Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Twelve : Nanditha and Sruthi go to Nanditha’s house

 


నందిత ఇంటికి చేరగానే గుమ్మంలో నందిత చెల్లి ముగ్గు పెడుతూ కనిపించింది. సడన్ గా తన కళ్ళ ముందు నందిత ని అక్క ని చూడగానే ఆశ్చర్యం తో కళ్ళు పెద్దవి చేసి గట్టి గట్టిగా తల్లిని, తమ్ముడు ని పిలవసాగింది నందిత చెల్లెలు. నందిత దగ్గరకి వెళ్ళి గట్టిగా కౌగలించు కుంది స్వప్న. నందిత కి కూడస్వప్న ని చూడగానే చాలా ఆనందం వేసింది. "నాన్న కి ఎలా ఉందే?" అని అడిగింది నందిత స్వప్న ని. "బాగానే వుంది అక్క!అయినా నువ్వు వచ్చేశావు కదా అందరికీ బానే ఉంటుంది."అక్కా! నీకు ఒక సంగతి తెలుసా?నీకు బావ కి ....." అని ఇంకా ఏదో చెప్పే లోపలే నందిత తల్లి పార్వతమ్మ గారు లోపలి నుంచి గబ గబా నందిత ని చూడడానికి వంటింటి లోంచి వచ్చింది. " వసేయ్ నందు ! వచ్చేసావా, నా తల్లే ఎలా చిక్కి  పోయావో చూడు" అంటూ పక్కనే వున్న శ్రుతి ని చూసి "అమ్మ శ్రుతి! ఎలా ఉన్నావమ్మా ? అమ్మ వాళ్ళు కులసానేన? నువ్వు ఉన్నావనే అమ్మ! మాకు దైర్యం." అంటూ శ్రుతి చెయ్యి పట్టుకుని "లోపలి కి పదండి రా!" అంటూ ఇద్దరినీ పట్టుకునిలోపాలకి తీసుకెళ్ళింది పార్వతమ్మ గారు.
"మీ నాన్న కి చూడవే హార్ట్ ఎటాక్ అంట! సుబ్బరం గా వున్న మనిషి కి చూడవే దేవుడు ఎలా చేసాడో? నీ దగ్గిర నుంచి వచ్చిన రోజు నుంచి ఏదో బెంగ పెట్టేసుకున్నారు అంతే, రాత్రినిద్రలో వచ్చిందంట హార్ట్ ఎటాక్. పొద్దున్న లేవగానే ఈయనకి కి వళ్ళంతా చెమటలు, ఊపిరి అందలేదు. మాకు కాళ్ళు చేతులు ఆడలేదు నందు, వెంటనే డాక్టర్ ని పిలిపిస్తే ఈ సంగతి చెప్పారు. కంగారు లేదు, ప్రాణాపాయం లేదు కానీ బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. నువ్వు వచ్చావు కదే నీ బాధ్యతే నాన్న ది." అని గబ గబా చెప్పోకుపోయింది పార్వతమ్మ గారు.
"నాన్న! ఏరి అమ్మా?" అని అడిగింది నందిత బారమైన గొంతు తో.
" పడుకున్నారు, పద లోపలి కి " అంది పార్వతమ్మ గారు.
ఇంతలో గంగాధరం గారు లోపల నుంచి "ఎవరూ? నందిత వచ్చిందా? నందితే కదా" అనిఅడుగుతున్నారు.
నందిత పరుగున "నాన్న! ఎలాఉన్నారు నాన్న? అంతా నా మూలానే?"అంటూ ఏడవసాగింది.
పార్వతమ్మ గారికి ఏమి అర్ధం కాలేదు నందిత మాటలు. గంగాధరం గారు నందిత తల నిమురుతూ "నందు! ఊరుకో! నాకు ఏమి అయిందని. పెద్ద వయసు కనుక కొన్ని సార్లు ఇలా జరుగుతాయి. దూరపు ప్రయాణంచేసాను కదా కొంచెము హైరానా అయ్యింది. రవి నన్ను జాగ్రత్త గానే తీసుకు వచ్చాడు. ఇంటికి వచ్చాక రాత్రి కొంచెము బడలిక అనిపించింది తప్ప ఇంకేమి లేదు. ఈ డాక్టర్ లు అలానే ఎదో ఒకటి చెప్తారు." అన్నారు. "శృతి! ఎలాఉన్నావమ్మా?" అని అడిగారు. 
