Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Seven : Nanditha’s father sees Nanditha with Abhimanyu in her room – Part 1

 


ఒకసారి ఏమి జరిగిందంటే ....
నందిత తండ్రి గంగాధరం గారు బెంగుళూరు లో ఏదో సంభంధం నందిత కి చూడడానికి వచ్చి తన కూతురు ని కలవడానికి హాస్టల్ కి వచ్చారు. దీనికి ముందు ఒక విశేషం జరిగింది హైదరాబాద్ లో నందిత ఇంటిలో ... అదేమిటి ఆంటే ....అది జరిగిన వెంటనే నందిత కి అర్జెంటు గా పెళ్లి చెయ్యాలి అని ఇంటిలో ఆందరు నిర్ణయించుకున్నారు.

అభిమన్యు నందిత మీద రివెంజ్ ఎలా తీసుకోవాలా అని తెగ ప్లాన్ లు వేస్తున్నాడు. ఇంతలో అభిమన్యు కి నందిత ఇది వరుకు అన్న మాటలు ఒక సారి గుర్తుకు తెచ్చుకున్నాడు.
నందిత ఎప్పుడూ మా నాన్నగారు ఇంకా మా ఫ్యామిలీ లో ఆందరు తనని ఎంతగా నో ప్రేమిస్తారని, తనని ఎప్పుడూ ఒక్క మాటా కూడా అనలేదని, తనలాంటి కూతురు పుట్టినందుకు ఎంతో గర్వపడుతారని ... నీ లాంటి వాడు పుట్టినందుకు మీ వాళ్ళు ఎంత బాధపడుతారో ఊహించుకోమని.
 
ఎలాగైనా నందిత ని తన కుటుంభ సభ్యులు ముందు తల దిన్చేలా చెయ్యాలి అన్నదే అభిమన్యు కి ఇప్పుడు వచ్చిన ఆలోచన.

సో ఒక ప్లాన్ ఆలోచించాడు. ఏమిటి అంటే తను నందిత వాళ్ళ ఇంటికి ఒక ఆకాశ రామన్న ఉత్తరం పంపించి ఇంటిలో గందరగోళం సృష్టిచ్చాలని. ఇంకా ఆలస్యమేంటి..ఇలా రాసాడు అందులో...

డియర్ సర్,

ఎంతో భాధాకరమైన విషయం ఏమిటంటే మీ కూతురు ప్రవర్తన మంచి గా లేదు. అభిమన్యు అనే ఒక బాగా డబ్బున్న అబ్బాయితో అడ్డమైన తిరుగుళ్ళు తిరుగుతోంది.పగలనక రాత్రనక క్లబ్ లు డిస్కో లోకి సినిమాలకి, బీచు లకి తిరుగుతోంది. క్లాస్స్లు డుమ్మా కొట్టిన అటెండన్స్ ఫుల్ గా ఉండేలా, పరీక్షలు వ్రాయక పోయిన పాస్ అయ్యేటట్లు మార్కులు అభిమన్యు పవర్ తో తల్లి తండ్రులకి అనుమానము రాకుండా చూసుకుంటోంది.

ఇది అంతా అభిమన్యు నందిత ని తన ప్రేమలో పడేలా చేసిన ప్లాన్ వలన. అందరి అమ్మాయి లా నందిత బతుకు నాశనము అవ్వ కూడదని
నందిత మంచి పిల్ల గనుక తను ఇలా భరితేగిస్తుంటే చూస్తూ ఇక ఉండలేక వ్రాస్తున్నాను. మీరే స్వయముగా వచ్చి ఏది నిజము ఏది అబధము తెల్చుకోవలెను.

గమనిక: మీరు నందిత ని నిలదీసి అడిగితే ఇవన్ని పుకార్లు అని మిమ్మల్ని నమ్మించ గలదు. అందుకని స్వయముగా మీరే వచ్చి తెల్చుకోగలరు. ఈ నెల ఆఖరున స్టూడెంట్స్ అంతా కలిసి మైసూరు కి వెళ్తున్నారు. అంతా లోపలే రాగలరని ప్రార్థన. నాకేమిటి లాభం మీకు వ్రాసినందుకు అంటే . నందిత శ్రేయస్సు కోరుతున్న వాళ్లలో నేను ఒకరిని .

