Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Eight : Abhimanyu expresses his anger and frustration at Sruthi

 


అభిమన్యు కి గర్ల్ హాస్టల్  దాటగానే అప్పుడే
గంగాధరం గారుమెల్లిగా నందిత ని పైకి లేపి " సరేనమ్మ ఇంక నేను వెళ్తాను. చూడమ్మా అమ్మకి, తమ్ముడికి, చెల్లికి ఇవేమీ చెప్పకు తల్లి తట్టుకోలేరు. ఇప్పటికీ జరిగినదంతా నమ్మ శక్యం గా లేదు కాని తండ్రిని గనక క్షమిస్తాను కాని నువ్వు నాకు కలిగించిన ఈ బాధ అంత సులభంగా మాసిపోదమ్మా. ఇప్పటికి చెప్తున్నాను నువ్వు ఆ కుర్రాడిని పెళ్లి చేసుంటేనే నా ఈ క్షోభ తగ్గుతుంది. నా మనసు శాంతిస్తుంది నువ్వు ఎన్నిచెప్పినా సరే" అన్నారు.

నందితకి తండ్రి ఉన్న పరిస్థితి తలుచుకుంటే చాలా బాధ కలిగింది. కన్న కూతురు కనక క్షమించారు కాని ఆయన మనసు మాత్రం తీవ్రంగా గాయ పడిందని ఆయన మాటలకి నందిత కి అర్ధమైంది. సరే పోనీ అభిమన్యు నిపెళ్లి చేసుకుంటాను అతనుఒప్పు కుంటే అని చెప్పి నాన్నని పంపించి, కొన్ని రోజులయ్యాక వాళ్ళ నాన్నగారుఒప్పు కోవట్లేదు అందుకని మేము ఫ్రెండ్స్ గానే విదిపోదాము అనుకున్నాము అని చెప్పి కధ సుకాంతం చెయ్యచ్చు అనుకుంది నందిత మనసులో.

"నాన్నా! ఒక నిముషము. నాకు అభిమన్యు ని చేసుకోడానికి అబ్యంతరం లేదు, మీరు ఊహించినట్టు మా మధ్య ఎలాంటి తప్పుడు సంబంధం లేదు, మేము స్నేహితులమే, కాని మాకు అలాంటి ఆలోచనలు లేవు, ఇందాక జరిగింది మీరు చూసింది నేను ఎలా, ఎందుకు జరిగిందో చెప్పలేను కానీ ఒకవేళ మేము ఇష్టపడినా మా పెళ్లి జరగడం కష్టం. దానికి మీకు ఇందాకే ఎందుకో చెప్పాను. అయిన మీరు పెళ్ళే పరిష్కారం అనుకుంటే నేను అభిమన్యు తో మాట్లాడుతాను, వాళ్ళ నాన్నా ఒప్పుకుంటే సరే లేక పోయిన మీరు బాధ పడకూడదు సరేనా? ఏది ఏమైనా నేనుడీన్ దగ్గర పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాను. మీరు మాత్రం ప్లీజ్ మనసు పాడుచేసుకోకండి." అని తండ్రి కి కండువా అందిస్తూ చెప్పింది. దానికి గంగాధరం గారి కంట్లో కోటి వెలుగుల కాంతి కనపడింది. నందిత కి మనసు కుదుటపడింది. తను అనుకున్నట్టు జరిగిందని సంతోష పడింది.
తన తండ్రి ని ఒక నిముషము ఆగమని, తను లోపల రూం కి వెళ్లి తలుపు వేసుకుని డ్రెస్ మార్చుకుని, ముఖము కడుక్కుని, జడ వేసుకుని, పర్సు తీసుకుని భయటకు వచ్చింది.

