Wednesday, February 2, 2022

Veedani Bandham Anubandham - Short Novel - ROMANCE

  వీడనిబంధం::అనుబంధం




హైదరాబాద్ శ్రీనివాస్ నగర్ కాలనీలో అయ్యప్ప గుడి సందు చివర ఉన్న ముకుంద్ రావు గారి ఇంట్లో ఈరోజు చాలా సందడిగా హడావిడిగా ఉంది
ఆయనపెద్ద అమ్మాయి నందిత పెళ్ళి
 రోజు కోసము ఆయనఆయన భార్య పార్వతమ్మ గారు ఎన్నో ఏళ్ళ నుండి కలలు కంటున్నారు.
పార్వతమ్మ గారికి చాలా కంగారుగా ఉందిపెళ్ళివారు అందరు పెళ్ళి హాల్ కి వెళ్ళిపోయారుపైగా బ్రాహ్మణుడు గౌరీ పూజకి కూడా టైం అవుతోందనికంగారు పెట్టాడుఇంకా నందిత కూడా బయటికి రాలేదు
ఇంతలో రూం లో ఏదో అలికిడికి ఆవిడ అటు తిరిగి చూసింది. 
ఆవిడకి నోట మాట రాకుండాఅలానే చూస్తూ ఉండిపోయింది
ఎదురుగా నందిత  పెళ్ళి కూతురు ముస్తాబులో  దేవకన్య లా కనపడింది.  
అసలే నందిత అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల  ఎత్తు తో దానికి తగ్గ మతి చెదిరే శరీర ఆకృతి ఉండడంతో  రోజు ఇంకా అందంగా కనిపిస్తోంది
ఆవిడ కళ్ళలో నీళ్ళు తిరిగాయి వెంటనే నందిత దగ్గర కి వెళ్లి  ఆమెని గుండెలకి హత్తుకుని "నాకు తెలుసు బంగారం నువ్వు మా సంతోషము కోసమే  పెళ్ళికి ఒప్పుకున్నావని, నా మాట నమ్ము బావ నిన్నుకళ్ళ లో పెట్టుకుని చూసుకుంటాడునీకు ఎలాంటి లోటు రానివ్వడుఅని ఆవిడ నందిత నుదుట ముద్దు పెట్టుకుంది
నందిత కళ్ళలో విషాదం తొంగిచూసింది అయినా చిన్నగా నవ్వింది.
పెళ్ళివారు అందరు వెళ్ళిపోయాకఅక్కడికి ఒక తెల్ల కారు వచ్చి ఆగింది
అందులోంచి నల్ల కోట్ వేసుకుని ఉన్న ఒక ఆయన దిగి అప్పుడే గేటుమూస్తున్న వాచ్ మెన్ ని కంగారుగా ఏదో అడిగి మళ్ళీ కార్ లో కూర్చుని తన మొబైల్ తో ఎవరికో నెంబర్ డైల్ చేసాడు
అవతల వ్యక్తి ఏమి మాట్లాడాడోకాని ఆయన ముఖం మాడిపోయింది. ఆయనకీ వంటి నిండా చెమటలు పట్టాయి.
కార్ డ్రైవర్ తో ఏదో అడ్రస్ చెప్పి తొందరగా తీసుకుని వెళ్ళమని వాడిని కూడా కంగారు పెట్టారు ఆయన
దారిలో అప్పుడే ఏదో పెద్ద ఆక్సిడెంట్ అయ్యి మొత్తం రోడ్లు మూసేసారు
ఆయన టెన్షన్ లో ఉన్నారు.  
ఇంతలో మొబైల్ రింగ్ అయ్యింది
 నెంబర్ ఎవరిదో చూసి ఆయన మొహానికి కారుతున్న చెమటలు తుడుచుకుంటూ ఫోన్ ఎత్తాడు.
"పని అయ్యిందా?" అని అవతల మనిషి విసుగ్గా టెన్షన్ గా అడిగాడు.
"ఒక్క నిముషము ! మీరు ఇంకా మండపానికి వెళ్ళ లేదా?" అని గట్టిగా అరిచాడు
 అరుపుకి ఆయన చేతిలో ఉన్న ఫోన్ జారి కింద పడింది.
"మూర్తి గారు మిమల్నేఇంకా రోడ్ మీద ఏమి చేస్తున్నారుఅక్కడ పెళ్ళి అయ్యి పోయి ఉంటుంది  పాటికిఛీమీకు  పని చెప్పి నేను చాలా పెద్దపొరపాటు చేసానుఅన్నాడు అవతల వ్యక్తి కోపం గా.
"అభిమన్యు బాబుకోప్పడకు నేను ఇంకో ఒక్క పది నిమిషాలలో అక్కడ ఉంటాను మీరు అప్ప చెప్పిన పని నేను ఏది ఏమయినా చేస్తాను బాబు నన్నునమ్ముఅని బావురు మన్నాడు.  
అభిమన్యు ఏమనుకున్నాడో ఏమో "సరే మీకు ఒక్క అరగంట టైం ఇస్తున్నాను, ఇంతలో పని కాక పోతే నా మనుషులని మీ ఆఫీస్ కి పంపాల్సి వస్తుంది  తరువాత మిమల్ని  దేవుడు కూడా కాపాడ లేడు " అని ఫోన్  పెట్టేసాడు.