ఇట్లు
నందిత హితము కోరే స్నేహితురాలు 

ఈ ఉత్తరం అంద గానే నందిత మటాష్ అనుకున్నాడు అభిమన్యు...

అభిమన్యు అనుకున్నట్లు నందిత ఇంటిలో ఈ ఉత్తరము బాగా కలకలం రేపింది. ఎవ్వరు నమ్మలేదు కానీ..కొంచెమైన నిజం లేకుండా ఇంత గా ధైర్యం ఎవ్వరు చెయ్యరు కనుక తనే స్వంతంగా వెళ్లి తేల్చుకోవాలి అని నందిత నాన్నగారు భయలుదేరారు.

అభిమన్యు తన గూడాచారి ని హైదరాబాద్ లో నందిత ఇంటి దగ్గరలో నియమించాడు. వాడి పని ఏంటి అంటే అక్కడ జరిగే ప్రతి విషయము ఇక్కడ అభీ కి తెలియపరచడమే...
ఎప్పుడు, ఎన్నింటికి నందిత నాన్నగారి ప్రయాణము డీటెయిల్స్ అన్ని అభీ కి అందాయి.

అభిమన్యు తన ప్లాన్ ప్రకారం పధకం మొదలెట్టాడు.
నందిత నాన్నగారు వచ్చే రోజు రానే వచ్చింది.....

హైదరాబాదు నుండి బెంగళూరు ఎక్సప్రెస్ ట్రైన్ పట్టుకుని బెంగుళూరు లో దిగి అక్కడినించి సురత్కల్ కి బస్సు పట్టుకుని తెలవారుజామున కాలేజీ హాస్టల్ కి చేరుకున్నారునందిత తండ్రి గంగాధరం గారు.

గంగాధరం గారు సురత్కల్ కి బస్సు ఎక్కే ముందరే రైల్వే స్టేషన్ దగ్గర తన మనుషులని పెట్టి,గంగాధరం గారి ఫోటో హైదరాబాద్ లో ఉండే తన ఫ్రెండ్ రోహిత్ దగ్గర నించి సంపాదించి , అది ఇక్కడ తన ఫ్రెండ్స్ కి ఇచ్చాడు అభిమన్యు. వాళ్ళు గంగాధరం గారు తో రైల్వే స్టేషన్ లోనే పరిచయం చేసుకుని, వాళ్ళు కూడా నందిత కాలేజీ అని చెప్పి, వారితో పాటు సూరత్కల్ బస్సు ఎక్కించారు. ఇదంతా అభిమన్యు ప్లాన్ చేసాడు. 

అభిమన్యు అంతే ఏదైనా అనుకుంటే ఎక్కడా కూడా చిన్న తప్పు జరగకుండా ప్లాన్ చేస్తాడు. చిన్న చిన్న వి కూడా చాలాడీటెయిల్  గా ప్లాన్ చేస్తాడు.

అభిమన్యు కి కరెక్ట్ టైం నందిత నాన్నగారు హాస్టల్ కి వచ్చేది  తెలియాలి అందుకనే తన స్నేహితులు ఇద్దరినీ బెంగుళూరు వరుకు పంపించి మల్లీ నందిత తండ్రి గారి తో వచ్చేటట్టు ప్లాన్ చేసాడు. దానికి ముందరే తన స్నేహితుల కి చేతి నిండా డబ్బు ఇచ్చాడు.

కరెక్ట్ గా గంగాధరం గారు హాస్టల్ కి ఒక అరగంట లో వస్తారనగా అభిమన్యు తన రూం లో వున్నాడు కాల్ కోసం ఎదురు చూస్తున్నాడు  ....

అభిమన్యు బోయ్స్ హాస్టల్ లో పడుకోకుండా తను తరువాత చెయ్యాల్సిన దాని గురించి ఎలా చేస్తే ఎఫ్ఫెక్టివే గా వుంటుంది అని ఆలోచిస్తున్నాడు. మంచం మీద బోర్ల పడుకుని చేతులు మంచం మీద నించి కింద బూమికి ఆనించి, మంచం చివరికి పిల్లో మీద తన గడ్డం ఆనించి పడుకున్నాడు. చాలా రెస్ట్ లెస్ గా ఉన్నాడు.టైమింగ్ కరెక్ట్ గా లేక  పోతే మొత్తం  ప్లాన్ ఫెయిల్ అవుతుంది అంతే కాక తను నందిత ముందు ఫూల్ అవ్వాల్సివస్తుంది.

