శ్రుతి అభిమన్యు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. నందిత గురించి ఆలోచిస్తూ "ముందు నందిత ని కలిసి అసలు ఏమైందో కనుక్కోవాలి" అనుకుంది శ్రుతి.
గర్ల్స్ హాస్టల్ వైపు నడవసాగింది. ఇంతలోఎవరో ఇద్దరు వ్యక్తులు తన వైపు వస్తూ కనపడ్డారు.
"ఇప్పుడెవరో?ఇందాక టైం కానీ టైం లో అభిమన్యు ని కలిసాను. ఇప్పుడు ఇంత పొద్దున్నే ఎవరబ్బా హాస్టల్ బయటకు వెళ్ళేది?"అనుకుంది శ్రుతి.
నందిత ని చూస్తే కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టు ఉన్నాయి. అంకుల్ ఏమో ఏదో జీవితంలో పోగట్టు కున్నట్టు బాధగా విషాదం గా ఉన్నారు, అభిమన్యు కోపం తో ఊగిపోతున్నాడు? ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటూ ముందుకు తన ఆలోచనలతో ములిగిపోయి పరధ్యానం గా నడవ సాగింది శృతి.
నరాలుతెగేలా చేతులు,వళ్ళు పట్టుకుని ఉన్మాదం తో ఊపేసాడు.
ఇప్పుడు నందిత ఏమో కోపంగా ఎవరో ఇష్టం లేని వ్యక్తి ని చూసినట్టు మొహం పెట్టుకుని ఉంది? అసలు ఏమనుకుంటున్నారు తనని ? నేనేమైన తెరగా దొరికానా?" అనుకుంది మనసులో శ్రుతి వళ్ళుమంది.
ముందర కన్నా ఇంకా గంభీరం గా ముహము పెట్టారు గంగాధరం గారు.
"ఓకే! సమ్తింగ్ రియల్లీ రియల్లీ వెంట్ రాంగ్ " అనుకుని టాపిక్ మారుస్తూ "ఎక్కడికి నందితా వెళ్తున్నారు? అని నందిత ని అడిగింది.
"నాన్న ని బస్సు ఎక్కిద్దామని వెళ్తున్నా బస్టాప్ కి" అంది నందిత మోహము లో ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా.
రవికి ఎక్కడో అనుమానము శ్రుతి కూడా అభిమన్యు ని ఇష్టపడుతోందని. కానీ అభిమన్యు, నందిత ల మూలా ఏమి అర్ధం కానీ గంధర గోళం లో ఉందని.
వెంటనే నందితని పట్టుకుని లాక్కుంటూ బస్సు స్టాప్ వైపు పరుగెత్తుతూ " పద బస్సు వచ్చేసింది రూం కి వెళ్ళాక చాలా మాట్లాడాలి." అంటూ నందిత ని కూడా పట్టుకుని బస్సు ఎక్కింది శ్రుతి.
"అబ్బా! ఇదెక్కడి గొడవే నీకు, అభిమన్యు కి నా భుజాలే దొరికాయా?" అంటూ రెండు భుజాలు పట్టుకుంది బాధ తో.
అభిమన్యు కి నందిత కి జరిగిన సంగతులు శ్రుతి గుచ్చి గుచ్చి అడిగినప్పుడు నందిత మొహం లో ఒకలాంటి సిగ్గు ఏదో పరవశము కనిపించాయి.
"మరి మీరందరు కూడా ట్రై చెయ్యండి నందిత. పెళ్లి మిస్ అయినా రిసెప్షన్ టైం కైనా రావచ్చు. మీకు ఎగ్జామ్స్ అప్పటికి అయిపోతాయి కదా!ప్రాక్టికల్స్ ముందు. ఐనో కష్టము అనుకో బట్ ట్రై చెయ్యండి. శ్రుతి నువ్వు కూడా" అంటూ శ్రుతి వైపు ఏదో ప్రియమైన వస్తువు చూస్తున్నట్టు అన్నాడు రవి.
ఎదురుగా వచ్చే వాళ్ళని చూసేసరికి పిచ్చెక్కింది శృతికి. నందిత ని ఆ సమయములో చూడడం పర్వాలేదు కాని నందిత తండ్రి ని నందిత తో పాటు చూసేసరికి ఏదో జరిగింది కచ్చితంగా అనుకుంది.