నందిత కి ఏడుపు ఆగలేదు. తన మూలానే తన నాన్న కి హార్ట్ ఎటాక్ వచ్చిందని ఏడుస్తూ కూర్చుంది. "అయ్యో రామ! ఏమైంది నీకు. నాన్న కిఏమీ కాలేదు కదే. ఇప్పుడు మా అందరి కి కూడా ఏడుపు తెప్పిస్తున్నావు" అంటూ పార్వతమ్మ గారు బాధ పడింది.
"ఎంటమ్మ నందూ! నువ్వు ఇలా చేస్తవనే నేను వీళ్ళకి నీకు చెప్పొద్దు అని చెప్పాను. శ్రుతి నువ్వే చెప్పమ్మా నీ ఫ్రెండ్ కి ఊరుకోమని" అన్నరు గంగాధరం గారు. శృతి నందిత తో "నందు! ఆపవే. ఐ కెన్ అండర్ స్టాండ్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో. కాని చూడు నువ్వు ఇప్పుడు ఏడుపు ఆపక పోతే అంకుల్, ఆంటీ అందరు ఎలా నీ గురుంచి బాధ పడుతున్నారో." అని నచ్చ నందిత కి నచ్చ చెప్పింది. నందిత ఏడుపు ఆపింది శృతి చెప్పింది కరెక్ట్ అనిపించింది.
అలా కొంచెము సేపు గడిచాక గంగాధరం గారి మందు టైం అయింది అని పార్వతమ్మ గారు మందు తీసుకుని వచ్చారు. నందిత నే దగ్గర ఉండి గంగాధరం గారికి మందు వేసింది. కొంచెము సేపు ట్యూషన్ కి వచ్చే పిల్లల గురించి, తమ్ముడు గురించి కొంచెం సేపు మాట్లాడుకున్నారు.
"అవును స్వప్నా! శ్రీను ఎక్కడ? ఇంకా రాలేదు" అని అడిగింది.
"ఈ రోజు లాస్ట్ఏక్జామ్ అక్కా! వచ్చేస్తాడు!" అంది స్వప్న.
నందిత, శ్రుతి ఇద్దరు లేచి స్నానాలు చేసాక భోజనం చేసి కొంచెము సేపు పడుకున్నారు. ముందర జరిగిన సంఘటనలు మూలా నో నందిత శారీరకంగా మానసికంగా అలిసి పోయింది అనుకుంటా బాధ అంతా తెలియ నట్టు పసి పాపా లా దీర్గ నిద్రలో జారుకుంది. శ్రుతికూడా వళ్ళు మరిచి పడుకుంది. నందిత కి మెలుకువ వచ్చే సరికి సాయంత్రం అయ్యింది. పక్కన శ్రుతి కూడా కనపడ లేదు. బయట అందరి మాటలు వినపడ్డాయి. నవ్వులు వినపడుతున్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకుని "హమ్మయ్య! ఇంట్లో ఎంత హాయిగా ఉందో" అనుకుంది నందిత. ముఖము కడుక్కుని బయట వరండా లోకి వచ్చింది.
గంగాధరం గారు నవారు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్నారు,పార్వతమ్మ గారు అయన పక్కనే కింద కూర్చుని సాయంత్రానికి వంటకి కావాల్సిన కూరలు తరుగుతోంది. స్వప్న, శ్రుతి పక్కనే ఆనుకుని కూర్చుని శ్రీను ఎదో చెప్తుంటే వింటూ నవ్వుతోంది.
శ్రీను ఎదో క్లాసు లో జరిగిన సంఘటన గురించి చెప్తున్నాడు. ఎవరినో అనుకూలిస్తున్నాడు. మధ్య మధ్య లో గంగాధరం గారు పేపర్ నుంచి తొంగి చూసి మరీ నవ్వుతున్నారు. అలా సంతోషం గా అందరిని చూస్తుంటే నందిత కి ఎంతో ఆనందం కలిగింది.