మూర్తి గారు అన్ని దేవుళ్ళకు మొక్కు కున్నారు, తను తల పెట్టిన పనిలో తప్పకుండా  విజయం సాదించాలని
 దేవుడు కరుణించాడో కానీ, కరెక్ట్ గా నందిత మేడలో తాళి పడే ముందు  ఆయన మండపం చేరుకున్నాడు
 హడావిడిలో ఎవరూ ఆయనని పట్టించు కోలేదు
నందిత తల దించుకుని గట్టిగా కళ్ళు మూసుకుని కంట్లోంచి కారుతున్న నీళ్ళు దిగమింగు కుంటోంది
ఇంతలో అకస్మాత్తుగా ఎవరో గట్టిగా " పెళ్ళి ఆపండి పెళ్ళి చట్టానికి వ్యతిరేకంగా జరుగుతోంది పెళ్ళి చెల్లదుఅని అరిచారు. " పెళ్ళి చెల్లదుఅని అన్న అతని ఆఖరి మాటలు గాలిలో కలిసిపోయాయి అతను నేల మీద కుప్పకూలి పడ్డాడు. 
ఎవరో అతని తలమీద బలంగా కొట్టారు
ఆయనకి యమ భటులు కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు
ఇంతలో అతని మొహం మీద ఎవరో చల్లని నీళ్ళు కొట్టారు
అతనికి స్పృహ వచ్చి "పెళ్ళి ఆపండిపెళ్లి అయ్యిపోయిందా " అంటూ లేచి మండపం వైపు పరుగెత్తాడు
అక్కడ నందితని చూసి ఆమెమెడలో మంగళ సూత్రం కనపడక పోయేసరికి "హమ్మయ్యఅనుకున్నాడు
ఇంతలో నందిత అన్నయ్య అతని పీకలు పట్టుకుని అతని వాగుడికి అర్ధంచెప్పమన్నాడు.
మూర్తి గారు క్లుప్తం గా నందిత అభిమన్యుల విడాకులు,  ఆయన చేసిన చిన్న పొరపాటు వల్ల ఇంకా రద్దు కాలేదనిఆమె ఇంకా అభిమన్యు కి చట్టప్రకారము భార్యనే అనిఆమె ఈపెళ్ళి చేసుకున్నా చట్టపరంగా  పెళ్ళి లెక్కలోకి రాదనీ చెప్పాడు". 
అక్కడ ఉన్న అందరూ  అయోమయంగా ఆయన చెప్పిన దంతా విన్నారు
అందరు రక రకాలు గా మాటలు మొదలెట్టారు.   
మూర్తిగారి మాటలు విన్న నందిత కాళ్ళ కింద భూమి కదిలి నట్టు అయ్యి మండపంలో కుప్ప కూలిపోయింది.
నందితకి మెలుకువ వచ్చేసరికి ఇంట్లో ఉంది
నందిత అన్న నందితకి క్లుప్తంగా తన బావ కార్తీక్ నందిత ని కోర్ట్ కేస్ తేలాకనే పెళ్ళి చేసుకుంటాననిఅక్కడ ఉన్న వాళ్ళందరికీ క్షమాపణలు చెప్పి ఇంట్లో అందరికీ నచ్చచెప్పి తన బావఅందరిని ఇంటికి  తీసుకొచ్చాడని చెప్పాడు
అప్పుడే అక్కడికి వచ్చిన కార్తీక్ నందితని ఓదార్చి నందిత లాంటి థైర్యం కల అమ్మాయి ఇలా నిరుత్సాహ పడకూడదని, ఇంట్లో అందరినీ తనే బాధ పడకుండా చూసుకోవాలని నచ్చ చెప్పాడు
నందిత కళ్ళు తుడుచుకుని ఏమి జరగనట్టు మొహానికి నవ్వుపులుముకుని వాతావరణం కొంచెము శాంతింప చెయ్యడానికి ప్రయత్నించింది
అంతవరుకు పెళ్ళి కళతో కళకళ లాడిన ఇల్లు ఇప్పుడు విషాదంగా బోసిగా కనపడింది.
 మరుసటి ఉదయము షామియాన వాళ్ళులైట్ వాళ్ళు వచ్చి ఇంటి బయట ఉన్న వాళ్ళ వాళ్ళ సామాన్లు తీసుకుని వెళ్తున్నారు
దగ్గర చుట్టాళ్ళు  అందరూ  వెళ్ళిపోయారు
 రాత్రి అందరు భోజనానికి ఇష్టం లేకపోయినా కూర్చున్నారు
అప్పుడే ఇంటి బయట ఎవరో డోర్ బెల్ కొడితే అక్కడే హాల్లో ఉన్న ఏవో గిన్నెలు వంటింట్లో పెట్టడానికి వెళ్తున్న నందిత తలుపు వైపుచూసింది
అంతే ఆమె గుండె కొట్టు కోవడము మానేసింది
చేతిలో ఉన్న గిన్నె జారి పెద్ద చప్పుడుతో కింద పడిపోయింది.
 చప్పుడు కి అందరు ఏమి అయ్యిందో అని పరుగెత్తుకుని వచ్చారు. 
నందిత మొహం రక్తం చుక్క లేనట్టుగా పాలి పోయింది
అక్కడికి వచ్చిన అందరి పరిస్థితి ఇంచు మించు నోట మాట రాకుండా అలా అక్కడ అకస్మాత్తుగా ప్రత్యక్షమైన అతనిని చూస్తూ ఉండిపోయారు
ముందుగా నందిత అన్నయ్య తేరుకుని  వచ్చిన వ్యక్తి పీకలు పట్టుకున్నాడు. 
"యు రాస్కెల్నా చెల్లి జీవితము ఆరేళ్ళ కింద ఎప్పుడో నాశనం చేసావు, మళ్ళీ ఇప్పుడే దాని జీవితంలో సంతోషం రాబోతుంటే మళ్ళీ నాశనం చేసావు కదరాఇంతా చేసి ఎంత థైర్యం రా నీకు?  గడప ఎక్కడానికి?అని అభిమన్యు మీదకి వెళ్ళాడు.
అతని మాటలకి భయపడడానికి అభిమన్యు ఆషామాషి మనిషి కాదు ఆరడుగుల నాలుగు అంగుళాల ఆజాన బాహుడు.