"అభిమన్యు,నందిత ఇంకా నందిత నాన్నగారు, వీళ్ళందరు ఒకరిని ఒకరు కలిశారు కచ్చితంగా లేక పొతే అభిమన్యు తనకి ఈ గర్ల్స్ హాస్టల్ దగ్గర కనపడే వాడు కాదు. కచ్చితంగా అభిమన్యు కి అంకుల్ ఇక్కడికి రావడానికి సంబంధం ఉంది. ఏమి జరిగి ఉంటుంది? అంకుల్ఎందుకు ఇంత పొద్దున్నే వచ్చారు? తనకి ఎవరు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? అంకుల్ ఇంత పొద్దున్నే ఇక్కడ కి రావడానికి తప్పకుండా సంబంధం ఉండి ఉంటుంది." ఇంకా ఎన్నెనో ప్రశ్నలకి శృతి మనసులో కదలాడాయి దానికి శృతి బుర్ర వేడి ఎక్కింది.
నందిత కి ముందు వచ్చి ఆగింది. నందిత శ్రుతిని పలకరియ్యలేదు. పైగా శృతి ని కోపంగా చూసి తల పక్కకి తిప్పుకుంది నందిత. శృతికి వళ్ళు మండింది కానీ ఏమయ్యిందో అర్ధం కాక ఏడుపు వచ్చినంత పని అయ్యింది శృతి కి.
"తను ఏమి చేసింది?ఫోన్ రాగానే చచ్చినట్టు ఊరు వెళ్ళింది తను మళ్ళీ చచ్చినట్టు తిరిగి వచ్చింది?
ఎవరు ప్లాన్ చేసారు? ఎందుకు చేసారో అర్ధం కాక ఆల్రెడీ పిచ్చి ఎక్కుతుంటే మధ్యలో అభిమన్యు పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ వాయించాడు.
నందిత మాట్లాడక పోతే సరే మరి తను అంకుల్ నిపలకరించాలి కదా అనుకుని "అంకుల్! మీరెప్పుడు వచ్చారు? బావున్నారా? ఆంటీ,రవి,చిన్ని అందరు బావున్నారా? ఇంత సడన్ గా వచ్చారు, అంతఓకే కదా?" అని గంగాధరం గారిని పలకరించింది శృతి.
"నేను కూడా వస్తాను. ఒక్క నిముషముఉండు బాగ్ లోపల రూం లో పెట్టి వస్తాను!" అంది శ్రుతి.
"నువ్వు ఇప్పుడే వచ్చావు కదా! పర్వాలేదు నేను వెళ్తాను నువ్వు రెస్ట్ తీసుకో" అని మాట నందిత పూర్తి చెయ్యకుండానే శ్రుతి కి వళ్ళు మండింది వెంటనే "ఎమనుకున్తున్నావు నువ్వు? నీకు నా మీదఏమైనా కోపంఉంటే రూం లో మాట్లాడుకుందాము వచ్చాక. నాకు కూడా చాలా అడగాల్సినవి వున్నాయి. ముందర అంకుల్ ని బస్సు స్టాప్ వరుకు దింపి వద్దాము. ఎక్కువ చెయ్యకుండా ఆగు, ఇప్పుడే వస్తాను" అని వెళ్లిపోయింది శ్రుతి రూం కి కోపంగా.
గంగాధరంగారు కూడా "సరేనమ్మ మేము ఇక్కడే ఈ బల్ల మీద కూర్చుని ఉంటాము. నువ్వు వెళ్లి రా" అన్నారు అక్కడ బల్ల మీద కూర్చుంటూ. శ్రుతి నందిత వైపు "ఇప్పుడేమి చేస్తావ్"" అన్నట్టుగా ఒక చూపు చూసి రూం కి పరుగున వెళ్ళింది.
నందిత కూడా తండ్రి పక్కన తల వంచుకుని కూర్చుని వుంది.