నందిత గుర్తు కి రాగానే ... "ఏమి చేస్తూ ఉంటుంది? బహుశ హాయిగా మంచి నిద్దరలో కళల కౌగిలిలో తెలుతోందేమో? పాపం తన కేమితేలుసు కొంచెం సేపులో తన కలలో కూడా ఊహించని సంఘటన జరుగుతుందని? అదికూడా తన మూలంగా అని.. " అనుకున్నాడు అభిమన్యు.

"ఎదుకోగాని నందిత తో ఏమి పెట్టుకున్న చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాడు! ఎందుకో ఎప్పుడు నందిత గురించే మనసు ఆరాట పడుతుంది.. ఎంతమంది అందమైన మంగుళూరు అమ్మియలు వున్న కళ్ళకి నందిత తప్ప ఎవరు కనపడట్లేదు ఎందుకని?" అని ఎన్నోసార్లు తన మనసుని ప్రశ్నించుకున్నాడు అభిమన్యు.
ఇంతలో తన ఫ్రెండ్ పక్కకి వచ్చి సెల్ తో వాళ్ళు ఇంకో అరగంటలో లేడీస్ హాస్టల్ దగ్గర ఉంటామన్నాడు.
అంతే వెంటనే లేచి తన పజామా షర్టు తోనే, రేగిన జుట్టు తోనే లేడీస్ హాస్టల్ కి భయలుదేరాడు.

అంతా నిశబ్ధం... హాస్టల్ లో అందరూ గాడ నిద్దరలో ఉన్నారు. అప్పుడు టైం తెలవారు జామున నాలుగున్నర అయింది. చకా చకా నడుస్తున్నాడు.. ఒక అయిదు నిముషాల్లో లేడీస్ హాస్టల్ వద్దా కు చేరుకున్నాడు. మెల్లిగా ఎవరు చూడట్లేదని నిర్ధారించు కున్నాక హాస్టల్ గోడ ఎక్కి అటు వైపుకి లోపలి కి ఒక జుంప్ కొట్టాడు. ఇక జాగ్రతగా నందిత రూం వంక నడవసాగాడు.

ముద్ర రోజే  నందిత ఏ రూం లో వుంటుంది, రూం ఎటు వైపు ఉంటుంది అన్ని డీటెయిల్స్ తన ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాడు. లక్కీ గా నందిత రూం కార్నెర్ కి మెట్ల కిందకి ఫస్ట్ ఫ్లూర్ లో ఉంటుంది. సో రూం కి చేరడం అంత కష్టం అవలేదు అభిమన్యు కి. ఇప్పుడే అసలైన కీలికమైన పని. నందిత రూం లోకి దూరడం.......

నందత రూమ్మేట్ శ్రుతి కి ముందర రోజే "నాన్న కి సీరియస్. తొందరగా రా" అని ఒకఫేక్ కాల్ శృతి కి చేపిచ్చాడు. శృతి వాళ్ళ ఇంట్లో ఫోన్ లేక పోతే పక్కింటి ఆంటీ అని ఎవరితోనే మాట్లాడిచ్చాడు. శృతి నమ్మ లేదు కానీ తన తల్లి ఒక్కత్తే ఉంటుంది కనుక శ్రుతి మరేమి ఆలోచించక ఊరు కి ప్రయాణం అయ్యేటట్టు చేసాడు అభిమన్యు.