కండలు తిరిగిన శరీరంతో ఏదో హాలీవుడ్ సినిమా హీరోలా ఉంటాడు. "రవినేను ఒక్కసారి నందిత తో ముఖ్యమయిన విషయము మాట్లాడాలిప్లీజ్నువ్వు పక్కకి జరుగుఅన్నాడు.
నందిత అన్నయ్య అభిమన్యు కాలర్ పట్టుకుని "ఏంటిరా నువ్వు చెప్పేదినందిత వినేదినందిత పేరు మళ్ళీ ఎత్తావో ముక్కలు ముక్కలుగా నరికేస్తాను.గెట్ అవుట్అని అభిమన్యు కాలర్ పట్టుకుని బయటకి తోశాడు
అభిమన్యు దవడ ఎముకులు అదిరాయిగట్టిగా పిడికిలి బిగించి అతని కడుపులోఒక్కటి గుద్దాడు
అతను ఆర్తనాదం చేస్తూ కింద పడ్డాడు
నందిత వంక చూసి అభిమన్యు "నందితబయటకిరా! నేను నీతో మాట్లాడాలి " అన్నాడు సీరియస్ గా
నందిత కోపంగా అభిమన్యు తో " నువ్వు మనిషివారాక్షసుడివానీకు నాకు ఎలాంటి సంబంధం లేదుగెట్ అవుట్అని అతనిమోహము మీద తలుపు వేసింది. 
కాని ఇంతలో అభిమన్యు నందిత చెయ్యి పట్టుకుని "ఉందిసంబంధం ఉందినువ్వు ఇంకా నా భార్య వినీ మీద నాకు అన్ని హక్కులు ఉన్నాయిఒక్క నిముషము నీతో వంటరిగా మాట్లాడాలి ప్లీజ్!" అన్నాడు ఆవేశంగా.
నందిత తండ్రి ముకుంద రావు గారు జరిగినదంతా చూసి ఏమనుకున్నారో కాని నందిత తో "అబ్బాయిని తీసుకుని పైకి మెడ మీదకి వెళ్ళుఅని చెప్పి,అందరిని లోపలికి వెళ్ళమన్నారు ఆయన
ఇంక చేసేది ఏమీ లేక నందిత అభిమన్యుతో పైన ఉన్నమేడ మీద గదిలోకి వెళ్ళింది
లోపలకి వెళ్ళగానే అభిమన్యు రూం తలుపు గడియ పెట్టాడు
నందిత గుండె జల్లు మంది వంటరిగా అభిమన్యుతో  గదిలో ఆమెకి ఉక్కిరి బిక్కిరిగా ఉంది
అభిమన్యు నందితకి దగ్గరగా వచ్చాడు
నందిత ఒంట్లో ప్రతి అణువు అతని ఉనికి తెలుపుతోంది. "ప్లీజ్అక్కడ నుండే చెప్పుఎందు కొచ్చావ్నేను ఏడుస్తుంటే చూసి ఆనందించడానికి వచ్చావాఇంకేమి మిగిలింది కనక ఇంకా నా జీవితం నాశనం చెయ్య డానికి?" అని అడిగింది రోషం గా అతని ముఖం లోకి చూస్తూ.  
అభిమన్యుకి ఆమె ఎంత బాధ పడుతోందో తెలుసు కానీ ఏమి చెయ్యలేని అతని దుస్థితికి బాధ పడ్డాడు
అతనికి కూడా వాళ్ళ విడాకుల గురించి రెండువారాల ముందే తెలిసింది
అతను కూడా షాక్ తిన్నాడు
నందిత గురుంచి విచారణ చేస్తే నందిత పెళ్ళి విషయము తెలిసిందిఅతను తట్టుకోలేకపోయాడు.
నందితని ఇంకో మనిషితో ఊహించు కోలేక పోయాడు
అందుకే ముందర నందిత పెళ్ళి జరగకుండా చేసాడు
ఇప్పుడు అతనికి నందితతో చాలా ముఖ్యమయిన పని ఉంది కాని  విషయము నందిత తో ఎలా చెప్పాలో అతనికి అర్ధం కావట్లేదు
బాధ పడుతున్న నందితని అలా వంటరిగా వదల లేక అమాంతం నందితని గుండెలకి హత్తుకున్నాడు
అనుకోని  చర్యకి నందిత ఆశ్చర్య పోయినా బాధగా అతని కళ్ళలోకి చూసింది
అభిమన్యు కూడా నందిత లానే చిత్ర వధ అనుభవిస్తున్నాడని నందిత కి అర్ధమయ్యింది
ఇన్నేళ్ళు దిగ మింగుకున్న దుఃఖము కట్టలు తెంచుకుని బయటకి వచ్చేసింది.
గుండెలు బద్దలు అయ్యేలా ఏడుస్తున్న నందితని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు
అతని కళ్ళలో కూడా నీళ్ళు తిరిగాయి.
"నందు!" అని ప్రేమగా పిలిచి ఆమె తల మీద ముద్దు పెట్టుకున్నాడు
నందిత  ముద్దుకి కరిగి పోయింది
అతను చేసిన ద్రోహంఅతని మీద కోపము అన్నీ  క్షణం లో గాలిలో కలిసిపోయాయి
అలా కాలం వాళ్ళ మధ్య నిలిచి పోయింది.
అకస్మాత్తుగా నందిత అభిమన్యుతో "అభిప్లీజ్నన్ను వదిలి ఎప్పుడూ వెళ్ళకు. “నువ్వు నేనుఅని ఏదో అంటుంటే మధ్యలొ అతని మొబైల్ రింగ్అయ్యింది. 