"ఎందుకమ్మా పాపం శ్రుతి తో అలా మాట్లాడావు? యిద్దరూ చక్కగా కలిసి వుంటారు, శ్రుతి నీకు తోడుగా ఉందని మాకు ఎప్పుడు దైర్యం గా ఉంటుంది" అన్నారు గంగాధరం గారు కండువాతో ముహము తుడుచుకుంటూ.
"నాన్న! మీరు పాపంఅంత దూరము నుంచి వచ్చారు, కాఫీ టిఫిన్ ఏమి తినలేదు ఇంకా. పోనీఉండండి నాన్నా! సాయంత్రం వెళ్ళండి " అంది నందిత.
"లేదమ్మా! నేనువెళ్ళాలి. వెంటనేవెళ్ళి పోదామనే వచ్చాను. పిల్లలకి పరీక్షలు కూడా.పరీక్ష పేపర్లు తయ్యారు చెయ్యాలి?" అన్నారు గంగాధరం గారు నిజాయతిగానే.
శ్రుతి రూం నుంచి వచ్చేసింది. "పదండి" అంటూ అంకుల్ తనతో తెచ్చుకున్న బాగ్ ఎత్తబోయి "అబ్బా!" అని జబ్బలు పట్టుకుని మూలిగింది.
"ఏమైంది శృతి?" అని నందిత గాబరాగా శ్రుతి దగ్గరకి వచ్చింది. "అదంతా పెద్ద కధ లే, ముందర అంకుల్ నిపంపించి తరువాత చెప్తాను" అని నందిత తో బాటు నడవసాగింది.
ఏదో రెండో మూడో మాటలు అలా అలా మాట్లాడి రోడ్ మీద ఒక ఆటో పట్టుకుని బస్సు స్టేషన్ కివెళ్ళారు. టికెట్ కౌంటర్ లో టికెట్ తీసుకుని రైల్వే స్టేషన్ వరుకు వెళ్లారు. అక్కడ నించి హైదరాబాద్ కి టికెట్ తీసుకున్నారు. కర్ణాటక ఎక్ష్ప్రెస్స్ బయలుదేరడానికి రెడీ గా ఉంది.
శ్రుతి ఇప్పుడే వస్తాను అని పరుగునవెళ్ళి అక్కడున్న బండి దగ్గర నుంచి మంచి నీళ్ళ బాటిల్ లు రెండు బిస్కెట్ ప్యాకెట్ లు తీసుకుని వచ్చింది.
"ఎందుకమ్మ! ఇవి, నేను తరువాత అవసరమైతే కొనుకుంటాను కదమ్మా!" అన్నారు గంగాధరం గారు. నందిత కి ఇవి కొనాలని కూడా తట్ట నందుకు తన మీద తనకి కోపం వేసింది. ఏమైంది తనకి అనుకుంది.
"అదేంటి అంకుల్! నేను కొనకూడదా! నేను మీ కూతురిని కాదా" అంటూ బుంగమూతి వేసింది శృతి.
శ్రుతి అలా మూతి పెట్టేసరికి అందరికీ గబాలున నవ్వు వచ్చింది. హాయిగా నవ్వారు. నందిత కి ఎన్నో జన్మలు అయింది నవ్వి అన్నట్టు అనిపించింది. గంగాధరం గారికి కూడా మనసు తేలిక గా అనిపించింది.
ఇంతలో అక్కడ కాఫీ అమ్మే బాయ్ దగ్గర నుంచి మూడు కాఫీ లు తీసుకున్నారు.
గంగాధరం గారిని అయన సీట్ లో కూర్చో పెట్టి యిద్దరూ కిందకి ప్లాట్ఫారం మీద కి వచ్చారు.
ట్రైన్ స్టార్ట్ అవడానికి రెడీ గా ఉంది.గార్డ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
గంగాధరం గారు శ్రుతి తో "శృతి! నందిత ని జాగ్రత గా కనిపెట్టు కొమ్మా . దానికి మంచి రోజులు కానట్టుఉన్నాయ్ . ఏమైనా అన్నా మనసులో పెట్టుకోకమ్మ." అంటూ బావురుమన్నారు.
