Wednesday, February 2, 2022

ప్రియమైన శత్రువు (My Dearest Enemy) - Chapter Eleven : Nanditha and Sruthi’s conversation after the lab encounter

 

శ్రుతి నందిత దగ్గర కి వెళ్లి నందిత ముందు కూర్చుని చేత్తో

నందిత ముకము పైకి ఎత్తింది. శ్రుతి మనసు విల విల లాడింది. ఏమి అడగలేదునందిత ని. నందితని హృదయానికి హత్తుకుని కూర్చుని పోయింది. అలా మౌనం గా ఎంత సేపు కూర్చున్నారో వాళ్ళకే తెలియలేదు. ఇంతలో వాచ్ మెన్ అక్కడికి తలుపులు లాక్ చెయ్యడానికి వచ్చి వీళ్ళ ఇద్దరిని చూసి బయటకు వెళ్ళమని చెప్పాడు. మెల్లిగా శ్రుతి నందిత ని పట్టుకుని లేచి బయటకి నడవ సాగింది. 
హాస్టల్ రూం కి వెళ్ళాక నందిత "శ్రుతి! అభిమన్యు నన్ను.."

అంటూ ఏదో చెప్పా బోతుంటే శ్రుతి "నందిత! తరువాత

మాట్లాడుదాము నువ్వు ప్లీజ్ రెస్ట్ తీసుకో.
ఈ వారమంతా నువ్వు బాధ పడుతూనే గడిపావు.  ఇప్పుడు ఇది 

తలుచుకుని ఇంకా బాధ పడడము నాకు ఇష్టం లేదు.

నువ్వు పడుకో" అని అంటుండగానే వార్డెన్ నందిత ని శృతి ని రమ్మని పిలిచిందని ఒక స్టూడెంట్ వచ్చి చెప్పింది.

ఇద్దరు వకరి మోహము ఒకళ్ళు చూసుకుని లేచి నిలబడ్డారు.

ఇందాక జరిగిన దాని గురించే అయ్యి ఉంటుంది అని ఇద్దరికి

మనసులో అనిపించింది. ఇద్దరు ఇది ఆల్రెడీ ముందే గెస్

చేసినట్టు ఉంది వాళ్ళ రియాక్షన్. శ్రుతి నందిత తో "నందిత! నువ్వు కొంచెము మోహముకడుక్కుని రా! నేను వెయిట్
చేస్తాను" అని చెప్పింది. నందిత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది.

అద్దంలో తన మోహము చూసుకుంటూనే భయ పడింది నందిత.

ముహం అంతా పీక్కుపోయింది. ఇద్దరు  వార్డెన్ దగ్గర కి భయలు దేరారు.
నందిత ని శ్రుతి ని చూస్తూనే వార్డెన్ "నందిత!ఎవరీ థింగ్ ఓకే?"

అని అనుమానంగా నందిత ముహము లోకి చూస్తూ అడిగింది.

ఇద్దరు కొంచెం అయోమయ పడ్డారు. వార్డెన్ ఇందాక ల్యాబ్ లో

జరిగిన దాని గురుంచి మాట్లాడుతుంది అనుకుంటే ఆవిడ
ఇలా అడిగేసరికి ఇద్దరు తడబడి "ఎస్ మాడం! నందిత కి

కొంచెము వంట్లో బాలేదు" అని సర్దేసింది శ్రుతి. వార్డెన్ కొంచెం

గొంతు సరిచేసుకుని "నందిత! నీకు ఒక బాడ్
న్యూస్ మరీ బాడ్ కాదనుకో. మీ నాన్న గారికి..." అని ఆవిడ

ఇంకా మాట పూర్తి చెయ్య కుండానే నందిత

"ఏమయింది? నాన్నకి ఏమైంది? చెప్పండి? చెప్పండి?" అంటూ
వార్డెన్ దగ్గరకి వెళ్లి ఆల్మోస్ట్ ఏడుపు గొంతు తో అడిగింది.

శ్రుతి నందిత ని పట్టుకుంది ఆవిడని నందిత ఎటాక్

చెయ్యకుండా. శ్రుతి కి కూడ బాగా కంగారు వేసింది.
తలచుకుని శృతి భయపడింది. చాలా ఘోరం గా వుంటుంది

పరిణామం అనుకుంది మనసులో శ్రుతి. కళ్ళ కింద నల్ల చారలు

వచ్చాయి. నందిత ముహము కడుక్కుని బయటకి వచ్చాక
ఒకవేళ అంకుల్ కి జరగ కూడనిది జరిగితే ఇప్పుడు నందిత వున్న

పరిస్తి తి ని నందిత కి మనసులో ఎన్నో ప్రశ్నలు

"ఏమైంది? ఒక వేళ ఏమైనా సీరియస్ ఆ? అంతా నా మూలానే.

భగవంతుడా!ప్లీజ్ నాన్నకి ఏమి అవకూడదు. నాన్న చెప్పిన
మాటే వింటాను. ఇంకెప్పుడు ఆయన మనసు కష్ట పెట్టను"

అని దణ్ణం పెట్టుకుంది. ఇంతలో వార్డెన్ లేచి నిల్చుని

"నందిత! ఇందాక మీ తమ్ముడు ఫోన్ చేసాడు,
మీ నాన్నగారికి మైల్డ్ గా హార్ట్ ఎటాక్ వచ్చిందిట! కంగారు ఏమి

లేదు. నిన్నే కలవరిస్తున్నారు ట. ఒక్కసారి నిన్ను పంపడానికి

పర్మిషన్ ఇవ్వమని అడిగాడు. నేను సరే అన్నాను. నేను రాత్రి

ట్రైన్ కి నీకు శ్రుతి కి టికెట్స్ తీశాను. మీరు వెళ్ళడానికి సిద్దం

కండి. శ్రుతి! మీ ఇంటిలో కూడ పర్మిషన్ తీసుకున్నాను." అని

చెప్పింది వార్డెన్. నందిత వార్డెన్ ని వెళ్లి హత్తుకుంది "థాంక్ యు!!

