతో చంపక కిందకి దించు. అతనే నే అభిమన్యు!" అంది. చివరి మాటలకి స్పృహ లోకి వచ్చింది. తన పరిస్త్తికి సిగ్గేసి చావలనిపించింది. అభిమన్యు వంక తలెత్తి  చూడలేకపోతోంది. తనకి ఎప్పుడూ ఇలాంటి స్థితి రాలేదు చిత్రం గా ఉంది. మనసు ఇంకా ఇంకా చూడాలని ఆరాటపడిన కళ్ళు సిగ్గుతో దించుకుంది.

"ఎక్స్ క్యూజ్ మి!!! మిస్ ..సారీ ఐ డిడ్ నాట్ గెట్ యువర్ బ్యూటిఫుల్ నేమ్ . మై నేమ్ ఈస్ అభిమన్యు ! యువర్ గుడ్ నేమ్ ఈస్"  అని చెయ్యి చాచాడు. దేవుడే దిగి వచ్చి "నీ పేరేంటి" అని అడిగినట్టు అయింది నందితకి. "నందిత" అని అతి కష్టం మీద నోటిలోంచి బయటకి వచ్చింది తన పేరు. చెయ్యి ఇవ్వాలా వద్దా అనుకుంటూనే చెయ్యి చాచింది. అభిమన్యు "ప్లీజ్ టు మీట్ యు నందిత!" అని నందిత చెయ్యి తన చేతిలో తీసుకుని మెత్తగా వత్తాడు.

ఆ స్పర్స వంటిలో ఆణువణువూ మైకం కమ్మేసింది. వెంటనే సంభాలించుకుని తన చెయ్యి వెనక్కి తీసుకోడానికి ప్రయత్నించింది. కానీ అభిమన్యు చిలిపిగా, కవ్వింపుగా నవ్వుతూ తన గుండెలకి దగ్గర గా తీసుకుంటున్నాడు. ఏమి జరుగుతోందో తెలిసే లోపలే అభిమన్యు తన పెదవులకి ఆనించి గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అందరు "హుర్రే!" అని అరుస్తునారు. నందితకి ఒక్క క్షణం లో అతని మీద తన మనసులో కలిగిన మంచి ఫీలింగ్స్ అంతా ఆవిరయి పోయాయి. భాధగా మనసు మూలిగింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి అభిమన్యు ప్రవర్తనకి.

 గట్టిగా చెయ్యి లాక్కుని "ఇడియట్! మన్నెర్స్ కూడా తెలీదు. ఐ డిడ్ నాట్ ఏక్సపెక్ట్ ఎనీ థింగ్ బెటర్ దెన్ థిస్ ఫ్రొం యు. నీ గురుంచి విన్నవన్నీ నిజమే. ఐ హేట్ పీపుల్ లైక్ యు" అని అంది ఆవేశంగా.
"మాటలు కూడా బానే ఘాటుగా ఉన్నాయే! వంటినిండా పొగరు, కొవ్వు కూడా ఉందే" అంటూ నందిత ని పై నించి కింద వరుకు ఎగాదిగా తన ఎక్స్ రే కళ్ళతో స్టడీ చేస్తూ చుట్టూ తిరుగుతున్నాడు.

"హే డియర్ సారీ ! డిసప్పాయింట్ చేసానా. పాపం ఓన్లీ చేతి నే కిస్ చేశానని కోపమా? సరే రా గట్టిగా గుండెలకి హత్తుకుంటాను. నీకు ఎక్కడ కావాలంటే అక్కడ ..నీ ఇష్టం నువ్వేమంటే అది సరేనా. ఈ మధ్య మన కాలేజీ లో ఇంత మంచి కత్తి లాంటి ఫిగర్ కనపడలేదే. ఇన్ని రోజులు ఆ అమెరికన్స్ తో బోర్ కొట్టింది! మన తెలుగింటి భామ నే కనపడలా. చూడడానికి మంచి టెంప్టింగ్ ఫిగర్ లే నీది!" అని తన పెదవులని బటను వేళ్ళతో గట్టిగా వత్తుతూ వంకరగా నవ్వు తున్నాడు అభి.

నందిత కి అభిమన్యు చర్య ఎంత అసహ్యము,ఏవగింపు, కోపము కలిగించిందంటే చాచి చెప్పుతో కొట్టాలని పించింది చెయ్యి పైకి ఆవేశంగా పొనిచ్చింది. ముందుగ శ్రుతి రియాక్ట్ అయ్యి ఏమవుతోందో గ్రహించి నందితని బరబరా క్లాస్ రూమ్ కి లాక్కెళ్ళింది. నందిత శ్రుతి తో ఏదో అంటోంది కానీ శ్రుతి తన బలమంతా ఉపయోగించి మరీ లాక్కుపోతోంది.

అభిమన్యు మోఖములో కోపం బదులు నవ్వు చూసి అందరు అవ్వాక్కయ్యారు. ఇలాంటి వాటికీ అభిమన్యు ఎప్పుడూ చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతాడు అలాంటిది ఈ రోజు జరిగిన దానిని చాలా లైట్ గా తీసుకున్నాడు. 

అభిమన్యుకి మొదటి సారి ఎవరైనా అమ్మాయి నచ్చింది. 'అందరు తన మోహంలో మైకం లో పడతారు కానీ తనని కానీ తన డబ్బుని కానీ అసలు కేర్ చెయ్యలేదు అంటీ నందిత లో ఏదో ఉంది" అనుకున్నాడు. కోపం కూడా ఉంది కానీ ఏదో హాయిగా మనసు మూలిగింది. "తనకి ఎంతో మంది అందమయిన ఆడవాళ్ళ పరిచయం ఉంది. ఎందరినో అవసరానికి మించి క్లోజ్ గా మూవ్ మొవె అయినా,నందిత ని తాకగానే ఆ స్పర్స ఎంతో హాయిని, వింత ఫీలింగ్ ని కలిగించింది. తనకే చాలా వింతగా ఉంది తనూ ఒకరి గురించి మొదటి సారి ఆలోచిస్తున్నందుకు. "నందిత లో ఏదో మెస్మేరైజెషన్ ఉంది. అందం కన్నా ఆకర్షణ ఎక్కువగా వుంది. హుందాగా బిడియంగా ఉన్నా ఏదో కవ్వింత చిలిపితనము ఉంది. పెద్ద పెద్ద కాటుక కళ్ళు... అవే అసలయిన ప్రత్యేకత. చాలా పవర్ఫుల్ గా ఎలాంటి వాడినైన ఆ చూపులతో కట్టేసే శక్తి ఉంది. పొడువైన జుత్తు కూడా అందం ఇస్తుందని ఇప్పుడే తెలిసింది.నడుముని దాటిన జూత్తు అటు ఇటు ఊగుతుంటే ఎంతో ముచ్చటగా ఉంది. మంచి సెక్సీ ఫిగర్ ఎలాంటి వాడు అయినా దాసోహం అయ్యేలా ఉంది. మొత్తానికి చాలాటెంప్టింగ్ టైంపాస్ కాండిడేట్." అనుకున్నాడు అభిమన్యు మనసులో. ఎప్పుడూ తనే అందంగా ఉంటాడు అనుకునే తను ఎదుటి వ్యక్తి లో కూడా అందం గమనిచ్చాడంటే ఏదో వింత గా ఉంది అభిమన్యు కి.

*************************************************