"అయ్యో! అంకుల్ మీరు నాకు చెప్పాలా! మీరు అలా బాధ పడకండి. ఏమైనా అంతా మన మంచికే. నందిత కి ఏమి అవదు నేనున్నాను. మీరు జాగ్రత్త! మీరే అలా బెంబేలు పడితే ఎలా. మాకు మీరుఊరు చేరేంత వరుకు చాలా కంగారుగా ఉంటుంది." అంది శ్రుతి ఆయన చెయ్యి పట్టుకుని.
ఇంతలో వాళ్ళసీనియర్ రవి ఎక్కాడు గబా గబా ట్రైన్ లోకి. నందిత ని శృతి ని అక్కడ చూసి ఆశ్చర్యపోయి
"హాయ్! నందిత! ఏంటి ఇక్కడున్నావు" అన్నాడు డోర్ దగ్గర నిల్చుని.
"హే! రవి! నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు కదా? మర్చిపోయాను" అంది ఆనందంగా నందిత.
"అవును నందిత! నీకుచెప్పాను కదాచెల్లి కి పెళ్లి ఫిక్స్ అయింది అని." అన్నాడు రవి.
"సారీ! రవి! మర్చిపోయాను.ఎనీవేస్ మా నాన్నగారు ఒక్కరే హైదరాబాద్ వెళ్తున్నారు. నువ్వు కొంచెము ఆయనకి తోడుగా ఉండవా ప్లీజ్" అంది నందిత.
"హే నందిత!రిలాక్స్ ! నేను మీ నాన్నగారిని ఇంటి వరుకు దింపి తరువాత మా ఇంటికి వెళ్తాను. సరేనా! అన్నాడు రవి.
"చాలా థాంక్స్ రవి!" అంది నందిత సంతోషంగ. "హమ్మయ్య! " అనుకుంది మనసులో. గంగాధరం గారు జాగ్రత్త గా ఇంటికి చేరు తారోలేదో అని కంగారు పడింది అంత వరుకు నందిత, ఇప్పుడు రవి మాటలు విన్నాక ఆమె భయాలన్నీ పటా పంచలయ్యాయి.
అలానే అన్నట్టు తల ఊపింది శ్రుతి కొంచెము ఇబ్బందిగా.
నందిత మనసు బాధ గా మూలిగింది.
రవి కి శ్రుతి అంటె చచ్చేంత ప్రాణం. చాలా సార్లు తన ప్రేమ గురించి చెప్పాలని ప్రయత్నించాడు కూడా కానీ శ్రుతి అవకాసము ఇవ్వలేదు.
రవి అభిమన్యు కి మంచి స్నేహితుడు అలానే నందితకి, శ్రుతి కి కూడా. అందుకనే ఏమో శ్రుతి,రవి ని అభిమన్యు ని ఎప్పుడుకంపేర్ చేసుకుంటుంది. రవి అభిమన్యు అంత అందగాడు కాకపోయినా అభిమన్యు కి రూపు రేఖల్లో ఏమి తీసిపోడు. మంచి పొడువు బలమైన శరీర ఆకృతి తో అందరిని అట్ట్రాక్ట్ చేస్తాడు.
శృతి కూడా నందిత అంతఅందగత్తి కాకపోయినా అట్ట్రాక్టీవ్ పర్సనాలిటీ. శృతి కూడా స్నేహానికి ప్రాణం కన్నా ఎక్కువ విలువ ఇస్తుంది. మంచి వయక్తిత్వం కలది. రవి ఆమెని ఇష్ట పడడం లో ఆశ్చర్య పోనక్కర్లేదు.
అభిమన్యు , రవి ఇద్దరు సౌత్ పోలే నార్త్ పోలే లాగా ఇద్దరికి విరుద్ధ అభిప్రాయాలు. ఇద్దరి వ్యక్తిత్వాలు వేరు. కానీ కాలేజీ లో జాయిన్ అయినప్పటి నుంచి రవి కి చాలా సార్లు చాలా విధంగా అభిమన్యు ఆదుకున్నాడు డబ్బు రూపంగాను, ఇంకా మానసికంగాను. రవి కి అభిమన్యు అంటె అభిమానము అతని స్నేహాన్ని ప్రాణం కన్నా ఎక్కువ విలువ ఇస్తాడు. అందుకని అభిమన్యు ని ఎప్పుడూ మందలిస్తుంటాడు. అభిమన్యు మంచి స్నేహితుడే కానీ అతని చేతలు అలవాట్లు రవి కి అసలు గిట్టవు. చాలా సార్లు అభిమన్యు కి అతని చెడు సాంగత్యం గురించి హెచ్చరించాడు. అభిమన్యు తో స్నేహానికి అవి అడ్డు రావు కనుక అవన్నీ అసలు పట్టిచ్చు కోడు రవి.
