నందితకి శ్రుతి మీద పీకల దాక కోపం వచ్చింది. "శృతి! చెయ్యివదులు . ఈ రోజు ఆ అభిమన్యు చెంప పగలుకోట్టేదాన్నే. ఎందుకే లాక్కోచ్చావు?"అతను చేసినా దానికి సిగ్గుతో చావలనిపిస్తోంది. అసలు ఆ మనిషి రూపానికి చేసే వేశాలికి ఎవైన లింక్ వుందా. ఛీ!" అంది నందిత.
"సర్లేవే! నీకు అభీ సంగతి తెలీదు. నువ్వు రెచ్చిపోతే అన్నంత పని చెయ్య గల సమర్ధుడు. ఎవరు అడ్డు కూడా చెప్పరు, చెప్పే ధైర్యం కూడా లేదు, నా మాట విను. లైట్ తీసుకో.. అభీ తో అసలు పెట్టుకోకే! " అంది శ్రుతి.
మల్లీ ఏదో గుర్తుకు వచ్చి నందిత వెనకాల వీపు మీద వాలి "ఏయ్! నిజం చెప్పవే? ఎలా వున్నాడు మన్మధుడులా లేడు? మతి పోలేదు? నేను చూసానులే నువ్వు నోరు తెరిచి మరీ వళ్ళు పై తెలీకుండా కళ్ళప్పగించి మరీ చూసావా లేదా?నిజం చెప్పు?" అంది శ్రుతి.
నందిత ఇందాక అభిమన్యు ని చూసిన తరువాత తన పరిస్థితి గుర్తుతెచ్చుకుని తల మోకాళ్ళలో దాచేసుకుంది. సిగ్గుతో అంది"అవునే అబధం ఎందుకు చెప్తాను? అభిమన్యు చూడగానే షాక్ అయ్యాను. అబ్బాయిల్లో కూడా ఇంత అందమైన వాళ్ళు ఉంటారా అనుకున్నాను. నా గుండె లయ తప్పింది. కానీ నీకు తెలీదు శ్రుతి నేను అభీ ప్రవర్తన కి ఎంత డిసప్పోయింట్ అయ్యానో . ఇన్ని రోజులు అభిమన్యు ని కలవాలి కలవాలి అని మనసు ఆరాట పడింది. అభీ ని చూసిన క్షణమే నేను ప్రేమలో పడ్డాను!" అని నందిత చెప్తుండగా "వాట్?? నువ్వు అభిమన్యు ని ప్రేమించావా లవ్ ఎట్ ఫస్ట్ సైట్!! నిజమా? నందు ఏమిటే నువ్వనేది?
నందిత మొదలెట్టింది "అవునే! కానీ ఇంక కాదు!" అని ఏడుస్తోంది నందిత.
శ్రుతి కి ఒక నిముషం అర్ధం కాలేదు, నందిత ఇంతగా బాధ పడుతుంది అనుకోలేదు పైగా ప్రేమలో పడింది అంటుందేంటి అనుకుంది. శ్రుతి ని గట్టిగా పట్టుకుని ఏడుపు గొంతుతో "ఇప్పుడు కాదే నువ్వు అసలు అభీ గురుంచి చెప్పినప్పటి నుంచి నా మనసులో నిలిచిపోయాడు. ఎప్పుడూ అతని గురించే వినాలనిపించేది. వింటుంటే ఏదో హాయిగా ఉండేది. అసలు ఎలా ఉంటాడో తెలీకుండానే ఒక అందమైన రూపం నా మనసులో ఏర్పరచుకున్నాను. ఈ వయసులో మనకి ఉండే అట్రాక్షన్ ఏమో నాకు తెలీదు? నువ్వు అతనికి ఎంత క్యారెక్టర్ లేదన్న, పొగరున్న,ఆఖరికి అమ్మాయిలతో తిరిగినా ఐ డోంట్ కేర్ అనుకున్నాను. నీకు సిల్లీ గా ఉండచ్చు,నేనొక వింత గా కూడా కనపడొచ్చుకానీ ఇది నిజం. నువ్వు ఎంత చెడ్డగా చెప్పిన మే బి ఆందరు అతనిని తప్పుగా అనుకుంటున్నారేమో అనుకునేదాన్ని. అందరికీ అతను బావుంటాడు అని, బాగా డబ్బులు ఉన్నాయని, హై సొసైటీ కి చెందినవాడని కుళ్ళు అనుకునేదాన్ని. నిజం శ్రుతి. నీకు కోపం వద్దు నిన్నుఅసలు పట్టిచుకోడని నీకు కూడా అభీ మీద కోపం అనుకున్నాను. సారీ నే!" అని శ్రుతి వళ్ళో ముఖము దాచుకుంది. "నందు! నేనేమి నిన్ను తప్పుగా అసలు అనుకొనే! చెప్పు" అంది. మల్లీ నందిత చెప్పసాగింది
"అంజు అతని గురించి చెడు గా రుమోర్స్ పాస్ చేస్తోంది అని అనప్పుడు నాకు అభీ మీద కాక అంజు మీద ఇంకా అభి వేనకాళ్ళ పడ్డ అమ్మాయిలందరి మీద కోపం వచ్చింది. చెప్పు శ్రుతి? మనము మన లిమిట్స్ దాటి ప్రవర్తిస్తేనే కదే అబ్బాయిలు అడ్వాంటేజ్ తీసుకునేది. కొంగు జారుస్తూ.. ఎక్సపోసింగ్ బట్టలు వేసుకుంటే ఎలాంటి వాడికైనా వంకర బుద్ధి పుడుతుంది. ఆఖరికి కన్ను ముక్కు వంకరైన వాడికి కూడా ఆశ పుడుతుంది. అలాంటిది అభికి ఏమి తక్కువ? అన్ని పుష్కలంగా ఉన్నవాడికి అందులోను రెచ్చకోడితే ఎందుకు ఊరుకుంటాడు? అమ్మాయిలే కేర్ లెస్ గా ప్రవర్తిస్తుంటే అబ్బాయిలు ఎందుకు ఊరుకుంటారు.