గట్టిగా ఊపిరి పీల్చుకుని నందిత రూం తలుపు ముందు వచ్చి నిలబడి మెల్లి గా నందిత కి మాత్రమె వినపదేటట్టు కొట్టాడు..
ఏమి ఉలుకు లేదు పలుకు లేదు..
ఈసారి ఇంకొంచెము గట్టిగా నందిత కి వినపడేటట్టు కొట్టాడు..ఒక్కసారి ఉలిక్కి పడి లేచింది నందిత.
మల్లీ ఏమి చప్పుడు అవకపోయేసరికి తనే నిద్దర మత్తులో తప్పుగా విని ఉంటుంది అనుకుని పడుకోబోయింది..ఇంతలో మల్లీ చప్పుడు అయ్యేసరికి
"ఎవరు??"... మిమల్నే "ఎవరక్కడ?" అని కేక పెట్టింది..
జవాబు లేదు..
ఎందుకో నందిత కి ఒక నిముషము భయం వేసింది. మల్లీ భయం దేనికి ఎవరో పొరపాటున తన రూం కి వచ్చుంటారు అనుకుంది. తనకి తెలుసు కొంతమంది అమ్మాయిల కోసం అప్పుడప్పుడు అబ్బాయిలు వస్తుంటారని...
ఈ సారి మల్లీ కొట్టితే తలుపు తియ్యాలి అనుకుంది. నందిత టూ పీస్ నైట్ గౌన్ లో స్లీవ్ లెస్ ది వేసుకుని ఉంది.
మల్లీ చప్పుడు అయ్యేసరికి ఇంకా దైర్యం తెచ్చుకుని, పైన నైటీ స్లిప్ కూడా వేసుకుని  "ఎవరది?" అంటూ తలుపు తీసింది...

వెంటనే అభిమన్యు మెట్లకి ఇటుపక్కన కార్నెర్ కి నక్కి నుంచున్నాడు...
నందిత కి ఎవరు చీకట్లో కనపడలేదు... "ఎవరై ఉంటారబ్బా?" అనుకుంటూ కార్నెర్  వరుకు వెళ్లి చూసింది....
ఇదే ఛాన్స్ అని అభిమన్యు మెల్లిగా అటుపక్కనించి నందిత రూం లోకి మెల్లిగా తలుపు తోసుకుని మల్లీ జాగ్రత్త గా కొద్ది గానే తెరిచి నందిత కి బెడ్ కి పక్కనే ఉన్న బీరువా వెనకాలకి నక్కాడు.

ఎవరూ కనపడక పోతే ఎవరో తనని ఆట పట్టడానికి చేసి వుంటారు అనుకుని తన రూం లోకి వెళ్లి తలుపు లోపల నించి లాక్ చేసుకుని మంచం దగ్గరికి నడిచింది. పైన ఉన్నసిప్ ని తీసేసి స్లీవ్ లెస్ నైటీ తో మంచం మీద పడింది..ఆ పడడములో మోకాళ్ళ పై వరుకు గౌన్ పైకి వెళ్ళింది... ముందర గౌన్ జిప్పేర్ కూడా కొంచెం కిందకి జరిగింది.... నందిత అవేమి సరిచేసుకునే మూడ్ లో లేదు.. పైగా ఎవరూ రూం లో లేరు కదా అన్న స్వాతంత్రం... కానీ తనకేమి తెలుసు బీరువా వెనుకనుంచి నక్కి దాగున్న అభిమన్యు కి తను మొత్తం కనపడుతోందని ...తనని అలా గిన అందాలన్నీ చూస్తున్న అభిమన్యు కి పిచ్చి ఎక్కుతోంది అని...

మొదటి సారి నందిత ని ఇలా దగ్గరగా అతి దగ్గరగా... అది కూడా చూడకూడని విధముగా .. చూడకూడని సమయములో చూస్తున్నందుకు అభిమన్యు లో చాలా కలకలం మొదలయింది... వెంటనే నందిత దగ్గర వెళ్లి ... గట్టిగ హాగ్ చెయ్యాలని... వళ్ళంతా తాకాలని...ముద్దలుతో నింపాలని మనసు తొందర పెడుతోంది.. అభిమన్యు కి నిగ్రహము నశిస్తోంది..

అసలే అమ్మాయిలతో క్లోజ్ గా ఫ్రీ గా మూవ్ అయ్యే తనకి ఇదంత అంత పెద్ద విషయం కాదు. ఎంతో మంది సెక్సీ గా రెడీ అయ్యి తనని ఎన్ని సార్లు టెంప్ట్ చేశారని కానీ ఏదో కొత్త గిలిగింత పుట్టింది. "నందిత అందాన్ని తట్టుకోలేక పోతున్నాడు.