కానీ ఈ మధ్య రవి కి అభిమన్యు కి నందిత మూలా బేదాభిప్రాయాలు వచ్చి మాటలు లేవు. కానీ రవి చెల్లెలు అభిమన్యు ని కూడా తన సొంత అన్నా లా భావిస్తుంది. అభిమన్యు ని పెళ్లి కి పిలిచాడు. అభిమన్యు కూడా వస్తాను అని చెప్పాడు. నందిత ని రవి పెళ్ళికి రమ్మన్నాడు కానీ మనసులో అభిమన్యు పెళ్లి కి వస్తే మాత్రం నందిత రాక పోతేనే మంచిది అనుకున్నాడు రవి.
వాస్తవం లోకి....
పెద్ద కూత తో రైలు బయలు దేరింది.
బస్సు ఎక్కాక నందితకి శ్రుతి తో ఇందాక తను శృతి తో ప్రవర్తించిన విధం గుర్తుకు వచ్చి బాధ గా అనిపిచ్చి "సారీ శ్రుతి! ఇందాక నీతో కోపంగా మాట్లాడాను. నాకు ఎందుకో నువ్వు కూడా అభిమన్యు తో కాలిసావని అనిపిచ్చింది. తరువాత ఆలోచిస్తే నాకే సిగ్గనిపించింది నీ గురుంచి అలా అనుకున్నందుకు.నీకు నా మీద కోపం రాలేదు కదే." అంది ఎంతో ఫీల్ అవుతూ.
"సర్లేవే నీ మీద నాకు కోపమా? నాకు అభిమన్యు క్లాసు పీకినప్పుడే అనుకున్నా ఏదో జరిగింది అని." అంది శృతి.
శ్రుతి వైపు అయోమయంగా చూసింది నందిత.
"ఏంటి? అభిమన్యు ని నువ్వు కలిసావా నీకు క్లాసు పీకాడా? ఎప్పుడు?ఎందుకు?ఏమని ?" అంటూ శ్రుతి ని ఊపేస్తోంది.
నందిత షాక్ అయ్యింది. "ఎంటే? నాకు ఏమి అర్ధం కావట్లేదు?" అంది అయోమయంగా. ఇలాంటి రియాక్షన్నే నందిత దగ్గర నుంచి ఎక్స్ పెక్ట్ చేసింది శృతి.
"అందుకనే తల్లీ ఈ కంగారు! ఫస్ట్ నువ్వు చెప్పు ఏమైందో తరువాత నేను చెప్తాను. ఫస్ట్ అయితే పద రూం కి వెళ్ళాకమాట్లాడుకుందాము." అంది శ్రుతి.
ఇంతలో హాస్టల్ దగ్గర బస్సు స్టాప్ కి వచ్చేసారు. గబా గబా రూం లోకి వెళ్ళగానే యిద్దరూ మంచము మీద పడ్డారు.
"అబ్బా! చెప్పవే? ఏమైంది? అభిమన్యు హాస్టల్ దగ్గర ఏమి చేస్తున్నాడు? ఎందుకు వచ్చాడు? అసలు ఏమైంది? అంకుల్ ఎందుకు వచ్చారు ?" అంటూ నందిత ప్రశ్నల తో ముంచేసింది శ్రుతి.
నందిత మొత్తం స్టొరీ చెప్పుకు వచ్చింది. అభిమన్యు తన రూమ్ కి రావడము... గంగాధరం గారు అదే సమయానికి రావడము..ఆయన బాధ పడడము ... మళ్ళీ అభిమన్యు ని తనని గంగాధరం గారు దగ్గర గా చూడడము.. అభిమన్యువెళ్ళడమూ ... గంగాధరం గారు నందిత ని అభిమన్యు ని పెళ్లి చేసుకోమని అడగడము...