అతను దానిని ఆఫ్ చేసాడు కానీ నందిత అన్నది మధ్యలో వినలేదు
నందిత ఇదంతా పట్టించుకోకుండా "మనము అందరమూ హాయిగా కలిసి ఉందాముచిన్నా..అని ఏదో అనబోతుంటే అభిమన్యు నందితతో "నాకు డివోర్స్ కావాలి నందిత!" అన్నాడు అకస్మాత్తుగా. 
నందిత అభిమన్యుని వదిలేసిందిఅభిమన్యు డివోర్స్ పేపర్స్ తీసి నందిత చేతిలో పెట్టాడు.
నందిత పిచ్చి ఎక్కినట్టు  పేపర్స్ నే చూస్తోంది
సడన్ గా నవ్వడం మొదలెట్టింది"అభినువ్వు జోక్ చేస్తున్నావు కదూనాకు తెలుసు ఇదంతా నన్ను ఆట పట్టించాలని చేస్తున్నావు కదూఇక్కడే ఉంటే నన్ను ఇలానే ఏడిపిస్తావు.నేను వెళ్ళి నీకు ఏమయినా తినడానికి తీసుకుని వస్తానునువ్వు అంతలో ఫ్రెష్ అయ్యి రా !" అని తలుపు తెరవబోయింది నందిత.
అభిమన్యు సీరియస్ గా నందిత తో "నేను ఇందుని పెళ్ళి చేసుకుంటున్నానుఅన్నాడు అకస్మాత్తుగా
 మాట విన్న నందిత మోహము ఎర్రగా మారి, సీరియస్ గా అభిమన్యు వైపు తిరిగింది
ఆమె చూపులు భరించ లేనట్టుగా అభిమన్యు ఎటో చూస్తూ "అప్పుడే నాకు  మన విడాకులు పూర్తవ్వలేదనే విషయం తెలిసింది... అందుకే నీ పెళ్ళి.. " అని మాట పూర్తి చెయ్యకుండానే తలుపు గట్టిగా వేసిన శబ్ధానికి అటు తిరిగి చూశాడు అభిమన్యు
నందిత రూంలో లేదుఅతను బాధగా బయటకి వెళ్ళబోతూ అక్కడ కిందపడి ఉన్న డివోర్స్ పేపర్స్ తీసుకున్నాడు
వాటి మీద నందిత సంతకం కనపడింది. 
అతని కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయ్యి అక్కడ ఉన్నమంచం మీద కూల బడ్డాడు
అతనికి కావాల్సింది అదే అయినా కూడా అభిమన్యు కి సంతోషం వెయ్యకుండా భరించలేని క్షోభ కలిగింది
నందితని ఓదార్చాలనుకున్న కోరికని బలం గా పక్కకి నెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
అభిమన్యు డివోర్స్ పేపర్స్ సబ్ మిట్ చేశాడుఅతను గత ఆరేళ్ళుగా నందితని తలవని రోజు లేదు కానీ ఇప్పుడు నందిత ని ఒక్క క్షణము కూడా తలవకుండా ఉండలేక పోతున్నాడు
నందితకి ఇంత వరుకు అతని జీవితంలో ఏమి జరిగిందో వివరంగా మనసు విప్పి ఆమె క్షమాపణలు పొందాలని అతనిమనసు తహతహ లాడింది
అతని పెళ్ళి ఇంకో వారంలో అనగా అభిమన్యు నందిత ఇంటికి ఫోన్ చేశాడు.
ఫోన్ ఎవరో చిన్న పిల్లాడు ఎత్తాడు.
"హలోనేను అభిరాం మాట్లాడుతున్నాను”. 
మీకు ఎవరు కావాలి?" అని ముద్దు ముద్దుగా మాటలు వినపడ్డాయి అభిమన్యుకి
అంత టెన్షన్ లో కూడా అభిమన్యుకి  బాబు మాటలు బాగా ముద్దొచ్చాయి
ఏదో తెలియని తియ్యని అనుభూతి అతనికి కలిగింది.
ఇంతలో ఎవరో ఫోన్ తీసుకుంటూ "చిన్నా!నిన్ను ఫోన్ ఎత్తొద్దు అన్నానాలోపలకి వెళ్ళి చెయ్యి కడుక్కోడ్రెస్ చూడు ఎలా పాడు చేసుకున్నవో?" అంటూఫోన్లో ఎవరో  బాబుని కేకలేశారు
ఇంతలో అవతల వైపు "హలోసారీ అండి బాబు మిమల్నిఅని ఇంకా ఏదో అనే లోపలే అభిమన్యు "నందిత!"అని పిలిచాడు.  
అంతే నందిత ఫోన్ అలానే పట్టుకుని ఒక్క క్షణము ఆగి ఫోన్ పెట్టేయబోయింది
అభిమన్యు బతిమిలాడుతూ "ప్లీజ్నందిత ! ప్లీజ్ఒక్కనిముషము వినుఅన్నా కూడా నందిత ఫోన్ పెట్టేసింది
అక్కడ నుండి ఏడుస్తూ తన రూం లోకి వెళ్ళి పోయింది.
అభిమన్యు అలానే ఫోన్ వంక చూస్తుండగా అక్కడికి అభిమన్యు ఫ్రెండ్ వచ్చాడు
అతనికి అభిమన్యు నందితల గురుంచి పూర్తిగా తెలుసు
అభిమన్యుకి మంచి స్నేహితుడు కూడా
అతినికి  మధ్య అభిమన్యుకి నందితకి మధ్య జరిగిన అన్ని సంఘటనలు చెప్పాడు
సడన్ గా అభిమన్యు కి నందిత తో ఆఖరి సారి నందిత రూంలో మాట్లాడిన మాటలు ఇందాక ఫోన్ లో మాట్లాడిన మాటలు లింక్ చేసుకుంటే ఏదో తట్టింది
"నోనోనో వే?" అని తనలో తనే మాట్లాడుతూ అభిమన్యు సోఫాలో కూల పడ్డాడు తల పట్టుకుంటూ.  
