Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Seven : Nanditha’s father sees Nanditha with Abhimanyu in her room – Part 2

 


అభిమన్యు కి నందిత ఇలాంటి సిట్యుయేషను లో పడేసినందుకు చాలా చాలా సంతోషం గా ఉంది. అక్కడ నందిత తండ్రి పరిస్థితి ఏంటో తన ఫ్రెండ్స్ ని అడిగి తెలుసుకుందామని సెల్ కోసము చూసుకుంటే సెల్ లేదు పాకెట్ లో. అప్పుడు గుర్తువచ్చింది నందిత బెడ్ మీద పడి వుంటుంది అని. మళ్ళీ నందిత రూం కి బయలుదేరాడు.

అభిమన్యు రూం కి వచ్చేసరికి తలుపులు తెరిచే వున్నాయి. నందిత ఒక కార్నెర్ కి తల మోకాళ్ళ మధ్య దాచుకుని చేతులు మోకాళ్ళ చుట్టూ చుట్టుకుని వుంది. తలుపు దగ్గర చప్పుడు అయ్యేసరికి తల ఎత్తి అటు వైపు చూసింది. అక్కడ స్టైల్ గా తలుపుదగ్గర గాగుల్స్ చేత్తో తిప్పుతూ నవ్వుతున్న అభిమన్యు ని చూస్తూనే కళ్ళు పెద్దవయ్యాయి, కోపం, బాధ,అసహ్యం అన్ని వెంట వెంటనే కలిగాయి.
నందితని ఇంకా కొంచము ఏడిపియ్యాలని "హాయ్! స్వీటి!" అని కన్ను గీటాడు.

తన దగ్గరకి అసలు ఏమి జరగనట్టే నవ్వుతూ వస్తున్న అభీ ని చూసేసరికి వళ్ళు మండిపోయింది నందిత కి. అసహ్యం వేసింది.
"చీ!" అని తల అటు తిప్పీసుకుంది నందిత.
నందిత ముందు కి వచ్చి కూర్చోబోయాడు అభిమన్యు.
నందితకి అభిమన్యు ముఖము కూడా చూడాలంటె కంపరం గా ఉంది. వెంటనే లేవబోయింది.
అప్పటికే అభిమన్యు తనకి చాలా దగ్గరగా వచ్చేసాడు. ఒక చెయ్యి పక్కకి నెలకి ఆనించి ఉంకో చేత్తో గోడ పట్టుకోబోయి మిస్ అయింది. అప్పటికి అభిమన్యు కూడా ఒక చెయ్యి నేలకి ఆనించి కూర్చోబోయాడు. నందిత లేవబోయేసరికి తను కూడా లేవబోయాడు. గోడ పట్టుకోబోయి  మిస్ అయిన నందిత తనకి దగ్గరగా  అప్పుడే లేవబోతున్న అభిమన్యు మీద తూలి ముందర పడబోయింది.సడన్ గా తన మీద పడిన నందిత వెయిట్ బాలన్సు చేసుకోలేక తను కూడా బాలన్సు తప్పాడు అభిమన్యు. నందిత అభిమన్యు ని గట్టిగా పెనవేసుకుంది. అభిమన్యు కూడా నందిత ని గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ కింద పడ్డారు.
ఒకరి ముఖము ఒకరికి అంత దగ్గరగా వుండేసరికి, ఒకరి ఊపిరి ఒకరికి వెచ్చగా తగులుతోంది. ఒకరి కళ్ళలోకి ఒకరు చూస్తున్నారు. దేనికోసమో  కళ్ళు వెతుకుతున్నాయి. ఈ ప్రపంచములో లేరు ఇద్దరూ.

వేగంగా కొట్టుకుంటున్న అభిమన్యు గుండెల శబ్దం తన చెవులకి వినపడుతోంది. మెల్లిగా శరీరంలో ఏదో ప్రకంపనలు మొదలవసాగాయి. తన గుండె కూడా వేగంగా కొట్టుకోవడము మొదలెట్టింది.
"ఏంటిది?ఏమవుతోంది? తనని ఇంతగా అవమానించి బాధ పెట్టాడే, అతనిని ఎంతగా ద్వేషిస్తోంది? మరీ ఏంటి ఇప్పుడు అతని గుండెల మీద వుంటే ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉందేంటి? గట్టిగా పొదవి పట్టుకుంటే సురక్షితంగా ఇంకా ఇంకా హత్తుకుంటే బావుండు అనిపిస్తోందేంటి?" అనుకుంటూ తాను ఉన్న పరిస్థితి గుర్తు కి వచ్చి మెల్లిగా లేవ సాగింది.