నందిత రూం నుండి బయట కి వచ్చిన చప్పుడుకి అందరూ అటు చూసారు.
శ్రీను కళ్ళు వెలిగిపోయాయి "అక్క! ఎలా ఉన్నావే? చెప్పకుండా వచ్చేశావు? తెలిస్తే నేను స్టేషన్ కి వచ్చేవాడిని కదే" అంటూ నందిత దగ్గరికి కి వెళ్లి నందిత ముకము లోకి చూసి "ఏమైంది రా అంతా నీరసం గా వున్నావు? వంట్లో బాలేదా? కళ్ళు కూడ లోపలి వెళ్ళాయి?" అంటూ ఆరా తీసాడు.
"నీ తలకాయ! నేను బానే వున్నాను కానీ ఏంటి ఎదో సినిమా స్టోరీ చెప్తున్నావు" అను అడిగింది నందిత.
"ఏమి లేదే మా సార్ ఎవడో చీటింగ్ చేస్తే ఎలా పట్టుకున్నాడో అంతా సీన్ టు సీన్ చూపిస్తున్నాను.అవన్నీ సుతి మాటలే కానీ, నువ్వు చెప్పవే ఎలా ఉన్నావు? వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్" అని అడిగాడు శ్రీను.
ఒక్క క్షణం కళ్ళలో బాధ తోనికిస లాడింది వెంటనే సంభా లించుకుని "ఓకే కానీ, ఎగ్జామ్స్ ఎలా రాసావు రా? నువ్వు ఈ సారికూడా కాలేజీ ఫస్ట్ వస్తావా రావా?" అని అడిగింది.
"నీ తమ్ముడు ని అక్క! హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ" అన్నాడు.
అలాఏదో ఒకటి సరదాగా అన్నీ మాట్లాడుకుంటూ గడిపేశారు.
ఇంతలో పార్వతమ్మ గారు "మర్చిపోయాను నందు నీకు చెప్పడం రాత్రి కార్తీక్, అత్తయ్య వాళ్ళు భోజనానికి వస్తున్నారు. మంచి గా రెడీ అవ్వు" అని చెప్పింది.
"కార్తీక్ ఎప్పుడు వచ్చాడు అమెరికా నుండి? అయినా నేను ఎందుకే రెడీ అవ్వాలి అత్తా వాళ్ళు వస్తే" అని అడిగింది నందిత. "వారం అయ్యిందే! వచ్చే రెండో వారం లో వెళ్ళిపోతాడు. సెలవులు లేవంట. మావయ్య కూడ కొంచెము నలత పడ్డారు చూడ డానికి వచ్చాడు" అంది పార్వతమ్మ గారు. నందిత "అవునా! ఇప్పుడు ఎలా ఉంది మావయ్యకి" అని అడిగింది నందిత.
అప్పుడు గుర్తు వచ్చింది నందిత కి "స్వప్న ఏదో "నీకు బావకి" అని ఏదో చెప్ప బోయింది పైగా అమ్మకూడా మంచి గా రెడీ అవ్వమంది" అని మనసులో అనుకుంది.
అప్పుడే గంగాధరం గారు "అమ్మా!నందు! ఒక్కసారి లోపలి రాఅమ్మా" అని పిలిచారు.
అప్పుడే శ్రీను "మేము శ్రుతి తో పాటు బయట షాపింగ్ కి వెళ్ళి వస్తాము అక్కా?" అని చెప్పాడు. శృతి కి అంతకు ముందు నందిత వాళ్ళ అమ్మ శ్రీను కి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చి "జాగ్రత్త గా లిస్ట్ లో ఉన్నవన్నీ తీసుకురా ఏది మర్చి పోవద్దు కార్తీక్ కి ఇష్టమైన వంటలు చెయ్యాలి. తొందరలో మన కి చాలా దగ్గర చుట్టం అవ్వుతాడు అసలే " అన్న ఆవిడ మాటలు గుర్తు వచ్చాయి. "అంటే కార్తీక్ తో నందిత కిపెళ్లి గురుంచి మాట్లాడుతార ఏంటి కొంప తీసి? మరీ అభిమన్యు? నందిత కి చెప్పాలి"అనుకుంది శ్రుతి.