అతనికి పిచ్చి ఎక్కుతోంది
ఇంతలో అభిమన్యు  ఫ్రెండ్ కంగారుగా "ఏమైంది అభి!!"అని అడిగాడు
అయినా అభిమన్యు అతనిని పట్టించు కోలేదు
అభిమన్యు వంటి నిండా చెమటలు పట్టాయి
తనలో తనే "ఇంత ద్రోహం చెయ్య లేదునో వే!!! కానీ ఒక వేళ ఇదే నిజమయితే  మై గాడ్!" అని అతను మొబైల్ తో ఏదో నెంబర్ కి డైల్ చేసి అర్జెంటుగా ఇండియాకి టికెట్ కొనమని అతని సెక్రటరీకి చెప్పి అతని ఫ్రెండ్ తో అన్ని విషయాలు వచ్చాక చెప్తా అని అంత వరుకు ఎవరికి ఏమి చెప్పద్దు అని కనపడిన రెండు జతల బట్టలు పెట్టెలో సర్దుకుని ఎయిర్ పోర్ట్ కి వెళ్ళిపోయాడుఎప్పుడు లేని టెన్షన్ కి లోనయ్యాడు అమెరికా నుండి ఇండియా వెళ్తుంటే అభిమన్యు.
నందిత చిన్నాకి స్నానం చేయిస్తోంది ఇంతలో ఎవరో బెల్ కొట్టి కొట్టి తలుపు దడ దడా బాదుతున్నారు
ఎవరబ్బా అని నందిత చిన్నాని బాత్రూం లోనే ఉంచి గబగబా కిందకి దిగి తలుపు తీసి ఎదురుగా అభిమన్యు ని చూసి కోపం గా తలుపు వెయ్య బోయింది
ముందే  సంఘటనని ఊహించిన అభిమన్యు ఒక్క చేత్తో నందిత చెయ్యిని ఇంకో చేత్తో నందిత నడుముని పట్టుకుని బలంగా నందితని లోపలికి నెట్టి ఆమె పడకుండా పట్టుకున్నాడు.
నందిత కోపం గా అతనిని తోస్తోంది కానీ ఏమి లాభం లేకపోయింది. 
"ప్లీజ్వదులు.  పైన చిన్నా బాత్రూం లో ఒక్కడే ఉన్నాడు." అని అన్న నిముషానికే పైనుండి పెద్ద పెద్దగా చిన్నా ఏడుపు వినిపించింది
అభిమన్యు నందితని వదిలేసి అతను కూడా నందిత తో పాటు పైకి పరుగెత్తాడుఅక్కడ చిన్నా మొహం అంతా సబ్బు పూసుకుని కళ్ళు మంటతో నలుపుతున్నాడు
నందిత చిన్నా మొహం నీళ్ళ తో కడిగేసింది
చిన్నాని చూసాక అతని అనుమానాలన్నీతీరిపోయాయి
అభిమన్యు వెంటనే బాబుని టవల్ తో చుట్టి నందిత వంక చూసాడు
నందిత చిన్నా ని రూం కి తీసుకెళ్ళింది
మంచం మీద కూర్చో పెట్టగానే కొత్తగా కనపడిన అభిమన్యుని చూసి చిన్నా"అమ్మాఎవరు ఈయననీ బాయ్ ఫ్రెండా ?" అని అడిగేసరికి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని ఆశ్చర్య పోయారు.
నందిత వెంటనే "నీకు  మాటలు అన్నీ ఎవరు చెప్పారు చిన్నాతప్పు ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడకూడదుఅంది
చిన్నా అమాయకం గా "మరీ సోఫీ చెప్పిందిమమ్మీలు డాడీ లేకపోతే బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడుతారనినాకు డాడీ లేదు కదా అందుకే బాయ్ ఫ్రెండ్ అనుకున్నాఅన్నాడు.అభిమన్యు కి  మాట విన్నాక బాధ కలిగింది కానీ వాడి వివరణకి ఇద్దరికీ నవ్వు వచ్చి పెద్దగా నవ్వారు
నందిత అభిమన్యుని కిందకి వెళ్ళమని తను ఇప్పుడే చిన్నాని పడుకో బెట్టి వస్తానని చెప్పింది.
నందిత కిందకి దిగేసరికి అక్కడ సోఫాలో అలిసి పోయి పడుకుని ఉన్న అభిమన్యుని చూసి నందిత గుండె తరుక్కు పోయింది.
ఒక్కసారి నందితకి గతం అంతా తన కళ్ళ ముందు కదలాడింది.  అయిదేళ్ళ క్రిందట అభిమన్యుతో పెళ్ళై పట్టు మని ఆరునెలలు కూడా గడవకుండానే వారిద్దరి మధ్య గాప్ ఎలా వచ్చిందో? ఎందుకొచ్చిందో? తలచుకుంటూ ఒక్కసారి గతంలోకి జారుకుంది నందిత బాధగా...
అభిమన్యు నందిత ని బెంగళూరులో ఒక పెళ్ళిలో కలిసిఇద్దరు మొదటి చూపుల్లోనే  పీకల వరుకు ప్రేమలో పడ్డారు
ఇద్దరు పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించు కున్నారు.  
నందిత అప్పుడే తన డిగ్రీ ఫినిష్ చేసిందిఅభిమన్యు ఏం. బి. ఏ. ఫినిష్ చేసి సొంత కంపెనీ మొదలు పెట్టాడు.   