మళ్ళీ వాలిద్దరూ శృతి ని కలిసేంతవరకూ అంతా గబ గబా చెప్పేసింది తడపడకుండా.
శ్రుతి నోరు తెరిచి, కళ్ళు పెద్దవి చేసుకుని"నిజమా? ఇంత జరిగిందా?నమ్మ సఖ్యం గా లేదే. అయితే నన్నుఊరికి పంపడం కూడా అభిమన్యు చేసినా పనే. నౌ ఐకెన్ అండర్ స్టాండ్ ఇట్ క్లియర్ లీ. అమ్మ!! అభిమన్యు! ఇంత ఈవిల్ గా ప్లాన్ చేసాడా . మై గాడ్!!! నేను నమ్మలేను. " అంది శ్రుతి ఇంకా నమ్మలేక పోయింది.
శ్రుతి గమనించింది ఏంటంటే, నందిత కి తెలియకుండానే అభిమన్యు ని ద్వేషించడం కన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది. అతని సన్నిహిత్యాని ఆమె మనసు కోరుకుంటోంది. అందుకే అభిమన్యు నందిత ని అడ్వాంటేజ్ తీసుకున్నా నందిత అతనిని వారించలేక పోతోంది పైగా అతనికి సహకరిస్తోంది.
ఎందుకో ఒక లాంటి ఈర్ష కూడా కలిగింది శృతికి. అభిమన్యు ఎన్నటికీ తన వాడు కాదు అని తెలిసినా ఎందుకో శృతికి నందిత మీద అసూయ కలిగింది.
అభిమన్యు నందిత పెదవులని ముద్దు పెట్టుకున్నాడు అన్నప్పుడు తనకి తెలియ కుండానే ఆ నిముషానికి నందిత మీద కోపం కూడా వచ్చింది. కానీ నందిత పిలుపుకి మళ్ళీ ఈ లోకానికి వచ్చింది.
నందిత ఆతృతగా "చెప్పు శ్రుతి! నీకు అభిమన్యు ఎప్పుడు కనిపించాడు?" అని అడిగింది.
శ్రుతి మొత్తం పూసా గుచ్చినట్టు చెప్పింది. అది విన్న నందిత "ఓహ్! మై గాడ్!" అని పెద్దగా అరిచింది.
శ్రుతి కూడా నందిత ముహాములో కనిపించే మార్పులు చూసి కంగారు పడింది. "ఏమైందే? అలా కంగారు పడుతున్నావేమిటి? ఆ చెమటలు ఏంటి?" అంటూ నందిత కి పట్టిన చెమటలు చూస్తూ కంగారుగా అడిగింది శృతి.
"నేను నాన్న తో అన్నవన్నీ అభిమన్యు విన్నాడా? అంతే అయ్యుండాలి అందుకే అంత కోపం వచ్చి ఉంటుంది. నేను అభిమన్యు వింటాడు అనుకోలేదే. ఇప్పుడు తప్ప కుండ నా మీద ఇంకా కచ్చి పెట్టుకుని ఉంటాడు. నాకు ఇప్పుడు అభిమన్యు నిమళ్ళీ ఫేస్ చేసే ధైర్యం లేదు శ్రుతి. పైగా ఈ రోజు మా ఇద్దరి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ కి సిగ్గు తో చస్తున్నాను. పైగా అభిమన్యు కచ్చితంగా ఇవన్ని అలుసు తీసుకుని నన్ను కచ్చితంగా ఇరకాటం లో పెడతాడు. అందుకని నేను ఇప్పుడేఇంటికి వెళ్లి పోతాను..అంతే" అని లేచి బాగ్ లో బట్టలు సర్ద డానికి ఉన్న పళంగా లేచి బాగ్ కోసం అటు ఇటు చూస్తోంది కంగారుగా.
నందిత చెయ్యి పట్టుకుని లాక్కుని మంచి మీద నందిత ని కూర్చో బెట్టి
"ఏ నందు! నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎక్కడికి వెళ్తావు? ఎగ్జామ్స్ పెట్టుకుని ఊరు వెళ్తాను అంటావ్ ఏమిటి? ఏదో ఒకటి ఆలోచిద్దాం లే! నువ్వు కంగారు పడి బుర్ర పాడుచేసుకోకు!" అంటూ నందిత చెయ్యి పట్టుకుని ధైర్యం ఇస్తున్నట్టు మెల్లిగా నొక్కి వదిలింది శ్రుతి.