అభిమన్యు పరిస్థతి కూడా ఇంచు మించు ఇలానే ఉంది. నందిత కౌగిలిలో స్వర్గం లో ఉన్నట్టుంది. ఏదో మత్తుగా , హాయిగా వుంది. అభిమన్యు కి కూడా విచిత్రం గా ఉంది. "ఎంత సంతోష పడ్డాడు నందు మీద పగ తీర్చుకున్నందుకు, ఇంకా ఇంకా బాధ పెట్టాలని, అవమాన పరచాలని ఎంతగా అనుకున్నాడు. మరీ ఇప్పుడేంటి ఇలా జరుగుతోంది? ఏమైనా సరేఇలానే ఉండి పోతే బావుండు ." అనుకున్నాడు.

ఇంతలో నందిత లేవబోయేసరికి గట్టిగా  ఎక్కడ ఈ మధురస్వప్నం చేదిరిపోతుందో అన్న భయం తో ఇంకా గట్టిగా మీద కి లాకున్నాడు అభిమన్యు. ఈసారి నందిత ముఖము అభిమన్యు ముఖానికి ఎదురుగా, ఒకరి ముక్కు ఒకరికి  తాకుతోంది. వేడి వేడి నిట్టూర్పులు ఒకరికొకరికి తాకుతున్నాయి. ఒకరి పెదవులు ఒకరికి దగ్గరగా అతి దగ్గరగా ఉన్నాయి. నందితకి భయానికి చెమటలు పట్టా సాగాయి. పెదాలు అదర సాగాయి.

అభిమన్యు కి నందిత పెదాలు సవాలు చేస్తునట్టున్నాయి.
ఇద్దరికీ వంట్లో కరెంటు ప్రవహిస్తునట్టు వుంది. ఎవరో మంత్రం వేసినట్టు ఒకరికి ఒకరు ఆకర్షితులవుతున్నారు.
అభిమన్యు నందిత పెదవులనే చూస్తున్నాడు. మనసు "ఇంకెంతసేపు చూస్తావు?ముందుకి పద" అని తొందర పడుతోంది. అభిమన్యు నందిత  ని ఇంకా గట్టిగా హత్తుకుని పక్కకు తిరిగాడు. ఇప్పుడు నందిత మీద తను వున్నాడు. నందిత కి మెల్లిగా పరిస్థితి అర్ధమవసాగింది. లేవడానికి ప్రయత్నిస్తోంది. చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అభిమన్యు ఇంకా బలంగా పట్టుకున్నాడు.
తన చేతులతో నందిత చేతులు ని కదలకుండా చుట్టేసాడు. నందిత కి ఇంకా భయం వెయ్య సాగింది చెమటలు పెట్ట సాగాయి.

ఇప్పటి దాకా బానే ఉంది కానీ ఇప్పుడిప్పుడే మత్తు వదలసాగింది నందిత కి. అభిమన్యు కి మెల్లిగా కోరిక బలమవసాగింది. మెల్లగా నందిత మీదకి వంగి నందిత పెదవులని కాంక్ష తో ముద్దు పెట్టుకోబోయాడు. నందిత కి ప్రాణం పోయేటట్టు వుంది. ఊపిరి ఆగిపోతున్నట్టు వుంది. ఇంకా ఒక్క సెకండ్ లో అభిమన్యు పెదవులు తన పెదవులని బందించే లోపల "ఛీ! వదులు" అని గట్టిగా బలంగా తోసేసింది. అనుకోని ఈ చర్య కి అభిమన్యు పట్టు సడిలింది. వెంటనే పక్కకు దొర్లింది నందిత. 