అభిమన్యు బోయ్స్ హాస్టల్ వైపు నడవసాగాడు. సడన్ గా ఎవరోగర్ల్స్ హాస్టల్ వైపు వెళ్తూ కనిపిచ్చారు. ఈ టైములో ఎవరబ్బా ఆనుకుని అటు తిరిగి చూసాడు. అక్కడ చూసిన వ్యక్తి ని చూడగానే మల్లి కళ్ళలో కసి, కోపం ఉప్పొంగాయి. అదే సమయంలో అక్కడ నడుస్తున్న వ్యక్తి కూడా ఇప్పుడు ఈ టైం లో ఎవరు గర్ల్స్ హాస్టల్ నుంచి వస్తున్నారు అనుకుని అటు పక్కన తిరిగి చూసింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి.
ఎదురుగా వున్నా వ్యక్తి అభిమన్యు అని తెలుసుకోడానికి ఒక్క క్షణం పట్టింది ఇక్కడ వున్నా వ్యక్తి కి.
అసలే తిక్క కోపంలో గుండె రగిలిపోతున్న అభిమన్యు ఎదురుగా కనపడిన శృతి ని కోపం గా కర కర నమిలేసేటట్టు చూసాడు.

శ్రుతి అభిమన్యుముఖము లో కోపంచూసి కచ్చితం గా నందిత కి అభిమన్యు కి మధ్య ఏదో జరగ కూడనిది జరగిందని మనసు కీడు శంకించింది. అసలే తనకిఎవరో తప్పు కాల్ చేసి తను ఊరికి వెళ్ళే తట్టు చేసారా అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్న శ్రుతికి అభిమన్యు ని చూడగానే ఏదో బుర్ర లో ఫ్లాష్ లాగా వెలిగింది. అంతే వళ్లు గజ గాజా వణికింది. వంటి నిండా చెమటలు పట్టాయి. నందుకు ఏదో కీడు జరిగిందని గ్రహించింది శృతి.

"అభిమన్యు కాదు కదా ఈ ప్లాన్ వెనకాల? కొంప తీసి నందిత మీద ప్రతీకారం తీర్చడానికి కచ్చి తో నందిత వకత్తే రూం లో వుండేటట్టు చెయ్యలేదు కదా? నందిత ని ఏమైనాబలవంతం కానీ చెయ్యలేదు కదా? ఒకవేళ అదే జరిగితే రివెంజ్ తీర్చుకున్నందుకు చాలా సంతోషంగా ఉండేవాడు కదా! మరి ఇలా కోపంగా ఎందుకు ఉంటాడు? ఆ ఆలోచన రాగానే మనసు కొంచెము కుదుట పడింది. హమ్మయ్య! అయితే నందిత కి ఏమి ముప్పు రాలేదు అనమాట" అనుకుంది శ్రుతి.

ఇంతలో అభిమన్యు శృతి కి చాలా దగ్గర గా వచ్చేసాడు. శ్రుతికి అభిమన్యు ని చూడ గానే పై ప్రాణం పైనే పోయింది. భయం తో వణికిపోయింది. అభిమన్యు ని ఎప్పుడు ఇంత కోపం గా చూడలేదు శ్రుతి. అభిమన్యు ముఖము  అంతా కోపం తో ఎరుపెక్కింది,కళ్ళలో యెర్ర జీరలు కనిపిస్తున్నాయి, పెదాలు అదిరిపోతున్నాయి.వళ్ళు వణుకుతోంది.
శ్రుతిని  గట్టిగా పట్టుకుని "ఎంటి నీ ఫ్రెండ్ కి అంత పొగరు? ఏమనుకుంటోంది?నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతుంది? ఎవరిని పట్టుకుని అన్నన్నిమాటలుఅంటోంది ? నన్ను ఏమనుకుంటుంది? చూస్తూ ఊరుకుంటాను అనుకుంటోందా? నేను తలచు కుంటే అడ్రస్ లేకుండా చెయ్యగలను నిన్ను దాన్ని. ఒక్క చిన్న సైగ చేస్తే చాలు నామ రూపాలు లేకుండా మీ ఫ్రెండ్ ని దాన్ని ఫ్యామిలీ ని మూడో కంటికి తెలీకుండా మాయం చెయ్యగలను. నేను తలుచుకుంటే పదిమందు ముందు అందరు చూస్తూ ఉండగానే .. ఉండగానే..." అంటూ మాటలు మింగేసాడు.
అలాంటి మాటలు నందిత గురుంచి అన లేకపోయాడు.