దాని పని మీదనే హైదరాబాద్ వచ్చాడు
అభిమన్యు తండ్రి  పెళ్ళికి ఒప్పు కోక పోయినా ఆయనికి వ్యతిరేకంగా నందిత ని పెళ్ళి చేసుకున్నాడు
అభిమన్యుని నందిత తల్లి తండ్రులు అంగీకరించారు
పెళ్ళి అయిన మొదటి ఆరు నెలలు నందిత అభిమన్యుల దాంపత్య జీవితం ఆనందం గా గడిచిపోయింది.  
కానీ  ఒకరోజు అభిమన్యుకి అతని తండ్రి నుండి ఫోన్ రావడంతో అతను కంగారుగా బెంగుళూరు వెళ్ళిపోయాడు.  
 తరువాత ఏమి జరిగిందో తెలియదు కాని అభిమన్యు నందితతో మాట్లాడడం తగ్గించేసాడు.  
ఆమెని మొత్తం గా అశ్రద్ద చేసాడు
ఒక రోజు హఠాత్తుగా నందిత పేరున ఒక పాకేజ్ వచ్చింది
అందులోఉన్న కాగితాలు చూసి నందిత గుండె కొట్టుకోవడం మానేసింది. 
అందులో అభిమన్యు సంతకం పెట్టిన డివోర్స్ పేపర్స్ ఉన్నాయి
నందిత కి ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందనిపించింది. 
ఎందుకంటే అసలు విడాకులు  వరుకు వచ్చేంత గొడవలే వాళ్ళ మధ్య ఎన్నడూ  జరగ లేదు
నందిత అభిమన్యు తో మాట్లాడాలని ఎన్నోసార్లు ప్రయత్నించింది. 
ఆఖరికి బెంగుళూరు అతని ఇంటికి వెళ్ళితే ఇంకో షాకింగ్ న్యూస్ తెలిసింది నందిత కి. 
అభిమన్యు వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎక్కడి కో వెళ్ళిపోయారని.  
ఇంక చేసేది ఏమి లేక నందిత నిస్పృహగా తిరిగి వచ్చేసింది
నందితకి అర్ధం అయ్యిపోయింది అభిమన్యు తనని మోసం చేసాడని. 
అందుకే డివోర్స్ పేపర్స్ మీద సంతకము పెట్టి అందులో ఉన్నరిటర్న్ అడ్రస్ కి పోస్ట్ చేసేసింది
నందితకి జీవితం మీదనే విరక్తి కలిగింది.  
అందుకే అతనితో తెగ దంపులు చేసేసుకుంది.   
మళ్ళీ అతని ముఖము కూడా జన్మలో చూడ కూడదని నిర్ణయించుకుంది
నందితకి జీవితంలో తగిలిన  ఎదురు దెబ్బని తట్టుకోలేక ఆమె మానసికంగా క్రుంగి పోయింది. 
తను అసలు ఎందుకుఎవరి కోసం బ్రతకాలి అని తను బాధ పడుతుండగా తన జీవితానికి ఒక అర్ధంఒక లక్ష్యం ఉన్న ట్లుగా తను ప్రెగ్నెంట్ అన్న తియ్యటి వార్త తెలుసుకుంది.
అప్పటి నుండి తన కొడుకు అభిరాంని తన ప్రాణానికి ప్రాణం గా పెంచుకుంటోంది
కళ్ళు తుడుచుకుని నందిత కిచెన్ లోకి వెళ్ళింది ఇంకా పడుకుని ఉన్న అభిమన్యు ని చూస్తూ. 
నందిత వేడి వేడి సూప్ చేసి అభిమన్యుని నిద్ర లేపింది
అభిమన్యు ఉలిక్కిపడి లేచి ఎక్కడున్నాడో అతనికి అర్ధం అయ్యేసరికి కొంచెము సేపు పట్టింది.
నవ్వుతూ అక్కడ నిల్చున్న నందితని చూసాడు
అతను చిన్నగా నవ్వి లేచి ఫ్రెష్ అయ్యి వచ్చాడు నందిత సలహా మీద
తరువాత నందిత చేసిన వేడి వేడి సూప్ తాగాక అతనికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయ్యింది
ఇద్దరు మధ్య నిశబ్దాన్ని అభిమన్యు భగ్న పరుస్తూ నందితతో సడన్ గా  "ఎప్పుడుచెప్తావ్?అని అడిగాడు
ఏమంటున్నాడో అర్ధం కాక నందిత "ఏంటి?" అంది అయోమయంగా
"చిన్నా నా కొడుకు అనిఎప్పుడు చెప్తావ్?" అని అడిగాడుఅభిమన్యు ముఖం లో ఎలాంటి ఫీలింగ్స్ కనపడ కుండా. 
నందిత ఎప్పుడో అప్పుడు  రోజు వస్తుందని, దానికి తను తయారుగా ఉండాలనుకుందికాని మరీ ఇలా అభిమన్యు చిన్నా గురుంచి ఇప్పుడు అడుగు తాడను కోలేదు. "ఏంటి మాట్లాడుతున్నావ్వాడు నీ కొడుకేంటి?" అంది కంగారుగా
తనకి తెలుసు తను  విషయము ఇంక అభిమన్యునుండి దాయలేదని. "నందితప్లీజ్నువ్వు  రోజు నాతో మనము చిన్నాఅని ఏదో అన్నావుఅన్నాడు
నందిత దానికి "అయితే వాడు నీ కొడుకని ఎక్కడ రుజువు అవుతుంది?" అంది మొండిగా
అభిమన్యుకి ఇంక సహనము పోయింది. 
మానసికంగా శారీరకంగా బాగా అలిసి పోయి ఉన్నాడు.
నందిత తో కోపంగా "ప్లీజ్ ! నందితస్టాప్ ఇట్వాడి మోహము నా మోహము పక్కపక్కన పెట్టి చూస్తే మెడకాయ మీద తలకాయ ఉన్నఏ వెధవ కయినా అర్ధం అవుతుంది వెధవ  వెధవ కొడుకేనని "అన్నాడు
అతను అన్నతీరుకు నందిత పడిపడీ నవ్వింది
అభిమన్యు కూడా నవ్వాడు
మళ్ళీ పాతరోజులు గుర్తొచ్చాయి ఇద్దరికీ.