వెంటనే తేరుకుని రెండు చేతులు చాచి బలంగా నందిత శరీరం మొత్తం ఇటు పక్కకి తన మీద కి లాగేసాడు.   
"ఇప్పుడు?" కసిగా అన్నాడు అభిమన్యు.
వెంటనే నందిత అభిమన్యు ముఖాన్ని బలంగా టపటపా మనిపించింది. ఒక్క క్షణం అర్ధం కాలేదు అభిమన్యు కి ఎమిజరగిందో. వెంటనే ఒక చేతి తో నందిత రెండు చేతులు కదలకుండా గట్టిగా బంధించాడు, మరో చేతితో నందిత  శరీరాన్ని లేవకుండా నొక్కి పెట్టేశాడు. క్షణం సేపు కాలం నిలిచిపోయింది.
నందిత భయం గా చూసింది. ఆ చూపు అభిమన్యు యవ్వనాన్ని రెచ్చగొట్టింది. దగ్గరగా హత్తుకొని వున్న నందిత కోమలమైన శరీరం కోర్కెని నిద్రలేపింది. అవమానం పొందిన అంతరాత్మ ప్రతీకారం తీర్చుకో మంటోంది. అభిమన్యు కి మతి పోతోంది. ఇందాక మంచం మీద నందిత ని చూసినప్పటి నుంచి అతనికి పిచ్చి ఎక్కుతోంది నందిత అందాన్ని చూస్తుంటే....

వెంటనే కాంక్షతో కసిగా నందిత పెదవులని తన పెదవులతో బంధిచెసాడు. కాలం ఆగిపోయింది. నందిత మొదట కొంచెం సేపు  పెనుగులాడి చివరకి లొంగిపోయింది. తను కూడా ముద్దు మాధుర్యాని అనుభావించసాగింది.
ఈ ముద్దు ఎవరూ కనుకున్నారో కానీ దానికి సాటి లేదు....
అలా ఎంత సేపు గడిచిందో వాళ్ళకే తెలీదు.
ఇంతలో పెద్దగా తలుపు దగ్గర ఏదో బద్దలయిన చప్పుడుకి యిద్దరూ ఉలిక్కి పడ్డారు.ఇద్దరు అటు వైపు చూసారు.

నందిత అభిమన్యు ఒకరి ముఖము వకరు ఆశ్చర్యం తో చూసుకున్నారు.
ముందుగా తేరుకుంది నందిత. అభిమన్యు ని ఒక తోపు తోసి అక్కడ నిల్చుని వున్న వ్యక్తి వైపు ఆశ్చర్యం తో భయం తో కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. నోరు తెరిచి అలానే చూస్తూ ఉండిపోయింది. వళ్ళంతా చెమటలు పట్టాయి. భయం తో లేచి నైటీ ని సరి చేసుకుంది. అభిమన్యు కూడా లేచి నిల్చున్నాడు.
నందిత కి నోటి లోంచి మాటా రావట్లేదు.
"ఏంటి అంకుల్ ! మీరి ఇంకా వెళ్ళ లేదా?" అని అడిగాడు అభిమన్యు.

గంగాధరం గారికి ఇందాక తను నందిత రూం లో చూసినవన్ని ఎందుకో నిజము కాదని, ఎవరో కావాలని నందిత మీద కక్ష తో చేసరేమోనని అనుమానము కలిగింది. పైగా తను కూతురి ని అనవసరంగా అనుమానించాడేమో అని బాధ కూడా కలిగింది. తను కూతురి మాటా వినిపించుకోలేదు పైగా ఒక్క అవకాసము కూడా నందిత కి ఏమి జరిగిందో చెప్పడానికి ఇవ్వలేదని ఎంతగాను మదన పడ్డారు. నందిత పైగా అత్మభిమానము కలిగిన పిల్ల, తన ప్రవర్తనకి ఏమైనా చెయ్యకూడని అఘైత్యంచేసు కుంటుందేమో అని కూడా కంగారేసింది గంగాధరం గారికి. వెంటనే ఒక్కసారి వెళ్లి విషయము ఏమిటో కనుక్కుందామని వచ్చారు. కూతురు ని తలచుకుంటే కంట్లో నీళ్ళు తిరిగాయి. "ఎన్ని మాటలు అన్నాను. పాపం పిచి పిల్ల ఎలా తట్టుకుందో? ఎంత మదన పడుతోందో? ఎంత బాధ పడుతోందో?" అని మనసులో అనుకుంటూ కళ్ళు తుడుచుకుని రూం లోకి వచ్చారు.