శ్రీను కి ఒక్క నిముషము చిన్న పని ఉంది అని చెప్పి నందిత దగ్గరకి వెళ్ళి "నందు!ఇలా రా ఒక సారి" అని రూం లోకి తీసుకు వెళ్ళింది. నందిత రూం లోకి వచ్చాక "నందు! నాకు ఎందుకో నీ బావనిపెళ్ళి చేసుకోమని అడుగుతారని అనుమానం గా ఉంది నువ్వు మొహమాటం లేకుండా ఇష్టం లేదు అని చెప్పేసే. అసలు ఒప్పుకోకు" అంది శ్రుతి.
దానికి నందిత కొంచెం చికాకుగా "ఎందుకు శ్రుతి? ఎందుకుఒప్పు కోవద్దు" అని అడిగింది కొంచెం ఇరిటేటింగ్ గా.
శ్రుతి కి నందిత అన్న మాటలకి పిచ్చి ఎక్కి నంత పని అయ్యింది. కన్ ఫ్యూస్ అయ్యింది శృతి "అదేంటి నందిత? వాట్ డు యు మీన్? అలాఅడుగుతావు ఏంటి? నువ్వు మీ బావ ని కానీ అసలు ఎవరినైనా ఎలాపెళ్ళి చేసుకో గలవు? అర్ యు కిడ్డింగ్ మి? జోక్ చెయ్యకు . ఇట్స్ నాట్ ఫన్నీ.అభిమన్యు సంగతి ఏంటి?" అని ఇంకా ఏదో అనీ చెప్పే లోపల నందిత "శ్రుతి! అభిమన్యు ఒక హిస్టరీ . ప్లీజ్ అతని గురించి నాతో మాట్లాడకు. ఇట్ ఈస్ మై పర్సనల్ మ్యాటర్. ఐ డోంట్ వాంట్ టు హియర్ ఎనీ థింగ్ అబౌట్ హిం. ప్లీజ్! లీవ్ ఇట్. అందరికి అదే మంచిది. ఒకవేళ మా బావని పెళ్లి చేసుకోమంటే నేను కాదని అనను." అని చెప్పి వెళ్ళబోయింది నందిత.

శ్రుతి నందిత చెయ్యి పట్టుకుని కోపం గా ఆపి "నందిత! వాట్ డు యు మీన్? నీ పర్సనల్ మ్యాటర్? హౌ కెన్ యు సే దట్ టు మి? నా సంగతి వదిలేసేయ్? అభిమన్యు సంగతి ఏంటి? హౌ కెన్ యు డు దట్ టు హిమ్? నువ్వు చాలా తప్పు చేస్తున్నావు? ఇది అన్యాయం. ఒకరిని ప్రేమిస్తూ ఇంకో వకరినిపెళ్ళి చేసుకోవడం." అంది కోపంగా శృతి.
నందిత కి కూడా కోపం వచ్చింది శ్రుతి మీద అభిమన్యు ని సపోర్ట్ చేస్తున్నందుకు అందుకే కోపం గా శృతి తో "శ్రుతి! నీకు మళ్ళీ చెప్తున్నాను ఈ విషయంఇక్కడితో వదిలేసేయ్ ప్లీజ్. ఐ డోంట్ వాంట్ టు అర్గ్యూ విత్ యు? ప్లీజ్ నన్ను ఇరిటేట్ చెయ్యకు?" అంది విసురుగా.
శ్రుతి కూడా నందిత తో "నందిత! ప్లీజ్! నువ్వు అన్ని రాంగ్ డెసిషన్ లు తీసుకుంటున్నావు. అభిమన్యు ని చాలా హార్ట్ చేశావ్. నువ్వు ఫీల్ అవుతావ్ అని ఏమీ అనలేదు కానీ థిస్ ఈస్ టూ మచ్. నువ్వు అభిమన్యు ని నీ ప్రేమలో పడేలా చేసి ఇప్పుడు ఇలా బ్యాక్ స్టాబ్ చెయ్యడం ఏమీ బాలేదు నందిత?" అంది కోపం గా తన మనసులో ఉన్న బాధంతా కక్కేస్తూ.