అభిమన్యు  నందితకి అసలు ఏమి జరిగిందో మొత్తం చెప్పాడు.  అభిమన్యు నందిత తో తను ఆమెకి విడాకులు ఇవ్వడానికి కారణము అతని తండ్రి బిజినెస్ లో బాగా నష్టం వచ్చిందని
అంతలో వాళ్ళ బిజినెస్ పార్టనర్ వాళ్ళ లాస్ అంతా అతను భరిస్తానని దానికి అభిమన్యు ఆయన కూతురు ఇందుని పెళ్ళి చేసుకోవాలని షరతు పెట్టాడని
అభిమన్యు దానికి ససేమిరా ఒప్పుకోలేదనికాని ఆఖరికి అతని తండ్రికి ప్రాణం మీదకి వచ్చి అభిమన్యు నుండి ఆయన ఆఖరి కోరికగా ఇందుని పెళ్ళి చేసుకుని బిజినెస్ ని మళ్ళీ మొదలెట్టాలని ప్రమాణం చేయించుకున్నాడని అభిమన్యు చెప్పాడు.
 తరువాత కొన్నినెలల్లో ఆయన మరణించారనిఅభిమన్యు బిజినెస్ మళ్ళీ మొదలెట్టడమే కాక ఎన్నో రెట్ల లాభం కూడా సంపాదించాడని చెప్పాడు
అభిమన్యు అతని తండ్రి ఉండగానే ఇందుతో నిశ్చితార్థం చేసుకుని పెళ్ళి మాత్రం ఏదో ఒక వంకతో ఇన్నేళ్ళు పొడిగించుకుంటూ వచ్చాడని చెప్పాడు
నందిత అభిమన్యు చెప్పిన దంతా విని అతను తనని వదిలిన కారణం తన మీద ప్రేమలేక కాదని,  అతని తండ్రి ఆఖరి కోరిక గురుంచీ అని తెలుసుకుంది. 
అతని మనసులో ఉన్న వేదనని కూడా అర్ధం చేసుకుని మనస్ఫూర్తిగా క్షమించి అతనిని మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించింది.
అభిమన్యు నందిత కుటుంబ సభ్యులతో జరిగినదంతా చెప్పి వారి క్షమాపణలు కూడా తీసుకున్నాడు
ఇంతలో అతని మొబైల్ కి ఇందు ఫోన్ చేసి షాకింగ్ న్యూస్ చెప్పింది
నందిత కి అభిమన్యు కి విడాకులు మంజూరు అయ్యిందని నిముషము నుండి నందిత అభిమన్యు లు భార్యా భర్తలు కారని, వాళ్ళపెళ్ళికి ఇంకేమి అడ్డులేదని చెప్పిన ఇందు మాటలకి అభిమన్యు మొహంలో చుక్క నెత్తురు కూడా లేకుండా తెల్లగా పాలిపోయింది.  
 వార్త వినాల్సి వస్తుందని ఇద్దరికీ ముందు నుంచే తెలుసుఅందుకే నందిత వంక చూసి అభిమన్యు "ఇందు ఫోన్… మన .. డివొ " అని ఇంకా మాట పూర్తిచెయ్యకుండానే కుర్చీలో కూల పడ్డాడు
నందిత ఏడుపు మొహం తో "నోనో!మళ్ళీనా!అని కోపంగా అభిమన్యు మీద పడి "యు ఇడియట్నిన్ను!నిన్ను"అని అతనిని ఎక్కడ పడితే అక్కడ రక్కేస్తోంది
అందరికీ ఏమి అర్ధం కాలేదు ఆశ్చర్యం గా ఇద్దరి వంక చూస్తున్నారు.
అభిమన్యు నందిత నుండి తనని కాపాడమని వాళ్ళని వేడు కుంటున్నాడు
అభిమన్యుకి నందితని అలా చూస్తుంటే అందరికి ముచ్చట వేసింది. "నందుప్లీజ్ ! నన్ను కొంచెము ఆలోచించనీఇలా రక్కేస్తుంటే నేను ఎలా ఆలోచించేదిఅన్నాక నందిత కొంచెము శాంతించి అభిమన్యుని వదిలింది . 
అభిమన్యు "హమయ్య!!అని అక్కడ నుండి లేచి “దేవుడాఇదేమి కర్మ! ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నుయ్యిలా ఉంది నా పరిస్థితి” అన్నాడు
దానికి అందరు నవ్వారు.
మళ్ళీ ఇందు ఫోన్ చేసిందిఅతను ఇందుని లైన్ లో ఉంచి స్పీకర్ ఫోన్ ఆన్ చేసి నందిత చెయ్యి పట్టుకుని పక్కన రూం లోకి లాకెళ్ళాడు
నందిత అయోమయం గా అభిమన్యు వెనకాల వెళ్తూ తన వాళ్ళ వంక చూస్తే వాళ్ళు ఏమీ అర్ధం కాక నందిత వెనకాలే వెళ్ళారు
పార్వతమ్మ గారు "వీళ్ళ కిఏమయిందో తెలియదు కానీ నాకు  రోజు పిచ్చి ఎక్కడం ఖాయంఅంటూ ఆవిడ తల కొట్టుకుంటూ వాళ్ళ తో వెళ్ళింది
అభిమన్యు నందితని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి అక్కడ అమ్మ వారి ముందర ఉన్న పసుపు కొమ్ము తాడు నందిత మెడలో కట్టి, ఆమె నుదిట అమ్మవారి కుంకుమ తో సింధూరముపెట్టాడు
నందిత కళ్ళలో నీళ్ళు తిరిగాయి ఇంకా అలానే ఆశ్చర్యం గా తన మెడలో ఉన్న తాడు చూసుకుంటోంది
అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి
ఇద్దరూ వాళ్ళ ఆశీర్వాదము తీసుకున్నారు.