రాగానే అక్కడ దృశ్యం చూడగానే కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయింది. ఏదయితే నిజం కాదు అని అనుకున్నాడో, ఏదయితే తను చూడకూడదు అనుకున్నాడో కళ్ళ ముందు ప్రత్యక్ష్యం అయింది.తను ఒక కుర్రాడిని అమ్మాయి గది లో చూసాడే తప్ప, అమ్మాయితో చూడ లేదు కదా తప్పు పట్టడానికి అనుకుని వచ్చిన  ఆశ నిరాశ అయింది.
గంగాధరం గారికి కోపం తో వళ్ళు వుడికిపోతోంది, కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. 

కోపంతో పెద్దగా "పట్టపగలు సిగ్గులేకుండా, వంటి మీద స్పృహ లేకుండా ఒకరి మీద ఒకరు పడి ముద్దులు పెట్టుకోడానికి సిగ్గులేదు?తలుపులు మూసుకోవాలని కూడా తెలియని స్థితి లో ఉన్నారా?  పైగా ఇప్పుడే తండ్రి ని ఎంత గా బాధ పెట్టాను అని కొంచెము కూడా మనసులో బాధ లేదా?" అంటూ ఊగిపోయారు గంగాధరం గారు.
"నేను నిన్ను తప్పుగా అర్ధం చేసుకున్నా నని బాధ తో క్షమార్పణ చెప్పాలని వచ్చాను కానీ నేను అనుకున్నవన్నీ నిజాలని ప్రత్యక్షంగా చూపించావు కధే పాపిష్టిదానా!"
"నా పెంపకంలో ఏమి తక్కువయిందో ఇలా పెడదారి పట్టావు? ఛీ! నా కర్మ కాలి మళ్ళీ ఈ దృశ్యాన్ని చూడడానికి వచ్చాను చూడు నా కర్మ. ఇవన్ని చూడడానికా నేనింకా ఎందుకు బతికి ఉన్నాను? ఈ క్షణంలోనే భూమి చీలి నేను అందులో పడిపోతే బావుండు." అని బావురుమన్నారు గంగాధరం గారు.

నందిత అలానే మౌనంగా ఏడుస్తూ నిల్చుంది.
ఏమని మాట్లాడుతుంది తను? ఇప్పుడు చూసిన దృశ్యము ఎవరైనా చూసిన ఇలానే అర్ధం చేసుకుంటారు.
ఇప్పుడు అభిమన్యు తనంతటి తాను "అంకుల్! ఇది అంతా నా తప్పు నేనే చేశాను. నందిత తప్పు ఏమి లేదు" అని చెప్పిన గంగాధరం గారు నమ్మరు.
అభిమన్యు కి ఏదో సినిమా చూస్తున్నట్టు ఉంది. ఇంత సీన్ ఎందుకుక్రియేట్ చేస్తున్నారో అర్ధం కావట్లేదు. 
అభిమన్యు కి గంగాధరం గారి మీద పీకల వరుకు కోపం వస్తోంది.
"మంచి ఛాన్స్ పోగొట్టాడు! ఇది రెండో సారి. ఇప్పటికి నందిత మనసు మారేలోపల ఈయనని పంపేయాలి" అనుకున్నాడు అభిమన్యు.

ఏమనుకున్నారో గంగాధరం గారు అభిమన్యు దగ్గరకి వచ్చి "బాబు! పెద్ద వాడిని నీ కాళ్ళ కి దన్నం పెడతాను నందిత ని పెళ్లి చేసుకో బాబు. చచ్చేనా వచ్చే జన్మ లో నైనా నీ ఋణం తీర్చుకుంటాను." అని అభిమన్యు చేతులు పట్టుకున్నారు.
అభిమన్యు కి ఈ అనుకోని సంఘటనికి మతి పోయింది.
"నందిత ని తను పెళ్లి చేసుకోవడమా? ఇది కలనా? నిజమా? తనకి  ఎప్పుడు నందిత ని పెళ్లి చేసుకోవాలని కలలో కూడా అనుకోలేదే? మరీ ఈయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు ?" అని అభిమన్యు కి మనసులో ఎన్నో ప్రశ్నలు మొదలయ్యాయి.

"వయసులోవున్న వాళ్ళు హద్దులు తప్పడము సహజమే అని అనుకుని నందిత ని క్షమిస్తాను. నా కూతురు కూడా ఇలాంటి తప్పులు చేస్తుందని నేను ఎన్నడు ఊహించలేదనుకో! ఎంత ప్రేమించుకున్నాపెళ్ళికి ముందు హద్దులు దాటాకుడదు. మన సమాజము పెట్టిన కొన్ని నియమాలు అందరూ పాటిస్తేనే పరువు, మర్యాద. ఇలా రోడ్డున పడితే పరువు పోతుంది. అందరి నోట్లో పడతాము." అని మందలించారు గంగాధరం గారు.
నందిత పిచ్చి దానిలా తన తండ్రి వంక చూస్తూ నిలబడింది.