ఇంక తను ఆగలేడు...ప్లాన్ మార్చు కున్నాడు. "ఫర్గెట్ అబౌట్ నందిత డాడ్ . ఐ వాంట్ హర్ నౌ" అని అనుకుంటూ నందిత దగ్గరికి మెల్లిగా నడవబోఎసరికి.... ఎవరో తలుపు కొట్టారు...
*******************************************************

కాలేజీ లేడీస్ హాస్టల్ వరుకు వచ్చి స్టూడెంట్స్ గంగాధరం గారికి సెలవు తీసుకుంటూ "అంకుల్! మీరు ఏమి అనుకోకపోతే ఒక మాటా చేపచ్చ? ప్లీజ్ మమల్ని వేరేగా అనుకోకండి. చూస్తుంటే మీరు ఇంత పొద్దున్నే వచ్చారు...ఏమి అనుకోవద్దు నందిత కి మీరు వస్తునట్టు తెలుసా?" అని అన్నాడు వకడు
"తెలీదు! అయితే ఏంటి?" అన్నారుగంగాధరం గారు . "ఇది అడగడానికి అంత ఇది గా ఎందుకు అడుగుతున్నారు" అనుకున్నారు ఆయన
"చెప్పండి బాబు ఏంటిచెప్పండి ?"
మల్లీ వాళ్ళలో ఒకడు నసుగుతూ, ఎంతో భక్తి శ్రద్దలతో వినయముగా "అంది కాదు అంకుల్! మీరు రా కూడని టైం కి వచ్చారు! పైగా చూడకూడని సంఘటనలు ఏమైనా చూస్తారేమో అని మాకు భాధ గా ఉంది?" అన్నడు.
ఇప్పుడుగంగాధరం గారు అయోమయంలో పడ్డారు పైగా కోపము కూడా వచ్చింది "ఏమంటున్నారువీళ్ళు ? రాకూడని టైం ఆ?చూడకూడనిసంఘటనలా ? అంటె ఏంటి వీళ్ళ ఉద్దేశం?" అనుకుంటూ గట్టిగా కొంచెము కోపంగా అడిగారు వాళ్ళని.
"చూడు బబు!ఏమైనా చెప్పాలంటే తిన్నగా చెప్పండి? అంతేకాని డొంకతిరుగుడు వద్దు" అన్నారు నందిత తండ్రి గంగాధరం గారు.
"అంకుల్! మేము నందిత కి మంచి స్నేహితులము  ఇదివరుకు. మీకు తిన్నగా చెప్పాలంటే.. మీకు ఆకాశరామన్న ఉత్తరం వ్రాసింది మేమే" అంతే ఈ మాటా చెప్పేలోపలే గంగాధరం గారు వాళ్ళల్లో ఒకడి పీక పట్టుకున్నారు.
"ఏంటి మీరా ఆ ఉత్తరం వ్రాసింది? ఎన్ని దమ్ములు ర మీకు? బంగారం లాంటి నా కూతురు మీద అన్ని నిందలు వ్రాయడానికి? పదండి నీ కాలు చేతులు విరగగొడతాను! నా కూతురు చేతనే సమాధానము చేపిస్తాను! పదండి అంటూ వాడిని లాక్కుంటూ వచ్చారు ఆయన.
"అంకుల్! మీరు మమల్ని చంపినా పర్వాలేదు? మీరు వెన్నకి వెళ్ళిపొండి అంకుల్!" అంటూ వాడు ఏడుస్తున్నాడు. ఆయన పట్టుకి మెడ నరాలు లాగేస్తున్నై.. "తన పని అయిపోయింది" అనుకున్ను వాడు. నందిత రూం కి వాళ్ళని తీసుకు వెళ్ళమని ఆదేశించాడు ఆయన.

**********************************************************

నందిత "మళ్ళీ ఎవరు" అనుకుని కోపం గా తలుపు తీసింది.

ఎదురుగా నాన్నగారి ని చూడగానే నందిత షాక్ తినింది..
షాక్ నించి బయటకి రాడానికి టైం పట్టింది. కలా నిజమా అర్ధం కాలేదు.. తడపడుతూ "నాన్న!!! మీరా? ఇప్పుడా? ఈ సమయంలోన? ఎందుకొచ్చారు?అంత ఓకే కదా" అంటూ ఏదేదో మాట్లాడింది. పైగా నాన్నగారి తో వచ్చిన ఇద్దరినీ వింతగా చూస్తూ ఉండిపోయింది.