నందిత కి వళ్ళు మండి పోయింది శ్రుతి అలా అభిమన్యు ని సపోర్ట్ చేస్తూ మాట్లాడు తున్నందుకు. కోపము వచ్చింది శ్రుతి తో "శ్రుతి! టూ మచ్ గా మాట్లాడకు. నేను అసలు ముందు నుంచి చూస్తున్నాను, నువ్వు నా ఫ్రెండా లేక అభిమన్యు ఫ్రెండా? అన్నిటికి అతని ని సైడ్ చేస్తావు.నేను అభిమన్యు ని హార్ట్ చేస్తున్నానా? అతని ని ప్రేమ లో దింపానా? అభిమన్యు ని బ్యాక్ స్టాబ్ చేస్తున్నానా? నువ్వు నా ఫ్రెండ్ వి గనుక నువ్వు అనే వన్నీ వింటున్నాను వేరే వాళ్ళు అయితే ఈ పాటికి ఇక్కడ నుంచి బయటకి గెంటే దాన్ని. నీకు అభిమన్యు మీద అంత క్రేజ్ ఉంటే నువ్వే పెళ్ళి చేసుకోచ్చు కదా నన్ను ఎందుకు ఇర్రిటేట్ చేస్తున్నావు." అంది నందిత ఆవేశంగా. శృతి నందిత అన్న మాటలకి చాలా హార్ట్ అయ్యి ఏడుస్తూ అక్కడి నుండి బయటకి వెళ్ళి పోయింది. నందిత అప్పుడు రియలైజ్ అయ్యింది తను శృతి ని బాగా హార్ట్ చేసిందని. నందిత శ్రుతి వెనకాలే వెళ్ళి "సారీ శ్రుతి! ప్లీజ్ నన్ను క్షమించు. కోపంలో చాలా తప్పుగా మాట్లాడాను. ప్లీజ్! ప్లీజ్!" అని బ్రతి మాలింది. శృతి ని పట్టుకుని ఏడుస్తూ "ప్లీజ్! శృతి నీకు తెలుసు ఈ పాస్ట్ ఫ్యూ డేస్ నుండి నాకు బుర్ర పనిచెయ్యట్లేదే? మెంటల్ గా ఫీజికల్ గా చాలా టైర్డ్ గా ఉన్నాను. ప్లీజ్! ఫర్గివ్ మీ శృతి?" అంటూ శృతి చేతులు పట్టుకుని ఏడిచింది నందిత.

అక్కడ ఉన్న శ్రీను కి స్వప్న కి ఏమి అర్ధం కాలేదు. శ్రుతి అప్పటికే అక్కడికి చేరిన నందిత వాళ్ళ పేరెంట్స్ ని చూసి ఏమనుకుందో ఏమో కళ్ళు తుడుచుకుని "ఏంటి నందిత! నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. శ్రీను తో స్వప్న తో భయటకి వెళ్తున్నాను. "అయినా సారీనందిత! నేనే అర్ధం సెన్స్ లేకుండా మాట్లాడాను. నువ్వు నీకు ఏది మంచిదో అదే చెయ్యి. ఇట్స్ యువర్ లైఫ్ అండ్ ఇట్ ఈస్ యువర్ పర్సనల్ మ్యాటర్. నేను నీ ఫ్రిండ్ ని నీకు ఏది మంచిదో నేను అదే చేస్తాను. సరేనా బాధ పడకు." అని వెళ్లిపోయింది శ్రుతి. నందిత కళ్ళు తుడుచుకుని అక్కడికి వచ్చి నిల్చున్న గంగాధరం గారి కి "ఏమీ కాలేదు?" అని చెప్పి ఆయనను తీసుకుని రూం కి వెళ్ళింది. పార్వతమ్మగారు కూడా వంటింట్లో కి వెళ్ళిపోయారు.