"ఏమి మాట్లాడుతున్నారు నాన్నగారు? నేనుఇతని ని పెళ్లి చేసుకోవడమా? పెళ్లి కి ముందు హద్దులు దాటాడమా? నేనుఇతను ప్రేమించు కున్నామా? ఏమి ఊహించుకుంటున్నారు నాన్నగారు? తను అభీ తో హద్దులు దాటుతున్నాను అనుకుంటున్నారా? భగవంతుడా! ఏమి జరుగుతోంది? ఈ రోజు లేచినప్పటి నుంచి అసలు ఏమి జరుగుతోందో అర్ధం కావట్లేదు." అనుకుంటూ తల పట్టుకుంది నందిత.

అభిమన్యు ఇంకా గంగాధరం గారు అన్న "నందిత ని పెళ్లి చేసుకో" మాటలే చెవులకి వినిపిస్తున్నాయి. చాలా విచిత్రంగా వుంది పరిస్థితి.
నందిత కి బాగా ఉక్రోషంగా,అవమానంగా, సిగ్గుగా వుంది తన తండ్రి అభిమన్యు తో తనని పెళ్ళిచేసుకుంటావా అని అడిగినందుకు. అభిమన్యు వంక కళ్ళు ఎత్తి చూడలేకపోతోంది.

నందిత ని పట్టిచ్చుకోకుండా గంగాధరం గారు మల్లీ అభిమన్యు ని "చెప్పు బాబు? నందిత ని పెళ్లి చేసుకుంటావు కదా? కాదనకు బాబు ఈ ముసలి ప్రాణం తట్టుకోలేదు? నీ ఋణం జన్మలో తీర్చుకోలేను." అంటూ అభిమన్యు కాళ్ళ మీద పడ్డారు.
"అరెరే ! అంకుల్! ప్లీజ్ దయచేసి లెండి ప్లీజ్ పైకి లెండి! పెద్దవారు నా కాళ్ళ మీద పడతారేంటి?" అంటూ గంగాధరం గారిని లేపడానికి కిందకి వంగున్నాడు అభిమన్యు. అలా వంగుతూనే నందిత వంక చూసాడు.
నందిత కి మోహము పాలిపోయింది. దుఖము ముంచుకొస్తోంది. ఆందోళనగా, కంగారుగా అభిమన్యు వంక చూస్తోంది "ఏమంటాడు ఇప్పుడు??" అనుకుంటోంది మనసులో.

చేతులు జోడించి దేవుడికి మనసులో దణ్ణం పెట్టుకుంటోంది " భగవంతుడా! నన్ను ఈ పరస్థితి నించి గట్టెకించు స్వామి.అభిమన్యు వప్పు కోకుండా చెయ్యి స్వామి. చావనైనా చస్తుంది కానీ
తను అభిమన్యు ని పెళ్లి చేసుకోలేదు.


అభిమన్యు కి నవ్వు వచ్చింది "ఆడవారి మాటలకి చేతలకి అర్ధాలే లేవులే అని ఎవరూ అన్నారో హండ్రెడ్ పెర్సెంట్ కరెక్ట్. ఇందాక కొన్ని నిముషాల క్రితం వరుకు, నువ్వు లేక నేను ఎలాబతక గలను అన్నట్టు తనకి అనిపించేలా చేసింది మరిఇప్పుడు కోపంగా నువ్వంటే నాకు అసహ్యము అన్నట్టు మొహం పెడుతోంది."అనుకుంటూ నందిత ని చూస్తూ గాలిలో ముద్దు పెడుతున్నట్టు పెదవులతో ఆక్షన్ చేసాడు.
నందితకి వళ్ళు మండి పోయింది. వెంటనే తన తండ్రి ని అభిమన్యు కాళ్ళ దగ్గర నించి తనుకూడా లేపడానికి వెళ్ళింది. ఆయన వద్దని మొండికేసిన యిద్దరూ కలిసి ఆయనని కుర్చీలో కూర్చోపెట్టారు.