వాళ్ళలో ఒకడు నందిత ని పై నించి కిందకి చొంగ కారుస్థూ చూడడం చూసి నందిత గుండెల కి చెయ్యి అడ్డుపెట్టుకుంది. అంత వరుకు తెలీదు తను పైన గౌన్ వీసుకోలేదని.  "వీలేవ్వరు ?" అని "ఇప్పుడే వస్తాను" అని రూం లోకి వెళ్ళబోయింది ఇంతలో "ఎవరూ" అంటూ రూం లోంచి మత్హుగా ఎవరిదో గొంతు వినిపించేసరికి..
పిచ్చెక్కింది నందితకి... భయం కూడా వేసింది  "ఇంతలో ఎవరూ వెళ్లారు?" అనుకుంది
ముందు గా తేరుకుందిగంగాధరం గారు. ఆయనతో వచ్చిన  స్టూడెంట్స్ వంక .. నందిత వంక.. రూం వంక మార్చి మార్చి చూస్తున్నారు. వాళ్ళలో ఒక్కడు "చెప్పానా ?" అన్నట్టు తల ఆడించాడు. ఆయన వాడిని వదిలేసి నందిత బెడ్రూం వంక నందితని కూడా తోసేసి పరుగున వెళ్లి ఎదురుగా ఉన్న దృశ్యం చూసి గుండెలు మీద చేతులు వేసుకుని అలా అక్కడున్న కుర్చీలో పడిపోయాడు.
నందిత "నాన్న! నాన్న! ఏమైంది?"  అంటూ ఆయన వెనకాల వచ్చి అక్కడ తన మంచము మీదు పడుకుని అప్పుడే లేస్తున్న అభిమన్యు వంక.. అందులోనూ తన గౌన్చేతికి చుట్టుకు వున్న అతనిని చూసి కళ్ళు తిరిగి కింద పడ బోయింది...మైండ్ బ్లాక్ అయింది.. ఏమి అర్ధం కావట్లేదు... "కలనా ? నిజమా?" అర్ధం కావట్లేదు నందితకి.
నందితని చూడగానే "ఓ! మై గాడ్ !! హోలీ కౌ !!" అంటూ లేచి నందిత వాళ్ళ నాన్న చూస్తుండగానే తన షర్టు వీసుకుని గాబరాగా.. చాలాసిగ్గుగా అవమానం గా ఫీల్ అయ్యి..నందిత  దగ్గరకి వచ్చి "యు ఫూల్ !!! మీ నాన్నగారు వస్తున్నట్టు ఎందుకు చెప్పలేదు? రాత్రికి ప్రోగ్రాం వద్దు వద్దు అంటే వినలేదు!! శృతి ఊరులో లేదు ఇంతకన్నా మంచి ఛాన్స్ దొరకదు అన్నావు చూడు ఇప్పుడు ? లక్కీ గా షర్ట్ ఒక్కటే వేసుకోలేదు! ఎనీవేస్!సారీ అంకుల్!! ప్లీజ్ డోంట్ బె మాడ్. మేము ఇద్దరమూ చాలా క్లోజ్ అందుకని అప్పుడప్పుడు కంపెనీ ఇస్తాను నందు లోన్లీ గా ఉంటే అండ్ ఇవ్వన్నీ ఇప్పుడు కామన్ కదా !! నందు!! మీ నాన్నగారి తో నువ్వు పర్సనల్ గా మాట్లాడాలేమో చర్ర్య్ ఆన్ !! సి యు లేటర్ బేబీ "  అనేసి నందిత టాప్ నైటీ స్లిప్ నందిత కి కప్పి నంది త బుగ్గ మీద ముద్దు పెట్టి బయటకి వెళ్లి పోయాడు అదేదో చాలా సహజ మైన పని లా. నందిత కి ఏమవుతోందో అర్ధం కావట్లేదు... మైండ్ పనిచేయట్లేదు. అభిమానాయు వెళ్లిన వైపే చూస్తూ ఉండిపోయింది.