థాంక్ యు సో మచ్ మేడం!! మీరు ఎంత సహాయం చేసారో.

నేను జన్మ లో మర్చి పోలేను" అంటూ ఏడిచేసింది.
"అదేంటి నందిత! నువ్వు నా బెస్ట్ స్టూడెంట్ వి! నా కూతురు

లాంటి దానివి. ఈ మాత్రం చెయ్యలేనా" అంది.
"నందిత! నేను నిన్ను ఒకటి అడగాలి? నీ పర్సనల్ అనుకో

బట్ నా మనసులో తొలిచేస్తోంది చాలా రోజులు నించి. అడగనా?"

అంది వార్డెన్. నందిత కి తెలుసు వార్డెన్ ఏమి అడుగుతారో

"నాకు తెలుసుమేడం. మీరు అభిమన్యు గురుంచే కదా?"

అంది గుటకలేస్తో.
"అవును నందిత! నిన్ను అభిమన్యు ఏమైనా బాధ

పెడుతున్నాడా? హర్ట్చె చేస్తున్నాడా చెప్పు!! మనము డిపార్టుమెంటు హెడ్ కి కంప్లైంట్ చేద్దాము.
కానీ అతని తో పెట్టుకోకు నందిత. చాలా ఇన్ ఫ్లుయెన్స్ ఉంది

అభిమన్యు కి. దేనికైనా తెగిస్తాడు మన జగ్రతలో మనము

వుండాలి సో నువ్వు అతనిని రెచ్చ కొట్టకు. జస్ట్ ఇగ్నోర్ హిం.

ఇట్ విల్ బి గుడ్ ఫర్ బోత్ ఆఫ్ యు." అంది వార్డెన్. దానికి

నందిత ఒకలాంటి ఏడుపు కీచు గొంతు తో "ఇంక నా జోలి కి రాడు

మేడం. మీరు కంగారు పడకండి. అతని నీడ కూడ నా మీద
ఇంక పడదు. ఐ మేడ్ షూర్ ఆఫ్ ఇట్" అంది ఏదో ఆలోచిస్తూ.
శ్రుతి కి ఆశ్చర్యం వేసింది. "అంటే నందిత డెఫినెట్ గా

అభిమన్యు ని బాగా డీప్ గా హర్ట్ చేసి ఉండాలి లేకపోతే

అభిమన్యు మోహము అంత దీనం గా ఉండేది కాదు అండ్
నందిత ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పేది కాదు." అనుకుంది

మనసులో శృతి. ఇద్దరు వార్డెన్ కి థాంక్స్ చెప్పి బట్టలు

సర్దుకోడానికి రూం కి వెళ్లారు. శ్రుతి గంబీరం గా వుండడం చూసి

నందిత ఇందాక తను వార్డెన్ తో అభిమన్యు గురించి మాట్లాడిన
మాటలే దానికి కారణం అని అనుకుంది. నందిత కి తెలుసు

అభిమన్యు అంటే శృతి కి సాఫ్ట్ కార్నర్ ఉంది అని తనకి

అభిమన్యు కి గొడవ అయినప్పుడల్లా శృతి ఇలానే ముభావం గా

ఉంటుంది అని.


రైల్వే స్టేషన్ కి టైం కి వెళ్లి హైదరాబాద్ ట్రైన్ ఎక్కారు.

ట్రైన్ లో యిద్దరూ చాలా సేపు మౌనం గానే వున్నారు. శ్రుతి

నందిత తో వాళ్ళ నాన్న గారి గురుంచి కంగారు పడవద్దు
అని చెప్పింది. ఎలాగు వాళ్ళు వెళ్దాము అనుకున్నారు

హైదరాబాద్ కి  రెండు రోజుల్లో, కానీ  ఇంకా ముందే వెళ్తున్నారు.

ఇంటర్నల్ ఎగ్జామ్స్ గురుంచి కొంచెము సేపు తరువాత రవి

వాళ్ళ చెల్లెలు పెళ్లి గురుంచి, వాళ్ళు పెళ్లి కూడ చూసి రావచ్చు

అనుకున్నారు.


ఎవరి ఊహల్లో వాళ్ళు కళ్ళు మూసుకుని పడుకున్నారు.
నందిత కి అభిమన్యు గురుంచే ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది.
అందుకనే ఏమో కల లో అభిమన్యు వచ్చాడు. అభిమన్యు
దేవదాసు అయినట్టు, తను అభిమన్యు ని అసలు పట్టిచ్చు
కొనట్టు, అసలు అభిమన్యు ఎవరో కూడ తనకి తెలియనట్టు.
ఇంకా ఏవేవో కలలు నందిత నిద్ర డిస్స్టర్బ్ చేస్తూనే ఉన్నాయి
రాత్రి అంతా. ఇటు శ్రుతి కి కి కూడ నందిత అభిమన్యు ల గురించి
, ఒక నిముషము తనకి అభిమన్యు కి పెళ్లి అయ్యినట్టు.
మల్లీ నందిత రాగానే అభిమన్యు శ్రుతి ని వదిలేసినట్టు.
చాలా విచిత్రమైన కలలతో ప్రయాణం సమాప్తమయింది.