"లేదు శ్రుతి! నీకు అర్ధం కాదు! నాకు నా మీదే నమ్మకం లేదు. నేను గట్టిగా తలుచుకునిఉంటె అభిమన్యు ని అంతగాప్రొసీడ్ అవ్వకుండా ఆపే దాన్ని. కానీ ఆ క్షణం లో నన్ను నేను కంట్రోల్ చేసుకో లేకపోయాను. చెప్పడానికి సిగ్గేస్తోంది కానీ నిజం చెప్పాలంటే నేనుఅడ్డు చెప్పలేదు. అభిమన్యు తప్పు పూర్తి గా లేదు, నేను ..నేను నాది కూడా తప్పే. ఐ హేట్ మైసెల్ఫ్..నా మీద నాకే అసహ్యం గా ఉంది!" అంటూ ఏడవ సాగింది నందిత.
"ఏంటి నందు! మరీ టూ మచ్ గా ఆలోచిస్తున్నావు! ఇందులో నీ తప్పు లేదు మరీ చెప్పాలంటే అభిమన్యు ది కూడా లేదు ఎందుకంటే ఆ సిచుయేషన్ అలాంటిది. మన మనసు ఎప్పుడు ఎలా మల్లుతుందో ఎవరికి తెలీదు. అయిపోయింది ఎలాగు అయిపోయింది. దాన్ని వదిలేసెయ్.
"నిన్ను ఒకటి అడుగుతాను నందు! నిజం చెప్పు. నీకూ అభిమన్యు అంటె.." ఇంకా శ్రుతి మాటా పూర్తి కానేలేదు నందిత మధ్యలోనే అడ్డుకుంది "ప్లీజ్! శ్రుతి! ఆపేయ్. నన్ను ఏమి అభిమన్యు గురించి అడగకు. నా పరిస్థితి నాకే అర్ధం కావట్లేదు. నా మీద నాకు నమ్మకము లేదు" అంటూ శృతిని వారించింది నందిత.
"అది కాదు నందు! తప్పేంటి? నువ్వు అభిమన్యు ని ప్రేమిస్తే ఇలాంటివి తప్పు ఎలా ..." ఇంకా శ్రుతి మాటా పూర్తి కాలేదు నందిత శృతి ని అడ్డుకుంది.
"చూడు శ్రుతి ! ప్లీజ్!! నీకు ఎందుకు అర్ధం కాదు. ఈ టాపిక్ ఇక్కడే వదిలేయ్. నాకు పిచ్చే అనుకో లేక పొగరే అనుకో లేక ఏమైనా అనుకో! ప్లీజ్ అర్ధం చేసుకో శ్రుతి నేను ఉన్న పరస్థితి ఎవరికి అర్ధం కాదు. నేను అభిమన్యు ని ఇష్టపడుతున్నానో, ప్రేమిస్తున్నానో, ప్రాణం కంటే ఎక్కువగా ద్వేశిస్తున్నఅవ్వన్నీ తరువాత . నేను అభిమన్యు ని ఎలా తప్పించుకోవాలో? ప్లీజ్ ఏమైనా ఆలోచించు శ్రుతి" అంది.
శ్రుతి కి నందిత ని చూస్తే జాలి వేసింది. "ఏంటో పిచ్చిది. అభిమన్యు లాంటి వాడిని ప్రేమిస్తున్నాఅని ఒప్పుకోడానికి ఎందుకు ఇంత సీన్ చేస్తోందో అర్ధంకావట్లేదు" అనుకుంది.
ఇంతలో యిద్దరూ టైం చూసుకున్నారు "బాబోయి! కాలేజీ కి టైం అయ్యిందే? నేను ఈ రోజు పేపర్ కి ఇంకాప్రిపేర్ అవ్వాలి! ముందువెళ్తే కొంచము చూసుకొచ్చు.పదవే! అభిమన్యు గురుంచి కాలేజీ అయ్యాక ఆలోచిద్దాము" అంది శ్రుతి.