గంగాధరం గారి పరిస్థితి ఏ నిముషమైన గుండె ఆగేటట్టు ఉంది. ఆయన అందరూ పుకార్లు పుట్టిస్తున్నారు అనుకున్నాడు. వచ్చాడే కానీ నందిత మీద అనుమానం తో కాదు.అసలేమవుతోందో తెలుసుకుందామని.తన కూతురికి ఏమి కష్టం రాలేదు కదా?? అనుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడి దృశ్యం చూసాక అంతా నిజమే అని తేలిపోయింది. నందిత ని ఒక నిముషము భరించలేకపోయాడు. "తను కన్నా కూతురేనా? ఇలా దిగజారిపోయింది? అనుకున్నాడు.
అంతే లేచి తన సంచి చేత్తో పట్టుకుని ఇందాక తనతో వచ్చిన పిల్లలు అక్కడే భయపడి నిలుచుని ఉన్నారు. వాళ్ళ దగ్గరకి కళ్ళు తన కండువాతో తుడుచుకుంటూ "బాబు! ఇలాంటి పనికమాలిన పనిని నా కళ్లారా చూసేటట్టు చేసి పుణ్యం కట్టుకున్నారు! దయచేసి బాబు ఈ ముసలివాడిని బస్సు స్టాప్ వరుకు దించి బస్సు ఎక్కించండి బాబు! నా కు కాళ్ళు చేతులు అసలు మెదడే పని చెయ్యట్లేదు" అన్నాడు.

ఇప్పుడు నందిత స్పృహ లోకి వచ్చి ప్రభాకరం గారి దగ్గరకి పరుగునా ఏడుస్తూ  వచ్చింది.
నందితకి తన తండ్రి మీద కోపము వచ్చింది, మల్లీ జాలి వేసింది.. బాధ కలిగింది.."ఎలా తట్టు కుంటున్నారో ?" అనుకుంది. "తనకే ఒక్క క్షణం లో కాళ్ళ కింద భూమి జరిగినంత పని అయింది! మరీ నాన్నగారి సంగతో? ఇప్పుడు ఆయన అసలు ఏమి జరిగిందో తెలుసుకోవాలి." అనుకుంది కానీ తనకేమి తెలుసు తన తండ్రి కి చెప్పడానికి అనుకుని బాధపడింది. కంటి నుంచి నీళ్ళు అలా ప్రవహిస్త్హునే ఉన్నాయి...

"నాన్న!! ఆగండి? ఎక్కడికి వెళ్తున్నారు? నా మాటా వినండి. ఇక్కడి జరిగినదంత అబధము! ప్లీజ్ నిజము ఏంటో తెలుసుకోకుండా మీరు వెళ్ళడానికి వీలు లేదు!" అంటూ తలుపుకి అడ్డు నిలుచుంది.
ఆయన "ఛీ !!! ధవుర్భాగ్యురాల!!!నీ నాన్న ఇందాక నీ రూము నుండి ఆ కుర్రాడు భయట కి వచినప్పుడే చచ్చాడే!!! ఇప్పుడు ఒక చచ్చిన శవమే నేను! ఇంటి వరుకు వెళ్లి ఈ చావు కబురు చెప్పాలి కద. మీ అమ్మ, చెల్లెలు, తమ్ముడు, ఇక్కడ నువ్వు రాత్రి పగలు కష్టపడి బాగా చదువుకుని ఉన్నత శిఖరాలు ఎక్కుతావని ఆశ పడుతున్నారు కద.... చెప్పనీ .. అవన్నీ మీ బ్రమలని...నీకు మాకు ఈ రోజు తో ఋణము తీరిపోయిందని చెపాలి? నువ్వు ఎందులో దూకినా మాకు పర్వాలేదు, ఎవడితోతిరిగినా ఏమి చేసినా పర్వాలేదు? నీ ఇష్టం వచినట్టు కానీ! ఇప్పుడు నన్ను ఆపి కట్టు కధలు చెప్పి, ఇదంతా నిజము కాదు అని చెప్పడానికి ప్రయత్నిస్తే కానీ , మళ్ళీ నీ పాపిష్టి మోహము మాకు చూపిచ్చినా? నన్నుచంపి కాకులకి గద్ధలకి పెట్టినంత గుర్తుంచుకో!!" అంటూ ఆ ఇద్దరి కుర్రాళ్ళతో భయటకు వెళ్ళిపోయారు గంగాధరం గారు.

తన తండ్రి వెళ్ళినా వైపే సూన్యం లోకి చూస్తూ కూర్చుండిపోయింది నందిత . అసలు ఏమైంది, ఎందుకైంది ఏమి అర్ధం కాకుండా ఉంది. బుర్ర వేడెక్కి పోతోంది.  

*************************************************