"అంకుల్ ! మీరు అనవసరముగా ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు. మీరు అనుకున్నట్టు మా మధ్య ఏమి లేదు. పెళ్ళి గురుంచి తరువాత ఆలోచిద్దాము. ముందు మీరు హైరానా పడక రిలాక్స్ అయ్యి ఇంటికి వెళ్ళండి ఫస్ట్ " అని చెప్పి నందిత వైపు తిరిగి "మళ్ళీ కలుద్దాం!" అని వెళ్ళిపోయాడు అభిమన్యు.
నందిత కి వళ్ళు మండింది అభిమన్యు ప్రవర్తనకి.

ఇప్పుడు నాన్నగారి రియాక్షన్ ఎలా ఉంటుందో అనుకుంటూ భయం భయం గా గంగాధరం గారి వైపు తిరిగింది నందిత.
గంగాధరం గారి ముఖము రక్తం చుక్క లేనట్టుగా పాలి పోయింది. ఇంకా తన కూతిరి వివాహం ఈ అబ్బాయి కాళ్ళో చేతులో పట్టుకుని పెళ్ళికి వప్పించాలి అని అనుకున్నారు గంగాధరంగారు కాని అభిమన్యు ఒక ముక్కలో "మేము పెళ్లి చేసుకోము, మాకు ఆ ఉద్దేశం లేదు" అని మొహం బద్దలు అయ్యేట్టు చెప్పి మరో అవకాశము కూడా లేకుండా వెళ్ళిపోయాడు.

అభిమన్యు కి నందిత రూం వదిలి వెళ్ళాలని లేదు అందుకని నందిత రూం అవతల వైపు ఎవరికి కనపడకుండా నక్కి నిల్చున్నాడు. లోపల సంభాషణంతా చక్కగా వినపడుతోంది. ఇంకా ఉదయం పూర్తిగా కానందుకు ఎవరు హాస్టల్ లో తిరగట్లేదు.
అభిమన్యు కి మనసు మనసులో లేదు. గంగాధరం గారు అన్న మాటలే చెవులో రింగుమంటున్నాయి. "నాకు నందిత కి పెళ్ళా????? " అభిమాన్యుకి చెవులకి అమృతం పోసినంత తియ్యగా అనిపించింది. యేవో తియ్య తియ్యని ఊహలు మదిలో కదలసాగాయి. నందితి పెళ్ళి అయ్యి ఇద్దరు రొమాంటిక్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఏవేవో ఊహలు కాళ్ళ ముందు కదల సాగాయి...

ఇంతలో లోపల పెద్ద పెద్ద గా నందిత గంగాధరం గారి సంభాషణ కి ఈ లోకానికివచ్చాడు అభిమన్యు.
గంగాధరం గారు నందిత తో "ఏమి చేస్తావో నాకు తెలీదు, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో ఇదే మనం ఆఖరి సారి కలవడం. నీకు మాకు ఈ క్షణం నించిసంభంధం తెగిపోతుంది. ఆలోచించి చెప్పు ఈ అబ్బాయిని పెళ్ళికివప్పిస్తావా లేదా?"

నందిత కివళ్ళంతా ఒక లాంటి నీరసం ఆవహించింది "నాన్న! మీకు ఎన్ని సార్లు చెప్పాలి, అభిమన్యు కి నాకు ఎలాంటి సంబంధము లేదు, నేను అతనిని ప్రేమించట్లేదు, ప్రేమించలేను,చచ్చినా ప్రేమించను. నాకు అతనంటే ద్వేషము, అసహ్యము, పగ, కసి నేను ఒక్క క్షణం కూడా అతని నీడ కూడా భరించలేను! అతను తాకితేనే నాకు వంటి మీద తేళ్ళుజెర్రులు పాకినంత అసహ్యం. మీరు ఏకుంటి వాడినైన గుడ్డి వాడినైన పెళ్లి చేసుకోమన్నాహాయిగా చేసుకుంటాను కాని ఇతన్ని చచ్చినా చేసుకోను?" అని కచ్చితంగా చెప్పేసింది నందిత. కానీ తన తండ్రి ని చూడడానికి భయపడింది నందిత. గంగాధరం గారి మనసులో ఎంత బాధ పడుతున్నారో నందిత ఊహ కి అందనిది కాదు. కానీ ఏమిచేస్తుంది తండ్రి కి ఎంత చెప్పినా అర్ధం అవట్లేదు.
మల్లి అనుకుంది పోనీ మంచి మాటలతో నచ్చ చెపితే మరీ ఇంత బాధ పెట్టినట్టు ఉండదు కదా అనుకుంది.