అమ్మాయిల తో లూస్ గా తిరుగుతాడని తెలుసు కానీ తనని ఇష్ట పడిన వాళ్ళతో నే ప్రో సీడ్ అవుతాడు కానీ మిగతా అందరి మీద పడడు కదా. ఒకసారి ఇంటరెస్ట్ పోయాక ఎవడికైనా విరక్తి వస్తుంది అలాంటిది అంజు లాంటి వాళ్ళని కేర్ చెయ్యడు, వాళ్ళకి కచ్చి పుడుతుంది. వాళ్ళు పగ పడుతారు. అభికి చుట్టూ వున్న వాతావరణమే కల్మశంగా తప్పుదారి ని పట్టిస్తోంది. చేతిలో పవర్ ఉంది, డబ్బుంది, అన్నిటికి తాన తందానా అనే చవట ఫ్రెండ్స్ ఉన్నారు. పైగా పుట్టినప్పటి నుంచి దేని మీద మనసు పడినా తన వద్దకు వచ్చే రేంజ్ లో పెరిగినవాడికి భయం ఏముంటుంది? అన్ని తప్పులు సరి చెయ్యడానికి బాగా పవర్ ఉన్నా తండ్రి ఉన్నాడు. ఏమి తప్పులు చేసినా శబాష్ అంటూ ఒక్కళ్ళు కూడా నువ్వు తప్పు మార్గం లో నడుస్తున్నావు, ఇది తప్పు అని చెప్పిన వాళ్లు లేరు." అని ఆగి శ్రుతి వళ్లోంచి లేచి కళ్ళు తుడుచుకుంటూ సర్దుకుని మల్లీ మొదలెట్టింది ఎటో సున్యం లోకి చూస్తూ..
"అంతా తప్పు! నేను అభీ గురుంచి అనుకున్నదంతా తప్పు. నేను అతనిని ఇష్టపడ్డాను. నాకు తెలీకుండానే నా మనసులో నిలుపుకున్నాను. అందుకని నాకు అనుకూలంగా అతనిని, అతని స్వభావాన్నికన్విన్సింగ్ గా మార్చుకున్నాను తప్ప అవన్నీ నిజం కాదు. కాదు కాదు!!! " అంటూ కళ్ళు తుడుచుకుని "ఐ హేట్ మైసెల్ఫ్ !! ఐ హేట్ మైసెల్ఫ్ సో మచ్ !! ఐ హాట్ హిమ్ !! ఐ విల్ హేట్ హిం ఫరెవర్ " అని లేవబోయింది.
"ఎంటే పిచ్చి వాగుడు. జీవితాంతం ద్వేషిస్తాను అంటావేమిటి? నందు అభీ గురించి అభీ కన్నా కూడా నీకే బాగా తెలుసనిపిస్తుంది నీ విశ్లేషణ బట్టి. నువ్వు అనుకున్న దానిలో రవ్వంత కూడా తప్పులేదు. నందు! అభీ గురుంచి నువ్వు ముందర అనుకున్నావే కరెక్ట్. నందు ఎప్పటికయినా నువ్వు అభీ ఒకటవుతారని నమ్మకం నాకుంది. నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకు" అని హెచ్చరించింది శ్రుతి.
"హూ!" అని భాధగా నిట్టూర్చింది నందిత.
కొంచెం సేపు సబ్జక్ట్స్ గురించి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ గురించి, ప్రక్టికాల్స్ గురించి మాట్లాడుకుని ఫ్రెష్ అవడానికి లేచింది శ్రుతి.
కానీ నందిత కి అభిమన్యు రూపమే కళ్ళ ముందు ఉండిపోయింది. అలానే కళ్ళుమూసుకుంది.. కలల్లోకి జారుకుంది తనకి తెలీకుండానే. కలల్లో తనకి అభీ కి పెళ్లైనట్టు....అభీ తను ఎంతో అన్యోన్యంగా ఉన్నట్టు.. తనని అభీ చాలా ప్రేమగా, అపురూపంగా చూసుకుంటున్నట్టు ఏదో అందమైన లోకంలో ఉండిపోయింది.
అక్కడ అభీకి కూడా వంటరిగి గడపాలనిపించింది. క్లాసు లో ఉన్నా చైర్ లో వెనకాలకి వాలి నందిత గురించే ఆలోచించాడు. మొత్తానికి ఏదో ప్రత్యేకత ఉంది నందిత లో అనుకున్నాడు. ఒకసారి ఆమె రూపము కళ్ళ ముందు కి వచ్చింది. ఆమె లో సిగ్గుపడడం తోసహ కోపం కూడా చాలా అందాన్ని ఇస్తుంది అనుకున్నాడు.