ఇదంతా ఫోన్ లో వింటున్న ఇందుతో అభిమన్యు "ఇందుఇప్పుడే నందితతో మళ్ళీ నా పెళ్ళి జరిగింది ఆమ్ సారీ!"అన్నాడు
దానికి ఇందు షాక్ గా"మరి మన పెళ్ళి??" అని అడిగింది
దానికి అభిమన్యు "సారీఇందు." అన్నాడు మళ్ళీ
ఇందు కోపం గా "మరి  డివోర్స్ పేపర్స్ ఏమి చెయ్యనుఅని అడిగింది
దానికి అభిమన్యు చిన్నగా నిట్టూర్చి ఫోన్ పెట్టేసాడు
ఇందు కోపం తో ఫోన్ విసిరి గొట్టి చేతిలో ఉన్న డివోర్స్ పేపర్స్ ని కచ్చిగా  ముక్కలు ముక్కలు గా చించి పడేసింది
ఇక్కడ అందరు అనందంగా ఉన్నారు కాని మళ్ళీ నందిత మొహంలో ఇంకా ఏదో ఆందోళన ఉండేసరికి అభిమన్యు నందితతో "ఏమైంది నందిత?" అనిఅడిగితే నందిత ఆమె మెడ వైపు చెయ్యి పెట్టి చూపించింది.
అభిమన్యుకి అర్ధంకాక అయోమయంగా చూసాడు. "ప్రపంచంలో ఏస్త్రీ కైనా రెండు మంగళ సూత్రాలు ఉంటాయానువ్వు చూడు ఏమి చేసావోఇప్పుడు ఏది ఉంచుకోవాలిఏది తీసెయ్యాలి? దేవుడా!" అని గట్టిగా అరిచింది.
దానికి అభిమన్యు "కదా ! తప్పు చేసానుఒక్కటి ఇచ్చేయ్ ఇందుకి కట్టేస్తాఅప్పుడు ఏ గొడవ ఉండదు అందరూ హ్యాపీ గా ఉండొచ్చుఅన్నాడు నవ్వుతూ.
అది వినగానే నందిత అతని మీద రాక్షసిలా పడే ముందరే నందితని అమాంతం పైకి ఎత్తి నందిత బెడ్ రూమ్ లోకి వెళ్ళి మంచం మీద పడేసాడు
అందరు నవ్వుకుని అక్కడనుండి వెళ్ళిపోయారు
పార్వతమ్మ గారు నోటి మీద వేలు వేసుకుని కొన్ని రోజులు ఎక్కడికయినా దైవ దర్శనానికి వెళ్ళి పోవాలని చాలా గట్టిగా నిర్ణయించుకుంది.
ఇంతలో అభిమన్యు బయటికి వచ్చాడు నందిత  గదిలోనుండి. 
దానికి పార్వతమ్మగారు ఆశ్చర్యం గా అతని వంక చూసింది
"ఏమైంది బాబుఅంతాబాగానే ఉందిగానందిత.." అని ఆవిడ మాట పూర్తిచెయ్యకుండానే అభిమన్యు
"అంతా  బాగానే ఉందిఅదే అందరి ముందు మండపంలో మీ కుటుంభం పరువు తీసి మీ అందరిని బాధ పెట్టాను. అందుకు మళ్ళీ నందిత కి " అని ఏదో అనబోతుంటే ఆవిడ
"ఏంటి బాబుకొంపదీసి నందితకి అందరి ముందు మళ్ళీ తాళి కడతావ ఏంటీ?" అని ఆవిడ కళ్ళు పెద్దగా చేసి నోటిని చేత్తో మూసుకుంది
దానికి అభిమన్యు పెద్దగా నవ్వి "అయ్య బాబోయ్ లేదండిఆలోచిస్తే ఐడియా బాగానే ఉందిముచ్చటగా మూడు మంగళ సూత్రాలు కట్టడానికి నాకు  అభ్యంతరమూ లేదు కానీ మీ నందిత రెండిటికే నన్ను రక్కి పెట్టింది మూడిటికి ఇంకేమి చేస్తుందో అని ఆలోచిస్తున్నా?" అన్నాడు నవ్వుతూ.   
దానికి నవ్వుతూ ఆవిడ "భలే వాడివి బాబుఇంతకీ నువ్వేదో చెప్పబోయావు చెప్పు బాబు టెన్షన్ పెట్టకుండాఅంది ఆవిడ
దానికి అభిమన్యు మళ్ళీ నవ్వుతూ "అదేనండి నందిత నేను, చిన్నాని ఇప్పటి వరుకు ఇద్దరమూ కలిసిపెంచలేదని కోపంగా ఉంది అందుకే  నింద కూడా తొలగించాలనితొందరలో ఇంకో బుల్లి నందితని మేము కలిసి పెంచాలని  దేవుళ్ళని కోరుకోండి"అన్నాడు.   
ఆవిడకి అతని అన్న మాటలకి అర్ధం తెలిసాక అసలు మొహమాటం లేకుండా ఇలా మాట్లాడుతున్న అభిమన్యుని చూసి ఆశ్చర్య పోయితనమనసులో ఉన్నది అభిమన్యుకి ఎలా తెలిసింది అనుకుంటూ తనలో తను నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.    
ఏదిఏమైనప్పటికీ ఇంత కాలానికి మళ్ళీ ఇరువురు ఒకటై నందుకు ఆవిడకి చాలా ఆనందం కలిగింది. 
కథ కంచికి మనమింటికి !!!