ఒక ఆలోచనకి వచ్చి తండ్రి దగ్గరకి మెల్లిగా నడుచుకుంటూ వెళ్లి "నాన్న! ప్లీజ్ అర్ధం చేసుకోండి. పోనీ నాకు ఇష్టం లేకపోయినా మీ కోసమేనా, తమ్ముడు చెల్లెలు బవిష్యత్తు కోసమేనా నేను నా మనసు చంపుకుని అభిమన్యు ని పెళ్లి చేసుకోడానికి ఒప్పుకున్నా అభిమన్యు ఒప్పుకోడు నాన్న. అనవసరంగా మీరు ఏదో ఊహించుకుంటున్నారు. నేను మీకు నాకు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటాను పైగా నేను డీన్ తో మాట్లాడి మన వూరికి వచేస్తాను. పరీక్షల టైం కి ఇక్కడికి వచ్చి రాస్తాను. నాకు నమ్మకము వుంది నాన్న డీన్ ఒప్పుకుంటారు. నేను మీకు ప్రామిస్ చేస్తాను ఎవరైతే నన్ను ఇలాంటి పరిస్థితి తెచ్చారో వారి నోటితోనే నిజాం చెప్పిస్తాను. మీరు నా మాట వినండి, మనసు పాడుచేసుకోకండి. ప్లీజ్ నాన్న! నేను మీ కూతురిని. మీ కోసం నా ప్రానమేనా ఇస్తాను కానీ అభిమన్యు తో పెళ్లి జరగదు నాన్న. నాన్నా! అభిమన్యు చచ్చినా సరే అనడు. వాళ్ళ నాన్నగారు అసలుఒప్పుకోరు నాన్నా! పిల్లలు తప్పు చేస్తే పెద్ద మనసు చేసుకుని క్షమించాలి అని మీరే కదా నాన్నా ఎప్పుడు అంటారు. నా ఈ తప్పు క్షమించండి నాన్నా." అంటూ మోకాళ్ళ మీద కూర్చుని తండ్రి కాళ్ళు పట్టుకుని ఏడ్చింది నందిత.

గంగాధరం గారికి కూతురిని అలా చూస్తే జాలేసింది. ఎంతైనా తను ప్రాణం గా ప్రేమించే కూతురు కదా. పిల్లలు తప్పు చేస్తే క్షమించలేని తల్లితండ్రులు
ఎవరుఉండరు అనుకున్నారు గంగాధరంగారు. పైగా తన చిట్టి తల్లి ఎన్నడు తప్పు చెయ్యలేదు, అంత దైవ కల్పితం అనుకున్నారు.
తన కండువాతో కళ్ళు తుడుచుకుని నందిత తల నిమురుతూఉండిపోయారు.

లోపల సడన్ గా మాటలు ఆగిపోయేసరికి అభిమన్యు కి అనుమానము వచ్చి లోపాలకి తొంగి చూసాడు. అంతేవళ్ళు మండిపోయింది అభిమన్యు కి.
పిచ్చి ఎక్కింది గంగాధరం గారు ఉగ్ర రూపం మానేసి శాంత మూర్తులై కూతురిని బుజ్జగిస్తుంటే. "ఇదేంటి ఈనకి కొంచెము మెంటలా?కధ అంతా అడ్డం తిరిగింది? నిముశంలోనే ఇంత మార్పానందిత నాన్నా గారికి? అంత ఈజీ గా ఎలా? ఎలా మార్చేసింది? జన్మ లో నందిత ముఖము కూడా చూడనని అనుకున్న మనిషేనా ఇలా ఏమి మాట్లాడకుండాఉన్నాడు ?"అనుకున్నాడు కోపంతో పళ్ళు నిమురుతూ .
ఇంతలో నందిత తన గురించి మాటలాడిన ఒక్క ఒక్క మాట గుండెలో మంటని రేపింది. కళ్ళు కోపం తో ఎరుపెక్కాయి. అంతే వెంటనే అక్కడ నుంచి బోయ్స్ హాస్టల్ వైపు నడవ సాగాడు.
*********************************************