అతి కష్టం మీద మనసు సంభాళించుకునిమళ్ళీ శ్రుతి తో" ఏంటి నాకు తక్కువ? చెప్పు? నాకు డబ్బు లేదా? అందం లేదా? చదువు లేదా? స్టేటస్ లేదా? నాకేమి తక్కువ? ఇన్ వాట్ వే అయి యాం ఇన్ఫీరియర్ టూ హర్?నేను తలచుకుంటే మీ ఫ్రెండ్ కన్న మహా మహా గొప్ప అందగత్తేలని, డబ్బున్న అమ్మాయిలని పెల్లిచేసుకోగలనని నీ ఫ్రెండ్ కి తేలీదా? మరి ఎందుకు అంత పొగరు, ఏమి చూసుకుని అంత ఫీల్ అవుతోంది?" అంటూ శ్రుతిని ఊపేసాడు.

శ్రుతికి నిజంగా అభిమన్యు మాటలలో నిజాయితి ఉందనిపించింది. అతని బాధ అర్ధం అయ్యింది "ఎలాంటి వాడికైనా అందులో అభిమన్యు లాంటి వాళ్లకి చాలా అవమానంగా భావిస్తారు యే ఆడపిల్లయినా ఛీ కొడితే" అనుకుంది శ్రుతి. అభిమన్యు మీద కోపం కన్న బాధ ఎక్కువైంది శ్రుతి కి.

"నేనంటే ద్వేషము టా, అసహ్యము టా! పగ టా! కసి టా!నా నీడ ఒక్క క్షణం కూడా భరించలేదు టా! నేను తాకితేనేవంటి మీద తేళ్ళుజెర్రులు పాకినంత అసహ్యం టా.ఏ కుంటి వాడినైన! గుడ్డి వాడినైన! పెళ్లి చేసుకోమన్నాహాయిగా, ఆనందం గా పెళ్లి చేకుంటుంది టా!" అంటూ శ్రుతి జబ్బలని గట్టిగా నోక్కేస్తున్నాడు. శ్రుతికి భరించలేనంత బాధ కలిగింది కాని అభిమన్యు బాధ కన్న ఎక్కువ కాదు అనుకుని మౌనంగా భరిస్తోంది.

"నందిత కి మతి పోయింది! పిచ్చి ఎక్కింది! వళ్ళు పై తెలియట్లేదు, నోటికి వచ్చినట్టు వాగుతోంది. అభిమన్యు కనక ఇంకా ఏమి చెయ్యలేదు కానిఉంకోడైతే ఈ పాటికి నందిత ని సర్వ నాశనం చేసేవాడు." అనుకుంటూ నందిత మీద చాలా చాలా కోపం వచ్చింది శ్రుతికి.
"అభిమన్యు లాంటి వాడిని పట్టుకుని అలా ఎలా మాట్లాడింది? నోరు ఎలా వచ్చింది?" అని నందిత ని బాగా తిట్టుకుంది. "లాభం లేదు ఇంకా ఒక్క మాటకూడా అభిమన్యు ని అనడానికి వీలు లేదు." అనుకుంది మనసులో శ్రుతి.

అభిమన్యు బాధ చూస్తే చాలా బాధ కలిగింది వెంaటనే కళ్ళలో నీళ్ళు తిరిగాయి శ్రుతికి. శ్రుతి కళ్ళలో నీళ్ళు చూడగానే అన్హిమన్యు కి తను ఏమి చేస్తున్నాడో అర్ధం అయింది. తన మీద తనకే అసహ్యం వేసింది. "పాపం శ్రుతి ఏమి చేసింది? నందిత మీద కోపం అంత శ్రుతి మీద చూపిస్తున్నానే?" అనుకుని వెంటనే శ్రుతి చెయ్యి వదిలేసాడు. "సారీ!! ఐ డిడ్ నాట్ మీన్ టు హర్ట్ యు శ్రుతి" అని చక చకా వెళ్ళిపోయాడు అభిమన్యు.